నిజ నిర్ధారణ : తెలంగాణలో బిజెపి-టిఆర్ఎస్ (BJP-TRS) కార్యకర్తల మధ్య పోరుకు సంబంధించిన పాత వీడియో, ఈ మధ్య గుజరాత్ లో జరిగినట్లుగా వైరల్
రాజకీయ పార్టీల కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణకి సంబంధించిన వైరల్ వీడియో గుజరాత్ లో జరిగినట్లుగా షేర్ చేయబడింది, ఇది తెలంగాణలోని జనగాం పట్టణానికి చెందిన ఒక పాత వీడియో.
- By: ankit sharma
- Published: Sep 7, 2022 at 11:35 AM
న్యూఢిల్లీ (విశ్వాస్ న్యూస్): విశ్వాస్ న్యూస్ సోషల్ నెట్వర్కింగ్ ప్లాట్‌ఫారమ్ లలో బాగా తిరుగుతున్న ఒక వీడియోను చూసింది. రెండు రాజకీయ వర్గాల మధ్య జరిగిన ఘర్షణను ఈ వీడియోలో చూడవచ్చు. ఈ వీడియో గుజరాత్ కు చెందినదని, ఈ మధ్యనే జరిగినదని సోషల్ మీడియా యూజర్లు చెబుతున్నారు.
అయితే ఈ వీడియో బిజెపి, టిఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణకు సంబంధించిన పాత వీడియో అని విశ్వాస్ న్యూస్ తన దర్యాప్తులో తెలుసుకున్నది.
క్లయిమ్ :
ట్విట్టర్ యూజర్ అయిన ధర్మేంద్ర వావ్లియా తన ప్రొఫైల్ మీద ఒక వీడియోను షేర్ చేసి గుజరాతీలో ఇలా వ్రాశారు: డిలీట్ చేయబడింది
అనువాదం: ఇంతకు ముందు ఇతర రాష్ట్రాలలో బిజెపి సభ్యులకి చేదు అనుభవం కలిగించడం జరుగుతూనే ఉండేది, అయితే ఇప్పుడు అది గుజరాత్ లో కూడా ఇది జరుగుతోంది.
పోస్ట్ మరియు ఆర్కైవ్ వెర్షన్ ను ఇక్కడ చూడండి.
విచారణ:
విశ్వాస్ న్యూస్ వైరల్ పోస్ట్ లో చేసిన వ్యాఖ్యలను పరిశీలించడం కోసం తన దర్యాప్తును ప్రారంభించింది.
ఈ వీడియో గుజరాత్ లో జరిగినది కాదని చాలా మంది యూజర్లు అన్నారు.
విశ్వాస్ న్యూస్ ఆ వీడియోను ఇన్విడ్ టూల్ లో అప్ లోడ్ చేసి స్క్రీన్ గ్రాబ్ లను బయటికితీసింది.
మేము కొన్ని స్క్రీన్ గ్రాబ్ లను జూమ్ చేసి చూసి కొన్ని విషయాలను తెలుసుకున్నాము. దుకాణాలకి ఉన్న బోర్డులు దక్షిణ భారత భాషలో ఉన్నాయి మరియు పోలీసు స్టాప్ వీడియోలో ‘జనగావ్ ట్రాఫిక్ పోలీస్’ అని స్పష్టంగా చదవవచ్చును.
ఈ వీడియోలో ఉన్న గులాబీ రంగు జెండాలు తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) కార్యకర్తలని సూచిస్తున్నాయి. అందువలన ఈ వీడియో తెలంగాణకు చెందినదని స్పష్టంగా తెలుస్తోంది.
సరైన కీ వర్డ్ లతో వెతికిన తరువాత, ఫిబ్రవరి 10, 2022 న వన్ఇండియా న్యూస్ లో అప్లోడ్ చేసిన యూట్యూబ్ వీడియో మాకు కనిపించింది. ప్రధానికి వ్యతిరేకంగా మోదీ వ్యతిరేక నిరసనకు పిలుపునిచ్చిన తరువాత తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్, బిజెపి ల మధ్య ఘర్షణలు చెలరేగాయి.
ఈ యూట్యూబ్ వీడియో వైరల్ అయిన వీడియోలాగానే ఉన్నది.
దర్యాప్తులో తదుపరి భాగంగా విశ్వాస్ న్యూస్ తెలంగాణను కవర్ చేస్తున్న జర్నలిస్ట్ రాహుల్ దేవులపల్లిని సంప్రదించింది. వైరల్ వీడియో పాతదని, తెలంగాణలోని జనగాం పట్టణానికి చెందినదని ఆయన ధృవీకరించారు.
విచారణ చివరి దశలో విశ్వాస్ న్యూస్ వైరల్ వీడియోను షేర్ చేసిన సోషల్ మీడియా యూజర్ గురించిన సోషల్ బ్యాక్ గ్రౌండ్ చెక్ చేసింది. ధర్మేంద్ర వావ్లియా గుజరాత్ లోని సూరత్ కు చెందినవాడని, ఒక రాజకీయ పార్టీకి చెందిన వారని మాకు తెలిసింది. ఆయన జనవరి 2021 లో ట్విట్టర్ లో చేరారు.
निष्कर्ष: రాజకీయ పార్టీల కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణకి సంబంధించిన వైరల్ వీడియో గుజరాత్ లో జరిగినట్లుగా షేర్ చేయబడింది, ఇది తెలంగాణలోని జనగాం పట్టణానికి చెందిన ఒక పాత వీడియో.
- Claim Review : ఇంతకు ముందు ఇతర రాష్ట్రాలలో బిజెపి సభ్యులకి మెంతికూర రుచి చూపించడం జరుగుతూ ఉండేది, ఇప్పుడు గుజరాత్ లోనూ ఇది జరుగుతోంది.
- Claimed By : ధర్మేంద్ర వావ్లియా
- Fact Check : False
Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.