Fact Check: డెహ్రాడూన్ ఘంటాఘర్ యొక్క వీడియో తప్పుదోవపట్టించే క్లెయిమ్స్ తో వైరల్ అవుతోంది
- By: Ashish Maharishi
- Published: Feb 1, 2024 at 06:53 PM
కొత్త ఢిల్లీ, విశ్వాస్ న్యూస్ – అయోధ్యలోని రామమందిరములో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ వేడుక తేదీ సమీపిస్తున్న నేపథ్యములో, సోషల్ మీడియాలో దానికి సంబంధించిన పోస్ట్స్ ఎక్కువ అయ్యాయి. వీటిల్లో కొన్నిటి గురించి విశ్వాస్ న్యూస్ పరిశీలించి, కొన్ని నకిలీవని మరియు మరికొన్ని తప్పుదోవపట్టించేవి అని వెల్లడించింది. శ్రీరాముడి విగ్రహాన్ని ఒక క్లాక్ టవర్ పై చూపించే ఒక వీడియో ఇటీవల వైరల్ అయ్యింది. ఇది శ్రీనగర్ లోని లాల్ చౌక్ లో చిత్రీకరించబడిందనే క్లెయిమ్స్ తో ఈ వీడియోను ఎక్కువగా షేర్ చేస్తున్నారు.
విశ్వాస్ న్యూస్ నిర్వహించిన దర్యాప్తులో, కొంతమంది సోషల్ మీడియా యూజర్లు డెహ్రాడూన్ కు చెందిన ఒక వీడియోను శ్రీనగర్ లోని లాల్ చౌక్ కు చెందినదిగా తప్పుగా తెలుపుతూ ప్రచారం చేస్తున్నారు అని కనుగొనబడింది. మా దర్యాప్తు ఇది తప్పుదోవపట్టించే వైరల్ పోస్ట్ అని ధృవీకరించింది.
ఏది వైరల్ అవుతోంది?
ఫేస్బుక్ పేజ్ “హిందూ హెల్ప్ లైన్ ఢిల్లీ” జనవరి 18, 2021 నాడు ఒక వీడియోను పోస్ట్ చేస్తూ, ఇలా క్లెయిమ్ చేసింది, “త్రివర్ణ పతాకం కూడా ఎగరని శ్రీనగర్ లోని లాల్ చౌక్, ఈరోజు అక్కడ శ్రీరాముడు కూర్చున్నాడు…..జై హిందూ రాష్ట్ర, ఇప్పుడు హిందువులు ముందున్నారు.” దీనిని నిజమని విశ్వసిస్తూ, ఇతర యూజర్లు కూడా ఈ పోస్ట్ ను షేర్ చేస్తున్నారు.
దర్యాప్తు:
వైరల్ వీడియోల గురించి సమాచారాన్ని సేకరించుటకు విశ్వాస్ న్యూస్ ఇన్విడ్ టూల్ ఉపయోగించింది. వైరల్ వీడియోల నుండి మేము అనేక స్క్రీన్ షాట్స్ ను సేకరించాము. తర్వాత, మేము గూగుల్ లెన్స్ టూల్ ఉపయోగించి అసలైన వీడియోను గుర్తించాము. గూగుల్ లెన్స్ ద్వారా సెర్చ్ ద్వారా ఇంటర్నెట్ పై వైరల్ అయిన వీడియో వంటి అనేక వీడియోలు కనుగొనబడ్డాయి. జనవరి 15, 2024 నాడు యూట్యూబ్ ఛానల్ పై అప్లోడ్ చేయబడిన మరియు ఇది డెహ్రాడూన్ కు సంబంధించినది అనే క్లెయిమ్స్ తో ఇటువంటి వీడియో ఒకటి, మాకు లభించింది.
దర్యాప్తును ముందుకు కొనసాగిస్తూ, గూగుల్ ఓపెన్ సెర్చ్ టూల్ ఉపయోగించి వీడియో సెర్చ్ చేయబడింది. అనేక మీడియా రిపోర్ట్స్ డెహ్రాడూన్ లోని క్లాక్ టవర్ పై అనేక ఎల్ఈడి స్క్రీన్స్ మరియు లేజర్ లైట్ల వినియోగాన్ని ధృవీకరించాయి. ఈటివి భారత్ యొక్క వెబ్సైట్ పై జనవరి 16, 2024 నాటి ఒక వార్తా వ్యాసములో డెహ్రాడూన్ యొక్క హృదయస్థానముగా ప్రస్తావించబడిన క్లాక్ టవర్ రమ్మాయిగా మార్చబడిందని స్పష్టం చేసింది. ఆ ప్రదేశములో రాముని కీర్తనలు ఆలపించడముతో అందరిని ఆకట్టుకొని ఒక భక్తి వాతావరణాన్ని సృష్టించింది. అంతేకాకుండా, ఎల్ఈడి స్క్రీన్స్ మరియు లేజర్ లైట్లు ప్రాణప్రతిష్ఠ వేడుకకు అందరికి ఆహ్వానాన్ని అందించుటకు ఉపయోగించబడ్డాయి.
దర్యాప్తు యొక్క తదుపరి దశలో, మేము డెహ్రాడూన్ లోని క్లాక్ టవర్ గురించిన సమాచారము కొరకు మేము గూగుల్ మ్యాప్స్ ఉపయోగించాము మరియు స్ట్రీట్ వ్యూ ను యాక్సెస్ చేశాము. విచారణలో ముందుకు సాగుతూ, విశ్వాస్ న్యూస్ డెహ్రాడూన్ లోని దైనిక్ జాగరణ్ లో విలేఖరి అయిన అంకుర్ అగర్వాల్ ను కలిసింది. విశ్లేషణ కొరకు వైరల్ వీడియోను అతనితో షేర్ చేశాము. విలువైన సమాచారాన్ని అందిస్తూ, వైరల్ వీడియో డెహ్రాడూన్ లో ఉన్న ఘంటాఘర్ కు సంబంధించినది అని ఆయన ధృవీకరించారు.
అంతేకాకుండా, కనుగొన్నవాటిని పటిష్టం చేయటానికి, దైనిక్ జాగరణ్, జమ్మూ మరియు కాశ్మీర్ లో సీనియర్ కరెస్పాండెంట్ అయిన నవీన్ నవాజ్ ను విశ్వాస్ న్యూస్ సంప్రదించింది. నవీన్ నవాజ్ సమాచారము యొక్క ప్రామాణికతను ధృవీకరించారు మరియు వైరల్ పోస్ట్ నకిలీది అని పేర్కొన్నారు.
దర్యాప్తు చివరిలో, హిందు హెల్ప్ లైన్ ఢిల్లీ యొక్క ఫేస్బుక్ పేజ్ స్కాన్ చేయబడింది. ఈ పేజ్ ను 5,000 మంది ఫాలో అవుతున్నారు.
ముగింపు: విశ్వాస్ న్యూస్ సమగ్ర విచారణ జరిపింది. శ్రీనగర్ లోని లాల్ చౌక్ కు చెందినదిగా క్లెయిమ్ చేయబడిన వైరల్ వీడియో నిజానికి డెహ్రాడూన్ కు సంబంధించినది అని ఇందులో వెల్లడి అయ్యింది.
- Claim Review : శ్రీనగర్ లోని లాల్ చౌక్ వద్ద శ్రీ రాముని విగ్రహము
- Claimed By : హిందూ హెల్ప్ లైన్ ఢిల్లీ
- Fact Check : Misleading
Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.