కొత్త ఢిల్లీ (విశ్వాస్ న్యూస్)। సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వైరల్ అవుతోంది, ఇందులో ఒక సందర్భానికి చెందిన కొన్ని ఫోటోల కొల్లాజ్ ఉంది మరియు ఈ ఫోటోలలో కొంతమంది పోలీసులు మసీదు పరిసరాలను శుభ్రం చేస్తూ కనిపిస్తారు. యూజర్ ఈ పోస్ట్ ను షేర్ చేస్తూ ఇది పశ్చిమ బెంగాల్ లోని ఇటీవలి కేసులకు సంబంధించినది అని పేర్కొన్నారు.
విశ్వాస్ న్యూస్ తన దర్యాప్తులో పోలీసులకు సంబంధించిన ఈ ఫోటోలు పశ్చిమ బెంగాల్ కు సంబంధించినవి కాదని, తెలంగాణాకు చెందినవి అని కనుగొనింది. 2016 లోని ఈ ఫోటో, తెలంగాణాలోని భైంసా పోలీసులు స్వచ్ఛత అభయాన్ లో భాగంగా ధార్మిక ప్రదేశాలను శుభ్రం చేశారు. ఈ పాత ఫోటో మతపరమైన రంగులు అద్ది, తప్పుదోవపట్టించే క్లెయిమ్ తో వైరల్ చేయబడింది
ఫేస్బుక్ యూజర్ ‘రాంకుమార్ యాదవ్’ ఈ వైరల్ तस्वीर ను షేర్ చేస్తూ ఇలా వ్రాశారు – నమాజ్ చేయటానికి మసీదును శుభ్రం చేస్తున్న బెంగాల్ పోలీసులను దూషించాలి. నేను బెంగాల్ పోలీసులలో ఉంటే, బెంగాల్ పోలీసుగా రాజీనామా చేసి, యూనిఫార్మ్ వేసుకొని మసీదు శుభ్రం చేస్తున్న వీడియో తయారు చేసి హైకోర్టులో ఆ వీడియోను చూపించి, మసీదు శుభ్రం చేయటానికి నాకు ఉద్యోగం ఇచ్చారా లేక బెంగాల్ న్యాయవ్యవస్థ కొరకు ఇచ్చారా అని బెంగాల్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా హైకోర్టులో నిలదీస్తాను. ఎందుకంటే నేను స్వయంగా ఒక పదవీవిరమణ చేసిన పోలీసు అధికారిని, యూనిఫార్మ్ లో మసీదును శుభ్రం చేస్తున్న వీడియో నా హృదయాన్ని కలచివేసింది, యూనిఫార్మ్ లో మసీదు శుభ్రం చేసిన బెంగాల్ పోలీసులను దూషించాలి, యాక్. థూ….ఒకవేళ యూనిఫార్మ్ లో శుభ్రం చేయాలి అనుకుంటే, ఏదైనా సార్వజనిక ప్రదేశాన్ని యూనిఫార్మ్ లో కాకుండా శుభ్రం చేసి ఉంటే, నా దేశ ప్రజలు మీకు వందనం చేస్తారు, యాక్ థూ… దీని బదులు మీరు రాజీనామా చేసి ఉంటే బాగుండేది.”
ఆ వైరల్ పోస్ట్ లో ఇంకా ఇలా వ్రాసి ఉంది, “మీరు ఎప్పుడైనా పోలీసులు దేవాలయాన్ని శుభ్రం చేయడం చూశారా? లేదు కదా? బెంగాల్ పోలీసులు నమాజ్ కోసం మసీదును శుభ్రం చేస్తున్నారు మరియు ముస్లింలు ఈ ఫోటోను ఫార్వర్డ్ చేస్తూ, హిందువుల మరియు భారతదేశ పోలీసుల స్థాయిని మీరు కూడా చూడండి 44 4 మరియు ఈ పొస్ట్ ను షేర్ చేయండి… మమతా బెనర్జీ ప్రభుత్వములో పోలీసుల స్థాయి ఈ విధంగా ఉంది అని ప్రజలందరికి కూడా తెలియాలి. హిందువులను మరియు భారతదేశాన్ని భగవంతుడే రక్షించాలి.”
పోస్ట్ యొక్క ఆర్కైవ్ వర్షన్ ను ఇక్కడ చూడండి
మా దర్యాప్తును ప్రారంభిస్తూ, ముందుగా మేము గూగుల్ లెన్స్ ద్వారా వైరల్ అవుతున్న ఫోటోను సెర్చ్ చేశాము. సెర్చ్ లో మాకు ఈ ఫోటో న్యూస్ తెలంగాణ టివి పేరు ఉన్న ఫేస్బుక్ పేజ్ పై జూన్ 18, 2016లోని ఒక పోస్ట్ మాకు లభించింది. ఇవ్వబడిన ఫోటోకు సంబంధించి, “#భైంసా_లో_ రమదాన్ సందర్భంగా #మసీద్పంజేషామర్కాజ్మే# భైంసా_పోలీసుల జానిబ్ సే# సఫాయి పని…వందనం భైంసా పోలీసులకు”
దీని ఆధారంగా మేము దర్యాప్తును ముందుకు తీసుకెళ్ళాము మరియు ‘ఏకే న్యూస్” పేరున ఉన్న ఫేస్బుక్ పేజ్ పై కూడా వైరల్ అయిన ఫోటో మాకు లభించింది మరియు ఇక్కడ ఇవ్వబడిన సమాచారము ప్రకారము, వీళ్ళు తెలంగాణాలోని భైంసా పోలీసు స్టేషన్ పోలీసులు. ఈ ఫోటోలను జులై 18, 2016లో అప్లోడ్ చేయబడింది.
ఈ పోస్ట్ ఇదివరకు కూడా వైరల్ చేయబడింది, దీనికి సంబంధించిన వాస్తవ తనిఖీ కూడా మేము చేశాము మరియు అప్పుడు మేము వైరల్ పోస్ట్ కు సంబంధించి నిర్ధారణ కోసం తెలంగాణ టీవీ ఎడిటర్-ఇన్-చీఫ్ అయిన ఫరాజ్ అకెల్విని ఫోన్ ద్వారా సంప్రదించాము. ఆయన మాకు ఇలా చెప్పారు, “వైరల్ ఫోటో 2016కు చెందినది, స్వచ్ఛతా అభయాన్ లో భాగంగా తెలంగాణలోని భైంసా పోలీసులు రంజాన్ సందర్భంగా మసీద్ పంజేషా మర్కజ్ ను శుభ్రం చేశారు”
తప్పుదోవపట్టించే పోస్ట్ ను షేర్ చేసిన ఫేస్బుక్ యూజర్ యొక్క సోషల్ స్కానింగ్ లో మాకు యూజర్ కు రెండు వేలకంటే ఎక్కువమంది ఫాలోయర్స్ ఉన్నారని తెలిసింది.
ముగింపు: విశ్వాస్ న్యూస్ తమ దర్యాప్తులో పోలీసుల ఈ ఫోటో పశ్చిమ బెంగాల్ కు చెందినది కాదు, తెలంగాణకు చెందినది. 2016కు చెందిన ఈ ఫోటో, తెలంగాణా పోలీసులు స్వచ్ఛతా అభయాన్ లో భాగంగా ధార్మిక ప్రదేశాలను శుభ్రం చేసినప్పుడు తీసినది. ఇప్పుడు ఈ పాత ఫోటో, వేరే రంగు పులుముతూ తప్పుదోవపట్టించే క్లెయిమ్ తో వైరల్ చేయబడింది.
Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923