వాస్తవ తనిఖీ: ట్రాన్స్లేటర్ ను అడ్డుకుంటున్నట్లుగా ఉన్న అమిత్ షా వైరల్ వీడియో 5 సంవత్సరాలు పాతది, కర్ణాటక ఎన్నికలకు దీనికి ఎలాంటి సంబంధం లేదు

కొత్త ఢిల్లీ (విశ్వాస్ న్యూస్): కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇటువంటి సమయములో రాజకీయ పార్టీలు ర్యాలీలు మరియు సమావేశాలు నిర్వహించడములో నిమగ్నం అయ్యారు. హోం మంత్రి అమిత్ షా కు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోలో ఆయన తన ట్రాన్స్లేటర్ తప్పుగా అనువదించారు అని అడ్డుకుంటున్నారు మరియు ఇకపై తప్పుగా అనువదించవద్దని చెప్తుండడం చూడవచ్చు. ఈ వీడియోను యూజర్లు ప్రస్తుత కర్ణాటక ఎన్నికలకు జతచేసి షేర్ చేస్తున్నారు.

వైరల్ వీడియోకు ప్రస్తుత కర్ణాటక ఎన్నికలకు ఎలాంటి సంబంధం లేదని విశ్వాస్ న్యూస్ తన దర్యాప్తులో కనుగొనింది. వైరల్ వీడియో 2018 సంవత్సరానికి చెందినది.

ఏది వైరల్ అవుతోంది?

ఏప్రిల్ 30, 2023 నాడు ఫేస్‎బుక్ యూజర్ మోఆజ్ అలీ హైదర్ ఈ వైరల్ వీడియోను షేర్ చేశారు. “కర్ణాటకలో జరుగబోయే ఎన్నికల ప్రచారము ఎప్పుడు వినోదాత్మకంగా ఉంటుంది. ఎక్కడి నుండి తీసుకొని వస్తారో తెలియదు. ఈ క్లిప్పింగ్ చూడండి, పొట్టచెక్కలయ్యేలా నవ్వకుంటే అడగండి. (3 లక్షల 55 వేల కంటే ఎక్కువమంది చూశారు. అద్భుతం!”

పోస్ట్ యొక్క ఆర్కైవ్ లింక్ ను ఇక్కడ  చూడవచ్చు.

దర్యాప్తు 

వైరల్ వీడియోకు సంబంధించిన వాస్తవాలు తెలుసుకోవటానికి మేము గూగుల్ పై సంబంధిత కీవర్డ్స్ సహాయముతో సెర్చ్ చేయడం ప్రారంభించాము. ఈ సమయములో మాకు ఈ వీడియో టివి9 కన్నడ యొక్క అధికారిక యూట్యూబ్ ఛానల్  పై లభించింది. ఈ వీడియో మే 8, 2018 న అప్లోడ్ చేయబడింది. క్యాప్షన్ లో ఇవ్వబడిన సమాచారము ప్రకారము, “నేలమంగళ సమావేశములో అనువాదనకు సంబంధించి అమిత్ షా ఇబ్బంది ఎదుర్కోవలసి వచ్చింది. అనువదించటానికి వచ్చిన మహిళ తప్పుగా అనువదించారు”.

ఇతర వీడియో రిపోర్ట్ ను ఇక్కడ  చూడవచ్చు.

మాకు లభించిన సమాచారము ఆధారంగా మేము గూగుల్ పై సంబంధిత కీవర్డ్స్ ఉపయోగించి సెర్చ్ ప్రారంభించాము. ఈ సమయములో వైరల్ వీడియోకు సంబంధించి పంజాబ్ కేసరి యొక్క వెబ్సైట్ పై మే 9, 2018 నాడు ప్రచురించబడిన ఒక రిపోర్ట్ మాకు లభించింది. రిపోర్ట్ ప్రకారము, “అమిత్ షా రాష్ట్రములోని నేలమంగళ అసెంబ్లీ నియోజకవర్గములో ఎన్నికల ప్రచార ర్యాలీ నిర్వహిస్తున్న సమయములో ఒక అనువాదకురాలిపై కోపగించుకున్నారు. అమిత్ షా వేదికపై నుండి ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు మరియు అదే వేదిక పై నిలబడిన ఒక మహిళా అనువాదకురాలు దానిని అనువదిస్తున్నారు. వేదికపై నుండి అమిత్ షా గారు రాహుల్ గాంధి గారిని లక్ష్యంగా చేసుకుని ఇలా అన్నారు, రాహుల్ గారు మీరు ప్రధానమంత్రి నరేంద్ర మోది గారిని సవాలు చేస్తున్నారు.

దీనిని కన్నడలోకి అనువదిస్తూ అనువాదకురాలు నరేంద్ర మోదిగారిని ఉద్దేశించి కన్నడలో యశశ్వి మరియు విశ్వగురు వంటి విశేషణాలను ఉపయోగించింది. ఇది చూసి అమిత్ షా గారు అదే వేదికపై అనువాదకురాలిని అడ్డుకుంటూ, నేను ఏది చెప్తే దానినే అనువదించండి, మీ మనసులో ఉన్నదానిని జతచేయకండి. నేను విశ్వగురు అని ఎప్పుడు అన్నాను. ఇలా చేయకండి. ఈ వీడియో సోషల్ మీడియాపై చాలా వేగంగా వైరల్ అవుతోంది.”

ఇతర వార్తా నివేదికలను ఇక్కడ చూడవచ్చు.

మరిన్ని వివరాల కొరకు మేము కర్ణాటక బీజేపి అధికారిక ప్రతినిధి ప్రతాప్ కుమార్ ను సంప్రదించాము. ఆయన వైరల్ క్లెయిమ్ తప్పుదోవపట్టించేది అని తెలిపారు. వైరల్ వీడియో సుమారు 5 సంవత్సరాల పాతది అని, వీడియోకు ప్రస్తుత ఎన్నికలకు ఎలాంటి సంబంధం లేదని ఆయన చెప్పారు

దర్యాప్తు చివరిలో మేము తప్పుదోవపట్టించే క్లెయిమ్ తో వీడియోను షేర్ చేసిన యూజర్ యొక్క పేజ్ ను స్కాన్ చేశాము. యూజర్ ఒక భావజాలముతో ప్రభావితం అయ్యారు అని మేము కనుగొన్నాము. ఫేస్‎బుక్ పై యూజర్ కు 74,657 మంది ఫాలోయర్స్ ఉన్నారు.

ముగింపు: అమిత్ షా యొక్క వైరల్ వీడియోకు ప్రస్తుత కర్ణాటక ఎన్నికలకు ఏ విధమైన సంబంధము లేదని విశ్వాస్ న్యూస్ తన దర్యాప్తులో కనుగొనింది. వైరల్ వీడియో 2018 సంవత్సరానికి చెందినది.

Misleading
Symbols that define nature of fake news
Know The Truth...

Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923

Related Posts
ఇటీవలి పోస్ట్ లు