Fact Check : తెలంగాణలో కోడి మరియు మద్యం పంపిణీ చేస్తున్న పాత వీడియోను ఇప్పుడు ఛత్తీస్‌ఘడ్ కు చెందినది అని పేర్కొంటూ షేర్ చేయబడుతోంది
- By: Jyoti Kumari
- Published: Dec 25, 2023 at 09:32 AM
కొత్త ఢిల్లీ (విశ్వాస్ న్యూస్)। దేశములోని అయిదు రాష్ట్రాలలో జరుగబోతున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యములో ఒక వీడియోను వైరల్ చేస్తూ ఈ వీడియో ఛత్తీస్‌ఘడ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించినది అని క్లెయిమ్ చేయబడుతోంది. వీడియోలో ప్రజలకు కోడి మరియు మద్యం పంచడాన్ని చూడవచ్చు.
వైరల్ వీడియోకు ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలకు ఎలాంటి సంబంధం లేదని విశ్వాస్ న్యూస్ తన దర్యాప్తులో కనుగొనింది. నిజానికి ఈ వీడియో 2022లో అప్పటి తెలంగాణ రాష్ట్ర సమితి మరియు ఇప్పటి భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్) నేత రాజనాల శ్రీహరి ప్రప్జలకు కోడి మరియు మద్యం పంచుతున్నప్పటిది. దీనిని ఇప్పటి ఛత్తీస్‌ఘడ్ ఎన్నికలకు సంబంధించినదిగా పేర్కొంటూ షేర్ చేస్తున్నారు.
ఏది వైరల్ అవుతోంది?
ఎక్స్ యూజర్ Krishna (ఆర్కైవ్ వర్షన్) నవంబరు 17, 2023 నాడు ఒక వైరల్ వీడియోను షేర్ చేస్తూ శీర్షికలో ఇలా వ్రాశారు, “ప్రజలకు ఈ అవకాశం ఇస్తే ఏ పార్టీ గెలవదు? #MadhyaPradeshElection2023 #Encounter #ఫిర్_ఇస్_బార్_భాజపా_సర్కార్ #అశోక్_గెహ్లోత్_మేరే_ఘర్ “అశోక్ సింఘల్” #అశోక్_గెహ్లోత్_మేరే_ఘర్ #RacingHeartsInChandigarh “ఛత్తీస్‌ఘడ్ అసెంబ్లీ ఎన్నికలు” #మేరా_వోట్_కాంగ్రెస్_కో “కాంగ్రెస్ కే మీ వోటు”
వేరొక ఫేస్బుక్ యూజర్ రాజు పాన్ (ఆర్కైవ్ లింక్) కూడా ఈ వీడియోను ఇటువంటి క్లెయిమ్ తో షేర్ చేశారు.
దర్యాప్తు
వైరల్ వీడియో గురించిన దర్యాప్తు కొరకు మేము సంబంధిత కీవర్డ్స్ (నేత+కోడి+మద్యం) తో సెర్చ్ చేశాము. ఈ సమయములో మాకు ఈ వీడియోకు సంబంధించి, ఇండియా టీవి వారి వెబ్సైట్ పై డిసెంబరు 16, 2022 నాడు ప్రసారం చేయబడిన ఒక రిపోర్ట్ లభించింది.
రిపోర్ట్ లో వీడియో యొక్క స్క్రీన్‌షాట్ ఉపయోగించబడింది. ఇవ్వబడిన సమాచారము ప్రకారము, టీఆరెస్ నేత రాజనాల శ్రీహరి 200 సజీవ కోళ్ళు మరియు 200 మద్యం సీసాలు పంచారు. శ్రీహరి వరంగల్ లో ముందుగా కూలీలను ఒకచోట చేర్చారు తరువాత ఒక సభ ఏర్పాటు చేశారు. ఆ తరువాత ఆయన కోడి మరియు మద్యం పంచారు. తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) ఇప్పుడు భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) గా అమరించి అని చెప్పార్.
మాకు వీడియోకు సంబంధించిన రిపోర్ట్ దైనిక్ జాగరణ్ యొక్క యూట్యూబ్ ఛానల్ పై లభించింది. అక్టోబరు 4, 2022 నాడు అప్లోడ్ చేయబడిన వీడియో రిపోర్ట్ ప్రకారం, తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ ద్వారా కొత్త పార్టీ ప్రారంభం గురించిన ప్రకటన అక్టోబరు 5న జరుగుతుంది. ఈ సమయములో పార్టీ నాయకులు ప్రజలకు మద్యం సీసాలు మరియు కోడి పంచారు.
ఇదివరకు కూడా ఈ వీడియో సోషల్ మీడియాపై వైరల్ అయ్యింది. ఆ సమయములో దీనిని కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించినదిగా షేర్ చేశారు. దీని గురించి కూడా విశ్వాస్ న్యూస్ దర్యాప్తు చేసింది. ఆ సమయములో మేము కర్ణాటక బీజేపి ప్రతినిధి ప్రతాప్ కుమార్ ను సంప్రదించాము. ఈ వైరల్ వీడియో పాతదని మరియు తెలంగాణకు చెందినది అని ఆయన మాకు తెలిపారు. దీనికి కర్ణాటక ఎన్నికలు మరియు బీజేపికి ఎలాంటి సంబంధం లేదు. ఫ్యాక్ట్ చెక్ రిపోర్ట్ ను ఇక్కడ చదవవచ్చు.
వార్తా నివేదికల ప్రకారము, ఛత్తీస్‌ఘడ్ లో అసెంబ్లీ ఎన్నికల రెండవ విడతలో నవంబరు 17న ఎన్నికలు జరుగాయి. ఈ ఎన్నికలు 19 జిల్లాలలో 70 సీట్ల కొరకు జరిగాయి. అదే 7 నవంబరు ఛత్తీస్‌ఘడ్ లోని 20 అసెంబ్లీ సీట్ల కొరకు మొదటి విడత ఎన్నికలు జరిగాయి. ఎన్నికల ఫలితాలు డిసెంబరు 3న వెలువడతాయి.
దర్యాప్తు చివరిలో మేము పాత వీడియోను ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికలతో జతచేసి షేర్ చేసిన యూజర్ స్కానింగ్ చేశాము. ఈ యూజర్ కు 1 వెయ్యి 562 మంది ఫాలోయర్స్ ఉన్నారని మేము కనుగొన్నాము. యూజర్ ఎక్స్ పై ఏప్రిల్ 2023 నుండి క్రియాశీలకంగా ఉన్నారు.
ముగింపు: కోడి మరియు మద్యం పంపిణీ చేసిన నేతకు సంబంధించిన వీడియో తెలంగాణకు చెందినది అని విశ్వాస్ న్యూస్ యొక్క దర్యాప్తులో తేలింది. 2022వ సంవత్సరానికి చెందిన వీడియో ఇప్పటి అసెంబ్లీ ఎన్నికలకు జతచేసి తప్పు క్లెయిమ్ తో షేర్ చేయబడుతోంది.
- Claim Review : ఎన్నికల నేపథ్యములో కోడి మరియు మద్యం పంపిణీ చేయబడ్డాయి।
- Claimed By : ఎక్స్ యూజర్ - Krishna
- Fact Check : False
Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.