వాస్తవ తనిఖీ: దేవోలీన భట్టార్జీకి సంబంధించిన వైరల్ పోస్ట్ అసత్యము, ఈ నటి కేరళ స్టోరిలో నటించలేదు
- By: Pragya Shukla
- Published: Jun 12, 2023 at 06:56 PM
- Updated: Jul 11, 2023 at 11:47 AM
కొత్త ఢిల్లీ (విశ్వాస్ న్యూస్): ‘ది కేరళ స్టోరి’ చిత్రము విడుదల అయినప్పటి నుండి, ఆ సినిమా గురించి అనేక నకిలీ పోస్ట్లు ఇంటర్నెట్ పై చక్కర్లు కొడుతున్నాయి. ఇటీవల, టివి నటి దేవోలీన భట్టాచార్జీ ఈ చిత్రములో ఒక పాత్ర పోషించారని మరియు ఇప్పుడు ఆమె ఒక ముస్లిం వ్యక్తిని వివాహం చేసుకున్నారని సోషల్ మీడియా వేదికలలో ఒక పోస్ట్ వైరల్ అవుతోంది. వైరల్ పోస్ట్ లో షేర్ చేయబడిన చిత్రములో బెంగాలీ వివాహ దుస్తులలో ఉన్న వ్యక్తి పక్కన దేవొలీన నిలబడి ఉన్నారు.
వైరల్ చిత్రానికి సంబంధించిన క్లెయిమ్ అసత్యము అని విశ్వాస్ న్యూస్ తన దర్యాప్తులో కనుగొనింది. దేవొలీన భట్టాచార్జీ ‘ది కేరళ స్టోరి’ చిత్రములో భాగము కాదు. దేవొలీన పక్కన చిత్రములో కనిపించే వ్యక్తి ఆమె సహ-నటుడు విషాల్ సింగ్. దేవొలీన డిసెంబరు 2022లో వివాహం చేసుకోగా, ‘ది కేరళ స్టోరీ’ చిత్రము మే 5, 2023లో విడుదల అయ్యింది.
క్లెయిమ్:
ఫేస్బుక్ యూజర్ (ఆర్కైవ్ లింక్) ‘మొహమ్మద్ జావెద్ అక్తర్’ మే 17, 2023 నాడు ఈ వైరల్ చిత్రాన్ని షేర్ చేసి, ఈ క్యాప్షన్ వ్రాశారు, ‘కేరళ స్టోరి నటీమణి దేవొలీన భట్టాచార్య భర్త షానవాజ్ షేక్ ను చూడండి.. ఈ నటీమణి చిత్రములో పనిచేసిన తరువాత ఆమె ఒక ముస్లిం వ్యక్తిని వివాహం చేసుకుంది, ఎందుకంటే ఆమెకు తెలుసు #దికేరళస్టోరి పూర్తిగా #ప్రచారము లేదా #అసత్యము చిత్రము.. కేవలం భక్తులు మాత్రమే ఆవు పేడను హల్వా అనుకొని తినగలుగుతారు”.
దర్యాప్తు:
వైరల్ పోస్ట్ లోని సత్యాన్ని కనుగొనుటకు, మేము గూగుల్ పై సంబంధిత కీవర్డ్స్ తో సెర్చ్ చేయడం ప్రారంభించాము. డిసెంబరు 14, 2022 నాడు నవభారత్ టైమ్స్ వెబ్సైట్ పై ప్రచురించబడిన ఒక రిపోర్ట్ మాకు లభించింది. రిపోర్ట్ ప్రకారము, దేవొలీన భట్టాచార్జీ తన జిమ్ ట్రెయినర్ షానవాజ్ షేక్ ను వివాహం చేసుకున్నారు. ఆ రిపోర్ట్ లో ఆమె భర్తకు సంబంధించిన ఫోటోలు చాలా ఉన్నాయి. ఆ వ్యక్తి ఆమె సహ-నటుడు విశాల్ సింగ్ అని నవభారత్ టైమ్స్ రిపోర్ట్ గుర్తించింది. (ఇతర రిపోర్ట్స్ ను ఇక్కడ చదవండి)
దేవొలీన భట్టాచార్జీ ‘ది కేరళ స్టోరీ’ లో భాగమా కాదా అని తెలుసుకొనుటకు మేము సినిమాల రేటింగ్ మరియు సమీక్ష వెబ్సైట్ ‘IMDB’ పై సెర్చ్ చేశాము. ఆ వెబ్సైట్ ప్రకారము, ఈ చిత్రము మే 5, 2023 నాడు విడుదల అయ్యింది. తారాగణం జాబితాలో కూడా దేవొలీన భట్టాచార్జీ పేరు లేదు. యూట్యూబ్ పై ఈ చిత్రము యొక్క ట్రెయిలర్ కోసం సెర్చ్ చేసి చూశాము కాని ఎక్కడ దేవొలీన భట్టాచార్జీ కనిపించలేదు.
విశ్వాస్ న్యూస్ దేవొలీనా భట్టాచార్జీ యొక్క సోషల్ మీడియా ఖాతాలను తనిఖీ చేశాము, కాని ఆమె ఈ చిత్రములో ఒక భాగము అని పేర్కొన్నట్లు మాకు ఏ పోస్ట్ లభించలేదు. ఒకవేళ ఆమె ఈ చిత్రములో నిజంగా భాగము అయితే, ఆమె ఈ చిత్రము యొక్క ప్రచారములో లేదా ఏదైనా ఈవెంట్ లో తప్పకుండా పాల్గొనేది. ఆమె ప్రొఫైల్ పై ఎక్కడ కూడా మాకు ఇటువంటి పోస్ట్స్ కనిపించలేదు.
అయినప్పటికీ, ‘ది కేరళ స్టోరి’ కి సంబంధించిన ఒక ట్వీట్ మాకు దేవొలీనా యొక్క ట్విట్టర్ ఖాతా పై లభించింది. మే 13, 2023 నాడు దేవొలీనా ఒక యూజర్ కు సమాధానము ఇచ్చారు మరియు ఇలా వ్రాశారు, “నా భర్త ఒక ముస్లిం మరియు నాతో కలిసి ఆ చిత్రాన్ని చూసేందుకు వచ్చారు మరియు చిత్రాన్ని అభినందించారు. దీనిని ఆయన ఒక నేరముగా అనుకోలేదు, మరియు ఆయన మతానికి వ్యతిరేకము అని కూడా అనుకోలేదు. ప్రతి భారతీయుడు ఇలా ఉండాలి అని నేను అనుకుంటున్నాను.”
మరింత సమాచారము కోసం, మేము ‘ది కేరళ స్టోరి’ చిత్రము యొక్క పబ్లిక్ రిలేషన్స్ చూస్తున్న అమిత్ తులి గారిని సంప్రదించాము. ఆయన వైరల్ పోస్ట్ లో ఉన్న క్లెయిమ్ అసత్యము అని మాకు చెప్పారు. దేవొలీనా భట్టాచార్జీ ఈ చిత్రములో భాగము కాదు కాబట్టి ఆమెకు చిత్రానికి సంబంధం లేదు.
దర్యాప్తు యొక్క చివరి దశలో మేము అసత్యపు క్లెయిమ్ తో వైరల్ పోస్ట్ ను షేర్ చేసిన యూజర్ ‘మొహమ్మద్ జావెద్ అక్తర్’ పేజ్ ను స్కాన్ చేశాము. ఈ యూజర్ ఒక భావజాలముతో ప్రభావితం అయ్యారని మరియు ఫేస్బుక్ పై 8,000 మంది ఫాలోయర్స్ ఉన్నారని మేము కనుగొన్నాము.
ముగింపు: దేవొలీన భట్టాచార్జీ యొక్క వైరల్ ఫోటోకు సంబంధించిన క్లెయిమ్ అసత్యము అని విశ్వాస్ న్యూస్ తన దర్యాప్తులో కనుగొనింది. దేవొలీనా భట్టాచార్జీ ‘ది కేరళ స్టోరీ’ లో భాగము కాదు. దేవొలీనా వెంబడి చిత్రములో కనిపించే వ్యక్తి ఆమె సహ-నటుడు విశాల్ సింగ్. దేవొలీనా డిసెంబర్ 2022లో వివాహం చేసుకున్నారు, కాని ‘ది కేరళ స్టోరి’ చిత్రము మే 5, 2023 నాడు విడుదల అయ్యింది.
క్లెయిమ్ సమీక్ష : ‘ది కేరళ స్టోరి’ లో దేవొలీనా భట్టాచార్జీ ఒక కీలక పాత్ర పోషించారు.
క్లెయిమ్ చేసినది: ఎఫ్బి యూజర్: మొహమ్మద్ జావెద్ అక్తర్
వాస్తవ తనిఖీ : అసత్యము
- Claim Review : ‘ది కేరళ స్టోరి’ లో దేవొలీనా భట్టాచార్జీ ఒక కీలక పాత్ర పోషించారు.
- Claimed By : ఎఫ్బి యూజర్: మొహమ్మద్ జావెద్ అక్తర్
- Fact Check : False
Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.