ఖలిస్తాన్ మద్ధతుదారులు భద్రతా సిబ్బందిని తప్పించుకొని లండన్ లో జరుగుతున్న ఇండియన్ ఓవర్ సీస్ కాంగ్రెస్ యూకే మెగా కాన్ఫరెన్స్ లోకి చొరబడ్డారు. వాళ్ళు అక్కడ జాతి-వ్యతిరేక నినాదాలు చేశారు. దీనికి ప్రతిస్పందనగా, కాంగ్రెస్ మద్ధతుదారులు ‘కాంగ్రెస్ పార్టీ జిందాబాద్’’ అనే నినాదాలు చేశారు. ఈ వీడియో తప్పుడు క్లెయిమ్ తో వైరల్ అవుతోంది.
కొత్త ఢిల్లీ (విశ్వాస్ న్యూస్). సోషల్ మీడియాలో 26-క్షణాల ఒక వీడియో షేర్ చేయబడుతోంది. దీనిలో, ‘కాంగ్రెస్ పార్టీ జిందాబాద్’ అనే నినాదముతోపాటు జాతి వ్యతిరేక నినాదాలు కూడా వినిపించాయి. యూజర్లు దీనిని షేర్ చేస్తూ లండన్ లో రాహుల్ గాంధి సమావేశానికి ఖలిస్తాన్ మద్ధతుదారులు చేరుకున్నారు అని క్లెయిమ్ చేసింది. మరియు వారు ‘కాంగ్రెస్ పార్టీ జిందాబాద్’ మరియు జాతి-వ్యతిరేక నినాదాలు చేశారు.
విశ్వాస్ న్యూస్ తన విచారణలో ఈ వైరల్ వీడియో ఆగస్ట్ 2018 నాటిది అని కనుగొనింది. నలుగురు ఖలిస్తాన్ మద్ధతుదారులు భద్రతా సిబ్బందిని తప్పించుకొని రాహుల్ గాంధి గారి కార్యక్రమాన్ని చేరుకున్నారు. అక్కడ వారు జాతి-వ్యతిరేక నినాదాలు చేశారు, అయితే దీనికి ప్రతిస్పందనగా కాంగ్రెస్ మద్ధతుదారులు ‘కాంగ్రెస్ పార్టి జిందాబాద్’ అనే నినాదాలను వినిపించారు. ఖలిస్తాన్ మద్ధతుదారులు ‘కాంగ్రెస్ పార్టి జిందాబాద్’ అనే నినాదాలను చేయలేదు. తప్పుడు క్లెయిమ్ తో యూజర్లు వీడియోను వైరల్ చేస్తున్నారు.
జూన్ 8వ తేదీన వీడియోను షేర్ చేస్తూ ఫేస్బుక్ యూజర్ Yogesh Patel (ఆర్కైవ్ వర్షన్) ఇలా వ్రాశారు, “అనువదించబడింది: నేను నా దేశాన్ని కాంగ్రెస్ కు ఎలా అప్పగిస్తాను, మీరే చెప్పండి…. ఖలిస్తానీ తీవ్రవాదులు లండన్ లో జరిగిన రాహుల్ గాంధి గారి సమవేశానికి చేరుకున్నారు, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ మరియు హిందుస్తాన్ ముర్దాబాద్ అనే నినాదాలు చేశారు…. మీకు ఉన్న అన్ని గ్రూప్స్ కు పంపించండి.
వైరల్ వీడియోను పరీక్షించుటకు, మేము కొన్ని కీవర్డ్స్ తో సెర్చ్ చేశాము. ABP live పై ఆగస్ట్ 26, 2018 నాడు ప్రచురించబడిన వార్తలు మాకు లభించాయి. ఈ కథనము ప్రకారము, బ్రిటెన్ లో జరిగిన రాహుల్ గాంధి సమావేశములో, ఖలిస్తాన్ మద్ధతుదారులు ‘ఖలిస్తాన్ జిందాబాద్’ అనే నినాదాలు చేశారు. ఈ సంఘటన రాహుల్ గాంధి రాకకు ముందు జరిగింది. ముగ్గులు ఖలిస్తాన్ మద్ధతుదారులను స్కాట్ల్యాండ్ యార్డ్ పోలీసులు సమూహము నుండి బయటకు పంపారు. ఈ సంఘటన ఇండియన్ ఓవర్ సీస్ కాంగ్రెస్ సమావేశములో జరిగింది. ఖలిస్తాన్ మద్ధతుదారులు జాతి-వ్యతిరేక నినాదాలు చేసినప్పుడు, దీనికి ప్రతిస్పందనగా అక్కడ ఉన్న కాంగ్రెస్ మద్ధతుదారులు ‘కాంగ్రెస్ జిందాబాద్’ అనే నినాదాలు చేశారు.
ఆగస్ట్ 26, 2018 తేదీన Aaj Tak లో ప్రచురించబడిన వార్తల ప్రకారం, రైస్లిప్, వెస్ట్ లండన్ లో ఇండియన్ ఓవర్ సీస్ కాంగ్రెస్ యూకె మెగా కాన్ఫరెన్స్ నిర్వహించబడింది. ముగ్గురు ఖలిస్తాన్ మద్ధతుదారులు ఈ కార్యక్రమములోకి ప్రవేశించి ఖలిస్తాన్ కు మద్ధతుగా నినాదాలు చేశారు. రాహుల్ గాంధి రాకకు ముందే పోలీసులు వారిని సమావేశము నుండి బయటికి పంపేశారు. ఇంతలో, అక్కడ ఉన్నవారు కాంగ్రెస్ కు మద్ధతుగా నినాదాలు చేశారు.
నలుగురు ఖలిస్తాన్ మద్ధతుదారులు భద్రతా సిబ్బందిని తప్పించుకొని రాహుల్ గాంధి గారి కార్యక్రమములోకి ప్రవేశించారు అని ఆగస్ట్ 27, 2018 నాడు Times of India లో ప్రచురించబడింది. ఈ ఈవెంట్ సౌత్ రిస్లిప్, వెస్ట్ లండల్ లోని రమదా హోటల్ లో నిర్వహించబడింది. ఇక్కడికి, భారతదేశ మూలాలు ఉన్న కాంగ్రెస్ మద్ధతుదారులు కూడా చేరుకున్నారు. శనివారం రాత్రి రాహుల్ గాంధి రాకకు ముందు, పోలీసులు సమూహము నుండి నలుగురిని బలవంతంగా బయటికి పంపేశారు. ఈవెంట్ కు కొద్దిసేపటి ముందు, పిలవకుండా వచ్చిన కొంతమంది అక్కడ ఉన్నారు అని వేదిక మీది నుండి ఈవెంట్ నిర్వాహకులు ప్రకటించారు. సమవేశము నుండి వీళ్ళు వెళ్ళిపోవాలని నిర్వాహకులు తెలిపారు.
ఆగస్ట్ 26, 2018 పై ఇండియా టుడే వారి యూట్యూబ్ ఛానల్ పై అప్లోడ్ చేయబడిన వీడియో వార్తల ప్రకారము, ఖలిస్తాన్ మద్ధతుదారులు రాహుల్ గాంధి రాక ముందే సమావేశ సమూహములోకి చొరబడ్డారు. వాళ్ళు అక్కడ జాతి-వ్యతిరేక నినాదాలు చేశారు. అయితే కాంగ్రెస్ మద్ధతుదారులు కాంగ్రెస్ మరియు రాహుల్ గాంధికి మద్ధతుగా నినాదాలు చేశారు. ఖలిస్తాన్ మద్ధతుదారులు ఆహ్వానము లేకుండా అక్కడికి చేరుకున్నారు.
మరింత సమాచారము కొరకు, లండన్ లోని సంఘటనకు సంబంధించి మేము టైమ్స్ ఆఫ్ ఇండియా విలేఖరి నయోమి క్యాంటన్ తో మాట్లాడాము. ఆమె ఇలా అన్నారు, ‘కార్యక్రమము పూర్తి అయ్యే వరకు నేను అక్కడే ఉన్నాను. ఖలిస్తాన్ మద్ధతుదారులకు ఆహ్వానం పంపబడలేదు. వాళ్ళు భద్రతా సిబ్బందిని తప్పించుకొని చొరబడ్డారు. అనుమానముతో ఒక వ్యక్తి పోలీసులను పిలిచాడు. సమావేశానికి భంగం కలిగించడమే వారి ధ్యేయం. పోలీసులు వాళ్ళను సమావేశము నుండి బయటకు తీసుకెళ్తూ ఉన్నప్పుడు, వాళ్ళు ‘ఖలిస్తాన్ జిందాబాద్’ అని నినాదాలు చేశారు. ఇంతలో, సమావేశములో ఉన్న వారు రాహుల్ గాంధీకి మరియు కాంగ్రెస్ కు మద్ధతుగా నినాదాలు చేశారు.
తప్పుడు క్లెయిమ్ తో వీడియోను వైరల్ చేసిన ఫేస్బుక్ యూజర్ ‘యోగేష్ పటేల్‘ యొక్క ప్రొఫైల్ ను మేము స్కాన్ చేశాము. దీని ప్రకారము, ఆయన ముంబైలో నివసిస్తున్నారు మరియు ఫిబ్రవరి 2011 నుండి ఫేస్బుక్ పై క్రియాశీలకంగా ఉన్నారు.
निष्कर्ष: ఖలిస్తాన్ మద్ధతుదారులు భద్రతా సిబ్బందిని తప్పించుకొని లండన్ లో జరుగుతున్న ఇండియన్ ఓవర్ సీస్ కాంగ్రెస్ యూకే మెగా కాన్ఫరెన్స్ లోకి చొరబడ్డారు. వాళ్ళు అక్కడ జాతి-వ్యతిరేక నినాదాలు చేశారు. దీనికి ప్రతిస్పందనగా, కాంగ్రెస్ మద్ధతుదారులు ‘కాంగ్రెస్ పార్టీ జిందాబాద్’’ అనే నినాదాలు చేశారు. ఈ వీడియో తప్పుడు క్లెయిమ్ తో వైరల్ అవుతోంది.
Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923