కోవిడ్-19 టాయిలెట్ పేపర్ లో చాలా వేగంగా వృద్ధి చెందుతుంది అని తెలిపే పోస్ట్ అసత్యం. ఈ పోస్ట్ అనధికార వెబ్సైట్ నుండి తీసుకోబడింది.
కొత్త ఢిల్లీ (విశ్వాస్ న్యూస్) సామాజిక మాధ్యమములోని ఒక వైరల్ పోస్ట్ కరోనావైరస్ టిష్యూ పేపర్ లో కనిపించింది అని పేర్కొనింది. ఒక న్యూస్ ఫార్మాట్ లో స్క్రీన్ గ్రాబ్ కూడా అయిన ఈ పోస్ట్ ఈ విధంగా వ్రాసి ఉన్న టెక్స్ట్ కలిగి ఉంది: టాయిలెట్ పేపర్ లో కనిపించిన కోవిడ్-19, ఈ ప్రాణాంతక జాతి టిష్యూ ఫైబర్స్ లో చాలా వేగంగా వృద్ధి చెందుతుంది. విశ్వాస్ న్యూస్ పరిశోధించి ఈ వైరల్ పోస్ట్ అసత్యమని కనుగొనింది.
క్లెయిమ్
గ్రిమ్ హేడ్స్ అనే ఒక యూజర్ ట్విట్టర్ పై షేర్ చేసిన ఒక పోస్ట్ న్యూస్ ఫార్మాట్ లో ఉన్న ఒక స్క్రీన్ గ్రాబ్. ఇందులో ఈ విధమైన టెక్స్ట్ ఉంది: టాయిలెట్ పేపర్ లో కనిపించిన కోవిడ్-19, ఈ ప్రాణాంతక జాతి టిష్యూ ఫైబర్స్ లో చాలా వేగంగా వృద్ధి చెందుతుంది.
ఈ పోస్ట్ యొక్క ఆర్చివ్డ్ వర్షన్ ఇక్కడ చూడవచ్చు.
పరిశోధన
విశ్వాస్ న్యూస్ వారు పరిశోధించినప్పుడు, సెంటర్స్ ఫర్ డిసీస్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) వారు కరోనావైరస్ వ్యాధి టాయిలెట్ కాగితము ప్యాకెట్లలో కనిపించింది మరియు ప్రజలు తమను శుభ్రపరచుకునేందుకు ఒక తడి బట్టను ఉపయోగించడం ప్రారంభించాలి అని ప్రకటించిన ఒక వ్యాసం నుండి ఈ పోస్ట్ తన కంటెంట్ ను తీసుకుందని తెలిసింది.
నౌ8న్యూస్ వెబ్సైట్ లో తప్పుడు సమాచారం కలిగిన అనేక వ్యాసాలు ఉన్నాయి. సెంటర్స్ ఫర్ డిసీస్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) వారి అధికారిక వెబ్సైట్ లో మేము వెతికినప్పుడు, కరోనావైరస్ టిష్యూ పేపర్ లో వృద్ధి చెందుతుంది అని పేర్కొనే ఎలాంటి వాక్యాలు మాకు కనపడలేదు. ఆ వెబ్సైట్ లో ఇలా ఉంది “మీరు దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు టిష్యూ అడ్డం పెట్టుకోండి, ఆ తరువాత ఆ టిష్యూ ను చెత్తబుట్టలో పారవేయండి”
వైరల్ పోస్ట్ లో ఉపయోగించిన చిత్రము ఫార్మాట్ ఒక న్యూస్ బులెటిన్ లాగా కనిపించింది. దీనిని కొన్ని మీమ్ జనరేటర్లను ఉపయోగించి సృష్టించారు. ఇదే మాదిరి ఫార్మాట్ ను ఉపయోగించి మేము ఇదివరకు ఇలాంటి కథనాలను తోసిపుచ్చాము.
విశ్వాస్ న్యూస్ జనరల్ ఫిజీషియన్ అయిన డా. సంజీవ్ కుమార్ గారితో మాట్లాడింది. ఆయన: “నోవెల్ కరోనావైరస్ టిష్యూ పేపర్ లో వృద్ధి చెందుతుంది అనేందుకు ఎలాంటి రుజువు లేదు. వైరల్ పోస్ట్ నిజము కాదు”. అని అన్నారు.
వైరస్ ఉపరితలాలపై ఎంత కాలం జీవించి ఉంటుంది అనేదాని గురించి కూడా మేము వెతికాము. వరల్ద్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూహెచ్‍ఓ) వారి వెబ్సైట్ పై మాకు ఒక నివేదిక కనిపించింది. ఆ నివేదిక ప్రకారము: ఉపరితలాలపై కోవిడ్-19 కలిగించే వైరస్ ఎంతకాలం జీవించి ఉంటుంది అనేది అనిశ్చితము, కాని అది ఇతర కరోనావైరస్ ల మాదిరిగానే ప్రవర్తిస్తున్నట్లు కనిపిస్తోంది. కరోనావైరస్ లు (కోవిడ్-19 పై ప్రాథమిక సమాచారముతో సహా) ఉపరితలాలపై కొన్ని గంటల వరకు లేదా చాలా రోజుల వరకు కూడా ఉండవచ్చు అని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఇది వివిధ పరిస్థితులలో వేరువేరుగా ఉండవచ్చు. (ఉదా ఉపరితలం రకము, పర్యావరణ ఉష్ణోగ్రత లేదా తేమ)
కరోనావైరస్ టిష్యూ పేపర్ లో వృద్ధి చెందుతుంది అనే ఏ అధికారిక వనరులలో పేర్కొనబడలేదు.
निष्कर्ष: కోవిడ్-19 టాయిలెట్ పేపర్ లో చాలా వేగంగా వృద్ధి చెందుతుంది అని తెలిపే పోస్ట్ అసత్యం. ఈ పోస్ట్ అనధికార వెబ్సైట్ నుండి తీసుకోబడింది.
Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923