వాస్తవ తనిఖీ: ఒక పాత వీడియో ఒక గుంపు క్రిస్టియన్ వ్యక్తిని కొడుతున్నారనే తప్పుదోవపట్టించే క్లెయిమ్ షేర్ చేయబడింది
- By: Abhishek Parashar
- Published: Apr 17, 2023 at 08:36 AM
కొత్త ఢిల్లీ (విశ్వాస్ న్యూస్): భారతదేశములో క్రిస్టియన్ సామాజిక వర్గముపై దాడికి సంబంధించినది అనే ఒక క్లెయిమ్ తో ఒక వీడియో సోషల్ మీడియాపై చక్కర్లు కొడుతోంది. ఒక క్రిస్టియన్ వ్యక్తిని హిందూ వర్గానికి చెందిన వారు కనికరం లేకుండా కొట్టారు అని క్లెయిమ్ చేయబడింది. ఈ క్లెయిమ్ తప్పుదోవపట్టించేది అని విశ్వాస్ న్యూస్ తన దర్యాప్తులో కనుగొనింది. వైరల్ వీడియో గుజరాత్ లోజరిగిన ఒక సంఘటనకు సంబంధించినది.
క్లెయిమ్:
వైరల్ వీడియోను షేర్ చేస్తూ సోషల్ మీడియా యూజర్ (archive లింక్) ‘ఎలిజిబెత్ తపా’ ఇలా వ్రాశారు, “భారతదేశములో ఒక హిందువుల సమూహముచే క్రిస్టియన్ వ్యక్తిపై దాడి. గుంపులుగా కొట్టడాలు ఎక్కువ అవుతున్న ఒక దేశము.” ఇదే వీడియోను చాలా మంది ఇతర యూజర్లు కూడా ఇటువంటి క్లెయిమ్స్ తో షేర్ చేశారు.
దర్యాప్తు:
వైరల్ వీడియోలో, కొంతమమ్ది కనికరము లేకుండా ఒక వ్యక్తిని కొట్టడం చూడవచ్చు. వైరల్ వీడియోలోని కొన్ని కీలక ఫ్రేమ్స్ యొక్క రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసిన తరువాత, ది ఇండియన్ ఎక్స్ప్రెస్ యొక్క వెబ్సైట్ పై డిసెంబర్ 23, 2022 నాడూ ఒక రిపోర్ట్ ప్రచురించబడింది. ఇందులో వీడియో యొక్క స్క్రీన్ షాట్స్ ఉపయోగించబడ్డాయి.
ఒక దళిత యువకుడిని ఏడుమంది కలిసి వడోదరాలో కొట్టారు అని ది ఇండియన్ ఎక్స్ప్రెస్ వార్తా రిపోర్ట్ పేర్కొనింది. అంతేకాకుండా, ఈ సంఘటనకు సంబంధించి అయిదుమంది పట్టుబడ్డారు అని ఈ వార్తా రిపోర్ట్ పేర్కొనింది. “సోషల్ మీడియాపై ఒక వీడియో వైరల్ అయ్యింది. ఇందులో అల్పీష్ పార్మర్ అనే 24-సంవత్సరాల ఒక యువకుడిని ఏడుగురు కలిసి కొట్టడం చూడవచ్చు. ఈ కేసులో చర్య తీసుకుంటూ పోలీసులు అయిదుమందిని అరెస్ట్ చేశారు,” అని వార్తా రిపోర్ట్ పేర్కొనింది.
గుజరాత్ లో కాంగ్రెస్ పార్టీ ఎంఎల్ఏ జిగ్నేష్ మెవాని కూడా ఈ వీడియోను షేర్ చేసే సమయములో ప్రధానమంత్రి నరేంద్ర మోడీని టార్గెట్ చేశారు.
డిసెంబరు 21, 2022 నాడు ప్రచురించబడీన దివ్య భాస్కర్ యొక్క అహ్మదాబాద్ ఎడిషన్ కూడా బాధితుడు ఒక దళితుడు అని వివరించింది.
చాలా ఇతర రిపోర్ట్స్ కూడా ఈ సంఘటన గురించి ప్రస్తావించాయి, వీటిల్లో బాధిత యువకుడు ఒక దళితుడు అని పేర్కొనబడింది. వైరల్ వీడియోకు సంబంధించి మేము జాగరణ్ గుజరాతి డెప్యూటి ఎడిటర్ రాజేంద్ర సింగ్ పార్మర్ ను సంప్రదించాము. “ఈ సంఘటనలో బాధితుడైన యువకుడు ఒక దళితుడు.” అని ఆయన చెప్పారు.
ముగింపు: గత సంవత్సరం గుజరాత్ లోని వడోదరాలో ఒక దళిత యువకుడిపై దాడికి సంబంధించిన వీడియో, ఇటీవల ఒక క్రిస్టియన్ యువకుడిని కొంతమంది కలిసి కొట్టారు అనే ఒక తప్పు క్లెయిమ్ తో షేర్ చేయబడింది.
- Claim Review : హిందూ సామాజిక వర్గానికి చెందిన కొంతమంది ఒక క్రిస్టియన్ వ్యక్తిని కనికరము లేకుండా కొట్టారు
- Claimed By : ఎఫ్బి యూజర్: ఎలిజిబెత్ తపా
- Fact Check : Misleading
Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.