నిజ నిర్ధారణ : లేదు, హిందూ నూతన సంవత్సరాన్ని గుర్తించే బిల్లు ఏదీ అమెరికాలో ఆమోదం పొందలేదు
విశ్వాస్ టీమ్ దర్యాప్తులో, ఈ పోస్ట్ నకిలీదని తేలింది. హిందూ నూతన సంవత్సరాన్ని గుర్తించే ఏ బిల్లు కూడా అమెరికాలో ఆమోదం పొందలేదు.
- By: Pallavi Mishra
- Published: Aug 29, 2022 at 10:39 AM
- Updated: Aug 31, 2022 at 11:54 AM
న్యూఢిల్లీ (విశ్వాస్ న్యూస్). అమెరికాలో హిందూ నూతన సంవత్సరాన్ని గుర్తించిన ఒక బిల్లు ఆమోదం పొందిందని పేర్కొంటూ సోషల్ మీడియాలో ఒక టెక్స్ట్ వైరల్ అవుతోంది. విశ్వాస్ టీమ్ దర్యాప్తులో ఈ పోస్ట్ తప్పు అని తేలింది. అమెరికాలో ఆ విధమయిన బిల్లు ఏదీ ఆమోదం పొందలేదు.
వైరల్ పోస్ట్ లో ఏముంది
ఫేస్ బుక్ పేజీ ‘భాజపా కార్యాలయం’ అనే పోస్ట్ ను అప్ లోడ్ చేసింది, ఇది “బిగ్ బ్రేకింగ్. హిందూ నూతన సంవత్సరాన్ని గుర్తించి US లో బిల్లు ఆమోదం పొందింది. సనాతన ఢంకా ప్రపంచవ్యాప్తంగా మోగుతోంది. జై శ్రీరామ్”
వైరల్ పోస్ట్ అయిన ఆర్కైవ్ లింక్ ను ఇక్కడ చూడవచ్చు.
విచారణ
మా పరిశోధనను ప్రారంభించడానికి, ముందుగా కీవర్డ్ సర్చ్ చేశాము. ఆ విధమయిన వార్తలు ఏవీ మాకు ఎక్కడా కనబడలేదు. అయితే, జార్జియా గవర్నర్ బ్రియాన్ కెంప్, హిందువులు ఎక్కువగా ఉన్న రాష్ట్రంలో హిందూ సమాజాన్ని ప్రశంసిస్తూ ఏప్రిల్ 2 ను హిందూ నూతన సంవత్సర దినంగా ప్రకటించారని న్యూస్ వచ్చింది. కానీ అది బిల్లు కాదు.
ఈ విషయంలో ఇంకా మేము హిందూ అమెరికన్ ఫౌండేషన్ అసోసియేట్ డైరెక్టర్ అనితా జోషితో మాట్లాడాము. ‘హిందూ నూతన సంవత్సరాన్ని గుర్తిస్తూ అమెరికాలో బిల్లు ఏమీ ఆమోదం పొందలేదు. నవంబర్ 2021 లో, దీపావళిని జాతీయ సెలవుదినంగా చేయాలని ఒక బిల్లును ప్రవేశపెట్టారు, కాని ఆ బిల్లు ఇంకా కమిటీలోనే ఉంది, కాబట్టి అది ఇంకా ఆమోదించబడడం లేదా తిరస్కరించబడడం జరగలేదు. ఇది కాకుండా, హిందూ పండుగలు లేదా గుర్తింపులకు సంబంధించి ఎటువంటి బిల్లులు లేవు.
చివరగా, మేము నకిలీ పోస్ట్ వైరల్ చేసిన ఫేస్ బుక్ యూజర్ అయిన ‘భాజపా కార్యాలయం’ పేజీని స్కాన్ చేశాము. ఈ పేజీకి 500 మందికి పైగా ఫాలోవర్స్ ఉన్నారు.
निष्कर्ष: విశ్వాస్ టీమ్ దర్యాప్తులో, ఈ పోస్ట్ నకిలీదని తేలింది. హిందూ నూతన సంవత్సరాన్ని గుర్తించే ఏ బిల్లు కూడా అమెరికాలో ఆమోదం పొందలేదు.
- Claim Review : బిగ్ బ్రేకింగ్. హిందూ నూతన సంవత్సరాన్ని గుర్తించి US లో బిల్లు ఆమోదం పొందింది. సనాతన ఢంకా ప్రపంచవ్యాప్తంగా మోగుతోంది. జై శ్రీరామ్
- Claimed By : ఫేస్ బుక్ యూజర్ భాజపా కార్యాలయం
- Fact Check : False
Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.