కొత్త ఢిల్లీ (విశ్వాస్ న్యూస్): సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఒక వీడియో ప్రధాన మంత్రి నరేంద్ర మోడిని ఒక మహిళ పొగడటం చూపుతుంది. ఆ మహిళ సిపిఐ(ఎం) నేత సుభాషిణి ఆలి అని క్లెయిమ్స్ తెలుపుతున్నాయి.
అయితే, విశ్వాస్ న్యూస్ ఈ విషయం గురించి దర్యాప్తు చేసి, క్లెయిమ్ తప్పుదోవపట్టించేది అని, వైరల్ వీడియోలో ఉన్న మహిళ సుభాషిణి ఆలీ కాదు అని కనుగొనింది.
మే 2, 2024 నాడు, ఫేస్బుక్ యూజర్ సురేందర్ ఉడాన ఒక మహిళ – “రాహుల్ గాంధి బదులు, దేశము ప్రధాన మంత్రి మోడికి వోట్ చేయాలి” అని చెప్తున్న ఒక వైరల్ పోస్ట్ ను షేర్ చేశారు. ఈ పోస్ట్ ను షేర్ చేస్తూ, ఆయన ఇలా వ్రాశారు, “రాహుల్ గాంధి మరియు మోడి గురించి సీనియర్ సిపిఎం నేత సుభాషిణి ఆలీ ఏమన్నారు”?
పోస్ట్ యొక్క ఆర్కైవ్ లింక్ ను ఇక్కడ చూడండి.
వైరల్ వీడియో యొక్క ప్రామాణికతను ధృవీకరించుటకు, మేము దానిని జాగ్రత్తగా సమీక్షించాము. వీడియోలో ఉన్న మహిళ 65 సంవత్సరాల వయసు ఉన్నదిగా క్లెయిమ్ చేయబడుతోంది. అయితే, దర్యాప్తు చేసిన తరువాత, డిసెంబర్ 29, 1947లో కాన్పూర్ లో జన్మింఇన సుభాషిణి ఆలీ 76 సంవత్సరాల వయసు కలది, 65 కాదు.
తదుపరి, మేము ఈ ఒరిజినల్ వీడియోను కనుక్కోవాలని నిర్ణయించుకున్నాము. వైరల్ వీడియోలో, 99 ఖబర్ అని వ్రాసి ఉన్న ఒక మైక్ ఇంటర్వ్యూ చేసే వ్యక్తి చేతిలో కనిపిస్తుంది. మా దర్యాప్తులో, మాకు 99 ఖబర్ యొక్క యూట్యూబ్ ఛానల్ కనిపించింది. కూలంకషంగా సమీక్షించిన తరువాత, ఆయన వీడియోలు ఒకదానిలో ఈ వైరల్ క్లిప్ కనిపించింది. డిసెంబర్ 1, 2023 నాడు అప్లోడ్ చేయబడిన ఈ వీడియోకు ఈ విధంగా శీర్షిక ఇవ్వబడింది, “మోడి పాలనలో మహిళల బట్టలు తొలగించబడుతున్నాయా? ఒక 65-సంవత్సరాల మహిళ విమర్శకుల నోరుమూయించింది”
ఈ వీడియోలో ఎక్కడా సుభాషిణి ఆలీ ప్రస్తావన లేదు.
ఈ పేజ్ లో ఇతర వీడియోలు సమీక్షించిన తరువాత, వాటికి ప్రస్తుత శీర్షికలపై అభిప్రాయం కొరకు వాళ్లు బాటసారులను ప్రశ్నించే అదే ఫార్మాట్ ఉందని స్పష్టం అయ్యింది.
దీని తరువాత, రాహుల్ గాంధి మరియు నరేంద్ర మోడికి సంబంధించి సుభాషిణి ఆలీ ఇటువంటి ప్రకటన చేశారా అని నిర్ధారించటానికి మేము వార్తలను సెర్చ్ చేశాము. కీవర్డ్స్ తో సెర్చ్ చేసిన తరువాత కూడా, మాకు అతని నుండి ఇలాంటి ప్రకటన ఏది కనిపించలేదు.
మేము సుభాషిణి ఆలీ యొక్క వీడియోలు మరియు ఫోటోల కోసం కూడా సెర్చ్ చేశాము మరియు ఆమె వీడియోలు చాలా కనుగొన్నాము, కాని ఆమె ఆకారము, మాట్లాడే తీరు, నడక మరియు స్వరము అన్నీ వైరల్ వీడియోలో కనిపించిన మహిళ నుండి భిన్నంగా ఉన్నాయి. ఇద్దరి మధ్య వ్యత్యాసము ఈ క్రింది కొల్లాజ్ లో చూడవచ్చు.
దీనికి సంబంధించి, మేము 99 ఖబర్ విలేఖరి జైదీప్ తో మాట్లాడాము, వీడియోలో సుభాషిణి ఆలీ లేదని ఆయన ధృవీకరించారు.
చివరిగా, ఫేస్బుక్ యూజర్ సురేందర్ ఉడానా యొక్క ఖాతాను స్కాన్ చేసిన తరువాత, ఆయన షేర్ చేసే పోస్ట్ లు అన్నీ ఒక భావజాలానికి సంబంధించినవి అని మరియు ఆయన హర్యాణా నివాసి అని కనుగొన్నాము.
ముగింపు: వైరల్ క్లెయిమ్ నకిలీది అని తన దర్యాప్తులో విశ్వాస్ న్యూస్ కనుగొనింది. వైరల్ వీడియోలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడిని పొగుడుతున్న మహిళ సిపిఐ(ఎం) నేత సుభాషిణి ఆలీ కాదు.
Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923