వాస్తవ తనిఖీ: బిబిసి పేరున మార్ఫింగ్ చేయబడిన ఒక ఫోటో వైరల్ అయ్యింది, బ్లాక్ ఫంగస్-గోమూత్రానికి సంబంధించిన ఈ రిపోర్ట్ నకిలీది.
ముగింపు: విశ్వాస్ న్యూస్ యొక్క దర్యాప్తులో బిబిసి పేరు ఉపయోగించి చేసిన వైరల్ క్లెయిమ్ నకిలీది అని తేలింది. బిబిసి పేరున బ్లాక్ ఫంగస్ మరియు గోమూత్రానికి సంబంధం ఉంది అని తెలిపే ఏ వ్యాసము ప్రచురించబడలేదు.
- By: ameesh rai
- Published: Jun 10, 2021 at 03:41 PM
న్యూస్ (కొత్త ఢిల్లీ) – బిబిసిపై ఆరోపించబడినట్లుగా ఉన్న ఒక వ్యాసము సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో బ్లాక్ ఫంగస్ ను గోమూత్రానికి సంబంధం ఉందని చెప్పబడుతోంది. భారతీయ శాస్త్రజ్ఞులకు బ్లాక్ ఫంగస్ యొక్క 9000 కేసులలో గోమూత్రము యొక్క అనుసంధానం లభించింది అని ఈ వ్యాసములో ఆరోపించబడింది. విశ్వాస్ న్యూస్ దర్యాప్తులో ఈ ఆరోపణ అవాస్తవము అని తేలింది. బిబిసి ఇటువంటి వ్యాసాన్ని ప్రచురించలేదు. బిబిసి పేరును దుర్వినియోగం చేస్తూ మార్ఫింగ్ చేయబడిన ఫోటో వైరల్ చేయబడుతోంది.
ఏది వైరల్ అవుతోంది
ఫేస్బుక్ పేజ్ Kashmir live news మే 25, 2021 నాడు ఈ వైరల్ స్క్రీన్‌షాట్ ను షేర్ చేసింది. ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వర్షన్ ను ఇక్కడ క్లిక్ చేసి చూడవచ్చు. ఈ విధంగానే ఫేస్బుక్ యూజర్ వసీం ఖాన్ కూడా ఏ 26, 2021 నాడు ఈ వైరల్ స్క్రీన్‌షాట్ ను షేర్ చేశారు. ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వర్షన్ ను ఇక్కడ క్లిక్ చేసి చూడవచ్చు.
దర్యాప్తు
విశ్వాస్ న్యూస్ ముందుగా ఆ వైరల్ స్క్రీన్‌షాట్ ను నిశితంగా పరిశీలించారు. బిబిసి యొక్క వ్యాసము అని ఆరోపించబడుతున్న ఈ స్క్రీన్‌షాట్ లో Soutik Biswas బైలైన్ పేర్కొనబడింది. విశ్వాస్ న్యూస్ బిబిసి యొక్క సైట్ సందర్శించి సౌతిక్ బిశ్వాస్ గురించి శోధించారు. మాకు మే 23, 2021 నాడు ఆయన బైలైన్ ద్వారా ప్రచురించబడిన ఒక రిపోర్ట్ లభించింది. ఈ రిపోర్ట్ లో భారతదేశములో బ్లాక్ ఫంగస్ ఇన్ఫెక్షన్ సంబంధించి సుమారు 9000 కేసులు నమోదు అయ్యాయి. దీనిలో గోమూత్రము గురించి ఎక్కడా ప్రస్తావన లేదు. ఈ వ్యాసాన్ని ఇక్కడ క్లిక్ చేసి చూడవచ్చు.
విశ్వాస్ న్యూస్ వైరల్ అయిన స్క్రీన్‌షాట్ మరియు బిబిసి యొక్క వెబ్సైట్ లో ప్రచురించబడిన అసలైన రిపోర్ట్స్ లను కూడా పోల్చి చూసింది. బిబిసి యొక్క వెబ్సైట్ లో ప్రచురించబడిన రిపోర్ట్స్ యొక్క మొదటి పారా బోల్డ్ లోఉంటుంది, కాని వైరల్ స్క్రీన్‌షాట్ అలా లేదు. అంతే కాకుండా వైరల్ స్క్రీన్‌షాట్ మరియు అసలైన రిపోర్ట్స్ యొక్క ఫాంట్ సైజ్ లలో కూడా వ్యత్యాసము ఉంది. ఆ విషయాన్ని మీరు ఎ ఎదిగువన చూడవచ్చు.
వైరల్ స్క్రీన్‌షాట్ (ఎడమవైపు) మరియు అసలైన రిపోర్ట్స్ లోని స్టైల్ షీట్ లలో కూడా చాలా వ్యత్యాసం ఉంది.
విశ్వాస్ న్యూస్ సౌతిక్ విశ్వాస్ సోషల్ మీడియా హ్యాండిల్స్ కూడా శోధించింది. అటువంటి రిపోర్ట్ ఏదీ ఆయన అధికారిక ట్విట్టర్ హ్యాండల్ లేదా ఫేస్బుక్ ప్రొఫైల్ లో లభించలేదు. అంతేకాకుండా ఒక ట్విట్టర్ యూజర్ కు సౌతిక్ విశ్వాస్ ఇచ్చిన సమాధానం లభించింది. Ziya (@writeziya) పేరున ఒక్క ట్విట్టర్ హ్యాండిల్, వైరల్ అయిన స్క్రీన్‌షాట్ షేర్ చేస్తూ సౌతిక్ విశ్వాస్ ను ట్యాగ్ చేసి ఈ వార్త అతనిదేనా అని అడిగారు. దానికి సౌతిక్ సమాధానం ఇస్తూ ఇది నకిలీ వార్త అని తెలిపారు. ట్విట్టర్ లో జరిగిన ఈ ప్రశ్నోత్తర సంభాషణను ఇక్కడ చూడవచ్చు.
విశ్వాస్ న్యూస్ వైరల్ అయిన స్క్రీన్‌షాట్ సంబంధించి సౌతిక్ విశ్వాస్ గారిని సంప్రదించింది. ఆయన ఇది నకిలీ వార్త అని చెప్పారు. ఈ విషయమై విశ్వాస్ న్యూస్ మెయిల్ ద్వారా బిబిసి ని సంప్రదించింది. ఇది నకిలీ పోస్ట్ అని బిబిసి ప్రతినిధి కూడా మాతో చెప్పారు. పాఠకులు మా వెబ్సైట్ bbc.com/news ను సందర్శించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
విశ్వాస్ న్యూస్ ఈ వైరల్ స్క్రీన్‌షాట్ షేర్ చేసిన ఫేస్బుక్ యూజర్ Wasim Khan యొక్క ప్రొఫైల్ ను స్కాన్ చేసింది. యూజర్ రాంపుర్, యూపి నివాసి మరియు వాస్తవ తనిఖీ చేసే నాటి వరకు ఈ ప్రొఫైల్ కు 328 ఫాలోయర్స్ ఉన్నారు.
निष्कर्ष: ముగింపు: విశ్వాస్ న్యూస్ యొక్క దర్యాప్తులో బిబిసి పేరు ఉపయోగించి చేసిన వైరల్ క్లెయిమ్ నకిలీది అని తేలింది. బిబిసి పేరున బ్లాక్ ఫంగస్ మరియు గోమూత్రానికి సంబంధం ఉంది అని తెలిపే ఏ వ్యాసము ప్రచురించబడలేదు.
Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.