వాస్తవ తనిఖీ: ఢిల్లీలో విద్యార్థుల ఘర్షణలో ఎలాంటి మతపరమైన కోణం లేదు; వైరల్ వీడియో తప్పుదోవపట్టించే క్లెయిమ్ తో షేర్ చేయబడింది.
- By: Abhishek Parashar
- Published: Apr 19, 2023 at 11:25 AM
కొత్త ఢిల్లీ (విశ్వాస్ న్యూస్): సోషల్ మీడియాలో ఒక వీడియో చక్కర్లుకొడుతోంది. ఈ వీడియోలో ఒక విద్యార్థి గాయాలతో ఒక ఆసుపత్రిలో స్ట్రెచర్ పై పడుకొని ఉండటం చూడవచ్చు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలను ఇతర యూజర్లు కూడా షేర్ చేశారు. ఢిల్లీలోని కరావల్ నగర్ లో ఒక మతవర్గానికి చెందినవారు హిందూ విద్యార్థిపై కత్తులతో దాడి చేశారని, 20 మంది విద్యార్థులు గాయపడ్డారని క్లెయిమ్ చేయబడుతోంది.
ఈ క్లెయిమ్ అసత్యమని మరియు రెచ్చగొట్టేవిధంగా ఉందని విశ్వాస్ న్యూస్ తన దర్యాప్తులో కనుగొనింది. ఈశాన్య ఢిల్లీలోని రెండు వేరువేరు పాఠశాలలో విద్యార్థుల మధ్య గొడవ జరిగింది. ఆ సమయములో అయిదుమంది విద్యార్థులు గాయపడ్డారు మరియు గురు తేజ్ బహాదూర్ ఆసుపత్రిలో చేర్పించబడ్డారు. కత్తిపోట్లకు సంబంధించిన ఈ కేసులో చర్య తీసుకునే సమయములో, పోలీసులు ఆరుమంది విద్యార్థులను అరెస్ట్ చేశారు. ఇదే సంఘటన తప్పు క్లెయిమ్ తో, దీనికి ఒక మతపరమైన కోణాన్ని ఆపాదించి వైరల్ చేయబడింది.
క్లెయిమ్:
సోషల్ మీడియా యూజర్ ‘విశాల్ ఫౌజ్దార్ సున్సున్వాల్’ ఈ వైరల్ వీడియోను (ఆర్కైవ్డ్ లింక్) షేర్ చేశారు, “అరవింద్ కేజ్రీవాల్…ఈరు ఢిల్లీ ముఖ్యమంత్రి…కళ్ళు తెరచి చూడండి, నువ్వు ఆశ్రయం ఇచ్చిన బంగ్లాదేశీయులు మరియు రోహింగ్యా ముస్లింలు హిందూ పిల్లల పట్ల ఏం చేస్తున్నారో, మీరు ఏం చేస్తున్నారు?? మార్చ్ 20వ తేదీన ఖజూరి నుండి కరావల్ నగర్ వరకు, ముస్లిం వర్గానికి చెందిన కొంతమంది హిందువుల పిల్లలు 12వ తరగతి పరీక్ష వ్రాసి తిరిగి వస్తుండగా వారిపై దాడి చేశారు. 20 మండికి పైగా పిల్లలు తీవ్రంగా గాయపడ్డారు. మీడియాలో ఎలాంటి వార్త లేదు, పోలీసులు మరియు నాయకులు అందరు ఎందుకు నిశ్శబ్దంగా ఉన్నారు….????
ఇదే వీడియోను ఇటువంటి క్లెయిమ్స్ తో ఇతర యూజర్లు అనేకమంది కూడా షేర్ చేశారు. ట్విట్టర్ పై చాలామంది యూజర్లు కూడ ఈ సంఘటనకు సంబంధించిన వీడియోను ఇదే క్లెయిమ్ తో షేర్ చేశారు.
దర్యాప్తు:
వార్తా సెర్చ్ లో ఇటువంటి రిపోర్ట్స్ చాలా లభించాయి, వీటిల్లో ఈ సంఘటన పేర్కొనబడింది. దైనిక్ జాగరణ్ లోని మార్చ్ 21 నాటి రిపోర్ట్ ప్రకారము, “ఢిల్లీ-ఆధారిత ప్రభుత్వ బాలుర సీనియర్ సెకండరీ పాఠశాల, కరావల్ నగర్ మరియు సర్వోదయ బాల విద్యాలయ, ఖజూరి ఖాస్ విద్యార్థుల మధ్య జరిగిన పెనుగులాటలో కరావల్ నగర్ కు చెందిన అయిదుమంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషయానికి సంబంధించి చర్య తీసుకుంటూ, ఢిల్లీ పోలీసులు నిందితులైన ఆరుమంది విద్యార్థులను నిర్బంధించారు.”
రిపోర్ట్ ప్రకారము, “3 రోజుల క్రితం దయాళ్పూర్ బస్ స్టాండ్ దగ్గర తన బైక్ మీద వెళ్తున్నప్పుడు, కొంతమంది బాలురు అతనిని ఆపారు అని విద్యార్థులలో ఒకరు చెప్పాడు అని అరెస్ట్ చేయబడిన నిందితులను ప్రశ్నించిన తరువాత పోలీసులు వెల్లడించారు. వాళ్ళు అతనిని అతని పాఠశాల గురించి మరియు పాఠశాల వద్ద అతని బైక్ నడపడం గురించి, తరువాత జరిగిన వివాదానికి కారణం గురించి అడిగారు.”
వార్తా ఏజెన్సీ ఏఎన్ఐ కూడా సంఘటన గురించిన సమాచారం అందించే సమయములో ఈ కేసులో ఆరుమంది విద్యార్థులను అరెస్ట్ చేయడం గురించి రిపోర్ట్ చేసింది. ఈ విషయములో ఢిల్లీ పోలీసుల ప్రకటనను కూడా ఏఎన్ఐ షేర్ చేసింది, దీని ప్రకారం ఈ వివాదములో ఎలాంటి మతపరమైన కోణం లేదు.
ది టైమ్స్ ఆఫ్ ఇండియా లో జాయ్ టిర్కీ, డిసిపి, ఈశాన్య ఢిల్లీ యొక్క ఒక రిపోర్ట్ లో“సంఘటనలోని నిందితులు మరియు బాధితులు ఒకే వర్గానికి చెందినవారు” అని చెప్తూ ఈ కేసులో మతపరమైన కోణం ఉండడాన్ని ఆయన ఖండించారు. ఈ కేసులో, పోలీసులు హత్యా ప్రయత్నం కేసు రిజిస్టర్ చేశారు.
సెర్చ్ లో మాకు ఝల్కో ఢిల్లీ అనే ఒక యూట్యూబ్ ఛానల్ యొక్క వీడియో బులెటిన్ మాకు లభించింది, ఇందులో ఈ కేసులో ఎలాంటి మతపరమైన కోణం లేదని మరియు దీనిలో ప్రమేయం ఉన్న బాలురు అందరు ఒకే వర్గానికి చెందిన వారు అని ఈశాన్య ఢిల్లీ యొక్క డిసిపి చెప్పడం స్పష్టంగా వినవచ్చు.
వైరల్ వీడియోకు సంబంధించి మేము తూర్పు పరిధి జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్, ఛాయ శర్మను సంప్రదించాము. “విద్యార్థుల రెండు వర్గాల మధ్య గొడవ మతపరమైనది కాదు” అని ఆయన చెప్పారు.
తప్పు క్లెయిమ్ తో వైరల్ పోస్ట్ ను షేర్ చేసిన యూజర్ ఒక నిర్దిష్ట భావజాలము వలన ప్రభావితం అయ్యారు అని అనిపిస్తోంది.
ముగింపు: ఢిల్లీ కరావల్ నగర్ లోని రెండు వేరువేరు పాఠశాలలకు చెందిన విద్యార్థుల మధ్య వివాదము మరియు కత్తిపోట్లకు సంబంధించిన సంఘటనను సోషల్ మీడియాలో మతపరమైన రంగు పులిమి హానికరమైన ఉద్దేశముతో షేర్ చేయబడింది. ఈ సంఘటనలో ఎలాంటి మతపరమైన కోణము లేదు.
- Claim Review : ఢిల్లీలో ముస్లిం వర్గానికి చెందిన విద్యార్థులు హిందు విద్యార్థులపై కత్తులతో దాడి చేశారు
- Claimed By : ఎఫ్బి యూజర్: విశాల్ ఫౌజ్దార్ సున్సున్వాల్
- Fact Check : False
Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.