ఈ క్లెయిమ్ అసత్యమని విశ్వాస్ న్యూస్ తన దర్యాప్తులో కనుగొనింది. వాస్తవానికి భారత రాజ్యాంగములో ఇటువంటి ఆర్టికల్ ఏది లేదు. భారత రాజ్యాంగములోని మూడవ భాగములో ప్రాథమిక హక్కుల వర్ణన ఉంది, ఇందులోని ఆర్టికల్స్ 25 నుండి 28 వరకు ధార్మిక స్వాతంత్ర్యము గురించి, ఆర్టికల్స్ 29 నుండి 31 వరకు సంస్కృతి మరియు శిక్షణకు సంబంధించిన అధికారాల గురించి తెలుపుతాయి. భాష ఆధారంగా అల్పసంఖ్యాక వర్గాలు అన్నీ తమకు ఇష్టమైన విద్యా సంస్థలను ఏర్పాటు చేసుకొని నిర్వహించుకునే అధికారాన్ని రాజ్యాంగము యొక్క ఆర్టికల్ 30 సుస్పష్టంగా తెలుపుతుంది.
కొత్త ఢిల్లీ (విశ్వాస్ న్యూస్) – లోక్సభ ఎన్నికల సమయములో రాజ్యాంగము ఒక ముఖ్యమైన అంశము అయ్యింది మరియు ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత కూడా సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన క్లెయిమ్స్ షేర్ చేయబడుతున్నాయి. వరుసగా మూడవసారి కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తరువాత, రాజ్యాంగములోని ఆర్టికల్ 30A ని తొలగించే అవకాశం ఉందని ఇటువంటి ఒక పోస్ట్ లో క్లెయిమ్ చేయబడుతోంది, ఈ ఆర్టికల్ ప్రకారం హిందూ వర్గానికి చెందిన విద్యా సంస్థలలో హిందువుల ధార్మిక గ్రంధాలను చదివించటానికి అనుమతి లేదు, అయితే ఇది ముస్లిం వర్గానికి చెందిన మదార్సాలలో వారి ధార్మిక గ్రంథాలను చదువుకునే అధికారం ఇస్తుంది.
ఈ క్లెయిమ్ అసత్యమని విశ్వాస్ న్యూస్ తన దర్యాప్తులో కనుగొనింది. వాస్తవానికి భారత రాజ్యాంగములో ఇటువంటి ఆర్టికల్ ఏది లేదు. భారత రాజ్యాంగములోని మూడవ భాగములో ప్రాథమిక హక్కుల వర్ణన ఉంది, ఇందులోని ఆర్టికల్స్ 25 నుండి 28 వరకు ధార్మిక స్వాతంత్ర్యము గురించి, ఆర్టికల్స్ 29 నుండి 31 వరకు సంస్కృతి మరియు శిక్షణకు సంబంధించిన అధికారాల గురించి తెలుపుతాయి. భాష ఆధారంగా అల్పసంఖ్యాక వర్గాలు అన్నీ తమకు ఇష్టమైన విద్యా సంస్థలను ఏర్పాటు చేసుకొని నిర్వహించుకునే అధికారాన్ని రాజ్యాంగము యొక్క ఆర్టికల్ 30 సుస్పష్టంగా తెలుపుతుంది.
సోషల్ మీడియా యూజర్ ‘నీలు జైన్’ వైరల్ పోస్ట్ (ఆర్కైవ్ లింక్) ను షేర్ చేస్తూ ఇలా వ్రాశారు “మోడీ యొక్క రెండవ దెబ్బ పడుతుంది*
*ఆర్టికల్ 30A తొలగించబడుతుంది*
*మోడీగారు హిందువుల పట్ల చేసిన విశ్వాసఘాతుకానికి సరిచేయటానికి సిద్ధంగా ఉన్నారు. ***మీకు “ఆర్టికల్ 30” మరియు ఆర్టికల్ “30A” గురించి విన్నారా? *”30A” అంటే ఏమిటో మీకు తెలుసా? మరింత తెలుసుకోవటానికి ఆలస్యం చేయకండి
*30-A* అనేది రాజ్యాంగములో ఒక చట్టము. నెహ్రూగారు ఈ చట్టాన్ని రాజ్యాంగములో పొందుపరచాలని ప్రయత్నించినప్పుడు, సర్దార్ వల్లభభాయ్ పటేల్ దీనిని వ్యతిరేకించారు. సర్దార్ పటేల్ ఇలా అన్నారు, “ఈ చట్టము హిందువుల పట్ల విశ్వాసఘాతుకమే” అందుకని ఈ చట్టము రాజ్యాంగములో చేరిస్తే, దీనికి వ్యతిరేకంగా నేను క్యాబినెట్ మరియు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తాను.
చివరిగా సర్దార్ పటేల్ కోరిక ముందు నెహ్రూగారు మోకరిల్లాల్సి వచ్చింది. దురదృష్టవశాత్తు…ఈ ఘటన జరిగిన కొన్ని నెలలకు సర్దార్ వల్లభ భాయ్ పటేల్ అకస్మాత్తుగా మరణించారు..? *సర్దార్ పటేల్ మరణానంతరము, నెహ్రూ ఈ చట్టాన్ని రాజ్యాంగములో వెంటనే చేర్చారు.*
*30A అంటే ఏమిటి, నేను మీకు దీని విశేషాలను తెలియజేస్తాను. *ఈ చట్టం ప్రకారం – హిందువులకు తమ “హిందూ ధర్మాన్ని” నేర్పించడం/చదివించడానికి అనుమతి లేదు.
*ఆర్టికల్ 30A”* అనుమతి లేదా అధికారాన్ని ఇవ్వదు…. అందుకని హిందువులు తమ కాలేజీలలో హిందూ ధర్మాన్ని నేర్పించకూడదు.
హిందూ ధర్మము నేర్పించడము/చదివించడానికి కాలేజీలు ప్రారంభించకూడదు. హిందు పాఠశాలలను హిందూ ధర్మాన్ని నేర్పించుటకు ప్రారంభించకూడదు. ఆర్టికల్ 30-A కింద పబ్లిక్ పాఠశాలలు లేదా కాలేజీలలో హిందూ ధర్మాము సంస్కృతి నేర్పించడానికి ఎవరికి అనుమతి లేదు. ఇది ఆశ్చర్యంగా ఉంటుంది, (30-A) నెహ్రూ రాజ్యాంగములో మరొక చట్టాన్ని ఏర్పాటు చేశారు *”చట్టము 30”. ఈ “చట్టము 30” ప్రకారము ముస్లింలు, సిక్కులు మరియు క్రైస్తవులు తమ ధార్మిక శిక్షణ కొరకు ముస్లిం, సిక్కు, క్రైస్తవ ధర్మం పాఠశాలలను ప్రారంభించవచ్చు.
ముస్లింలు, సిక్కులు మరియు క్రైస్తవులు తమ తమ ధర్మాన్ని నేర్పించవచ్చు. ముస్లింలు తమ ‘మదార్సా’ ప్రారంభించడానికి చట్టము 30 పూర్తి అధికారము మరియు అనుమతి ఇస్తుంది మరియు రాజ్యాంగములోని ఆర్టికల్ 30 క్రైస్తవులకు తమ ధార్మిక పాఠశాలలు మరియు కాలేజీలను స్థాపించుటకు మరియు నేర్పించుటకు మరియు శిక్షణ ఇచ్చుటకు పూర్తి అధికారాన్ని మరియు అనుమతి ఇస్తుంది. ఉచితంగా తమ ధర్మాన్ని ప్రచారం చేసుకోండి….. హిందూ దేవాలయాలలోని మొత్తం డబ్బులు మరియు సంపద ప్రభుత్వము యొక్క విచక్షణకు వదిలివేయబడవచ్చు, హిందూ దేవాలయాలలో హిందు భక్తుల ద్వారా అన్ని దానాలు ప్రభుత్వ ఖజానాలోకి తీసుకోబడవచ్చు అనే.. దీని రెండవ చట్టపరమైన అంశము ఉంది. అదే ముస్లిం మరియు క్రైస్తవుల మసీదులలో దానధర్మాలు కేవలం క్రైస్తవ-ముస్లిం వర్గాలకు మాత్రమే చెందుతాయి. ఈ *”చట్టము 30” విశేషాలు ఈ విధంగా ఉన్నాయి.
అందుచేత, “ఆర్టికల్ 30A” మరియు “ఆర్టికల్ 30”* హిందువుల పట్ల ఉద్దేశపూర్వకంగా బేధాలను పెంచుటకు మరియు ఆలోచనాపూర్వకంగా చేయబడిన అతిపెద్ద విశ్వాసఘాతుకము.
నేడు హిందువులు జానపద కథలకు మాత్రమే పరిమితం అయ్యారనే విషయం అర్థంచేసుకోవాలి. హిందువులకు తమ శాస్త్రాల పట్ల పరిజ్ఞానము లేదు.
*తెలుసుకోండి* ఇతరుల గురించి తెలుసుకోవాలి, సనాతన ధర్మాన్ని రక్షించాలి. చదవండి, నేర్చుకోండి, మరియు ప్రచారం చేయండి….
మనము మన దేశములో ఎక్కడా ‘భగవద్గీత’ నేర్పించకూడదు అనేది ఈ “ఆర్టికల్ 30A” కి కారణము. చదివిన తరువాత సరైనది అనిపిస్తే, దీనిని తప్పకుండా ఫార్వర్డ్ చేయాలి. దీనితో నెహ్రూ ఇలా దేనికి మరియు ఎందుకు చేశారు అనేది అందరికి తెలుస్తుంది. “ఒకవేళ మీరు హిందువులు అయితే, దయచేసి దీనిని 5 మందికి తప్పకుండా ఫార్వర్డ్ చేయండి.*
*ధన్యవాదములు.. నేను హిందువును, అందుకే పంపిస్తున్నాను.* జై శ్రీరామ్”
సోషల్ మీడియా యొక్క వేరు-వేరు ప్లాట్ఫార్మ్స్ పై అనేకమంది యూజర్స్ ఈ పోస్ట్ తో సమానమైన మరియు సరిపోయే క్లెయిమ్స్ స్తో షేర్ చేశారు.
కాగా వైరల్ పోస్ట్ లో రాజ్యాంగము యొక్క ఆర్టికల్ ’30-A’ తొలగిస్తారనే క్లెయిమ్ చేశారు, అందుకని మేము legislative.gov.in/constitution-of-india వెబ్సైట్ పై హిందీ, ఇంగ్లీషుతో సహా అన్ని భారతీయ భాషలలో అందుబాటులో ఉన్న భారత రాజ్యాంగాన్ని చెక్ చేశాము.
ప్రాథమిక అధికారాల వర్ణన ఉన్న భారత రాజ్యాంగములోని భాగము 3 లో నిర్దేశక సూత్రాల సమాచారము ఉంది. వైరల్ పోస్ట్ లో భాగము 3లోని ధార్మిక అధికారాన్ని సంబంధించి క్లెయిమ్ చేయబడింది.
భారత రాజ్యాంగము యొక్క భాగము 3లో ఆర్టికల్ 25 నుండి 28 వరకు ధార్మిక స్వాతంత్ర్యానికి సంబంధించిన అధికారాల గురించి వర్ణించబడింది.
అక్కడే, ఆర్టికల్ 29-31 వరకు సంస్కృతి మరియు శిక్షణకు సంబంధించిన అధికారాల గురించి ఇవ్వబడింది.
ఆర్టికల్ 30లో ధర్మము లేదా భాష ఆధారిత అన్ని అల్పసంఖ్యాక వర్గాలకు తమకు ఇష్టమైన విద్యా సంస్థలను స్థాపించుకొని నిర్వహించే అధికారము ఇవ్వబడింది. ఆర్టికల్ 30 (1) మరియు 30 (1)(A) మరియు ఆర్టికల్ 30 (2) లలో ఈ అధికారాల గురించి ఇవ్వబడింది. (ఇటువంటి) విద్యా సంస్థలకు సహాయం చేయడం కోసం ప్రభుత్వము ధర్మము మరియు భాష ఆధారంగా ఎలాంటి వివక్ష చూపించకూడదు అని ఆర్టికల్ 30 (2) సుస్పష్టంగా తెలిపుతుంది.
వైరల్ పోస్ట్ లో ప్రస్తావించబడినట్లుగా భారత రాజ్యాంగములో ఆర్టికల్ 30(A) వంటి ఎలాంటి నిబంధన లేదని మా దర్యాప్తులో స్పష్టం అయ్యింది.
కాగా, భారత రాజ్యాంగము యొక్క ఆర్టికల్ 30 (1) భాష మరియు మతపరమైన అల్పసంఖ్యాక వర్గాలు తమకు ఇష్టమైన విద్యా సంస్థలను స్థాపించుకొనుటకు మరియు వాటిని నిర్వహించుటకు అధికారాన్ని ఇస్తుంది, అందుచేత భారత పార్లమెంటు తరఫున ఈ అధికారాల సురక్షత కొరకు చట్టాన్ని ఏర్పాటు చేసి జాతీయ మైనారిటీ విద్యా సంస్థల కమిషన్ (ఎన్ईసిఎంఈఐ) స్థాపించింది.
గమనించవలసిన అంశం ఏమిటంటే, భారత రాజ్యాంగములో “అల్పసంఖ్యాక వర్గాలు” అనే మాట వ్యాఖ్యానించబడలేదు, కాని రాజ్యాంగము మతపరమైన మరియు భాషాపరమైన అల్పసంఖ్యాక వర్గాలకు గుర్తింపు ఇస్తుంది, అందుచేత కేంద్ర ప్రభుత్వము ఈ వర్గములో ఆరు మతపరమైన అల్పసంఖ్యా వర్గాలను సూచించింది, ఇందులో ముస్లిములు, క్రైస్తవులు, సిక్కులు, బౌద్ధమతస్థులు, పారసీలు మరియు జైనమతస్థులు ఉన్నారు.
స్పష్టంగా అర్థంచేసుకుంటే, ఆర్టికల్ 30 అల్పసంఖ్యాక వర్గాలకు తమ పిల్లలకు తమ భాషలో శిక్షణ ఇప్పించే అధికారము ఇస్తుంది.
వైరల్ పోస్ట్ లో చేయబడిన క్లెయిమ్ సంబంధించి మేము సర్వోన్నత న్యాయస్థానము న్యాయవాది అయిన రుద్ర విక్రం సింగ్ ను సంప్రదించాము. ఆయన స్పష్టంగా వివరిస్తూ ఇలా అన్నారు, ‘భారత రాజ్యాంగములో ధార్మిక స్వాతంత్ర్యము యొక్క అధికారము మరియు సంస్కృతి మరియు శిక్షణ సంబంధించిన అధికారాల వర్ణన ఆర్టికల్స్ 25 నుండి 30 లో ఉంది మరియు ఆర్టికల్ 30 యొక్క రెండు సబ్-సెక్షన్స్ ఉన్నాయి, కాని రాజ్యాంగములో ఆర్టికల్ 30A వంటి ఎలాంటి ఆర్టికల్ లేదు.”
వైరల్ పోస్ట్ ను షేర్ చేసిన యూజర్, సంబంధిత పోస్ట్ ను పుష్పేంద్ర కులశ్రేష్ఠ్ గ్రూప్ లో షేర్ చేశారు, దీనికి ఇంచుమించు లక్షకు పైగా సభ్యులు ఉన్నారు. ఎన్నికలకు సంబంధించి ఇతర తప్పుదోవపట్టించే లేదా నకిలీ క్లెయిమ్స్ యొక్క దర్యాప్తు చేస్తూ ఫ్యాక్ట్ చెక్ రిపోర్ట్ ను విశ్వాస్ న్యూస్ యొక్క ఎన్నికల విభాగములో చదవ వచ్చు.
ముగింపు: వాస్తవానికి భారత రాజ్యాంగములో ఇటువంటి ఆర్టికల్ ఏది లేదు. భారత రాజ్యాంగము యొక్క మూడవ భాగములో ప్రాథమిక హక్కుల వర్ణన చేయబడింది, ఇందులో ఆర్టికల్ 25 నుండి 28 లో మతపరమైన స్వాతంత్ర్యము యొక్క అధికారాల గురించి ప్రస్తావించబడింది, ఆర్టికల్ 29 నుండి 31 లో సంస్కృతి మరియు శిక్షణ సంబంధించిన అధికారాల గురించి తెలుపబడింది. మతపరంగా లేదా భాషాపరంగా అన్ని అల్పసంఖ్యాక వర్గాలకు తమకు ఇష్టమైన విద్యా సంస్థలను స్థాపించి నిర్వహించుకునే అధికారాన్ని రాజ్యాంగము యొక్క ఆర్టికల్ 30 ఇస్తుంది. ఆర్టికల్ 30 లో రెండు సబ్-సెక్షన్స్ ఉన్నాయి కాని రాజ్యాంగములో ఆర్టికల్ 30A వంటి ఎలాంటి ఆర్టికల్ లేదు.
Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923