X
X

Fact Check: హైదరాబాదు రామోజీ ఫిల్మ్ స్టూడియో యొక్క వీడియో అయోధ్య రామమందిరానికి జతచేస్తూ వైరల్ చేయబడుతోంది

  • By: Umam Noor
  • Published: Dec 31, 2023 at 02:10 PM

కొత్త ఢిల్లీ, విశ్వాస్ న్యూస్ – ఒక మందిరము మాదిరి కనిపించే ఒక నిర్మాణాన్ని చూపించే వీడియో ఒకటి సోషల్ మీడియాపై ఆకట్టుకుంటోంది. వీడియోను షేర్ చేస్తున్న యూజర్లు అది జనవరిలో ప్రారంభించబడబోయే అయోధ్య రామమందిరము మాదిరిగా ఉందని నొక్కి చెప్తున్నారు. దర్యాప్తు తరువాత, వైరల్ వీడియో వెంబడి ఉన్న క్లెయిమ్ అసత్యము అని విశ్వాస్ న్యూస్ నిర్ణయించింది. వీడియోలో చూపబడుతున్నది రామమందిరం కాదు, అది హైదరాబాదులోని రామోజీ ఫిల్ప్ స్టూడియో.

ఏది వైరల్ అవుతోంది?

వైరల్ పోస్ట్ ను షేర్ చేస్తూ, ఫేస్‎బుక్ యూజర్ ఇలా వ్రాశారు, “రామమందిరము యొక్క దైవిక దర్శనం.”

దర్యాప్తు:

మా దర్యాప్తును ప్రారంభిస్తూ, మేము వైరల్ వీడియో నుండి కీఫ్రేమ్స్ కొరకు సెర్చ్ చేయాలని గూగుల్ లెన్స్ ఉపయోగించాము. తర్వాత, Pixie.com పై వైరల్ వీడియో నుండి ఒకే విధంగా ఉన్న మందిరం-వంటి దృశ్యాన్ని గుర్తించాము. వెబ్సైట్ పై అందించబడిన సమాచారము ప్రకారము, ఈ దృశ్యము హైదరాబాదులోని రామోజి ఫిల్మ్ స్టూడియో వద్ద ఉన్న మహారాజ దర్బార్ సెటప్.

ఆవిష్కరణపై మేము మరింత దర్యాప్తును కొనసాగించాము మరియు ఇదే వీడియో “రామోజి ఫిల్మ్ సిటి” అనే ఒక యూట్యూబ్ ఛానల్ పై అప్లోడ్ చేయబడి ఉండడాన్ని కనుగొన్నాము. ఈ ఛానల్ పై ఉన్న వివరాల ప్రకారము, ఈ వీడియో రామోజి ఫిల్మ్ సిటి వద్ద భాగవతం సెట్ ను చూపుతుంది.

వైరల్ వీడియోకు సంబంధించిన సమాచారాన్ని ప్రమాణీకరించుటకు, మేము అయోధ్యలోని దైనిక్ జాగరణ్ బ్యూరో చీఫ్ రామశరణ్ అవస్థిని కలిశాము. ఆయనకు వైరల్ వీడియోను షేర్ చేసినప్పుడు ఆయన ఈ వీడియోలో ఉన్నది రామమందిరం కాదని, అ క్లెయిమ్ అసత్యము అని ధృవీకరించారు.

నకిలీ పోస్ట్ ను షేర్ సిన ఫేస్‎బుక్ యూజర్ యొక్క సోషల్ స్కానింగ్ సమయములో, ఈ యూజర్ యొక్క బయో ప్రకారము అతను బంగ్లాదేశ్ నివాసి అని తెలిసింది.

ముగింపు: తన దర్యాప్తులో, వైరల్ వీడియోతో జతచేయబడిన క్లెయిమ్ అసత్యము అని విశ్వాస్ న్యూస్ నిర్ణయించింది. క్లెయిమ్స్ కు వ్యతిరేకంగా, ఈ వీడియో రామమందిరానికి చెందినది కాదు; అయితే, ఇది హైదరాబాదులోని రామోజి ఫిల్మ్ స్టూడియో నుండి ఒక దృశ్యాన్ని చూపుతుంది.

  • Claim Review :  వైరల్ పోస్ట్ షేర్ చేస్తూ, ఫేస్‎బుక్ యూజర్ ఇలా వ్రాశారు, “రామమందిరము యొక్క దైవిక దర్శనం”
  • Claimed By : ఎఫ్‎బి యూజర్: ప్రదీప్ ఆచార్‎జి నిరోబ్(টিকলু)
  • Fact Check : False
False
Symbols that define nature of fake news
  • True
  • Misleading
  • False

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!

Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.

ట్యాగ్స్

Post your suggestion

No more pages to load

సంబంధిత వ్యాసాలు

Next pageNext pageNext page

Post saved! You can read it later