యూపీఎస్సీ టాపర్‌ రేవతి అంటూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ వైరల్‌ : కానీ, రేవతి ఆంధ్రప్రదేశ్‌ క్యాడర్‌ ఎస్‌ఐ

ముగింపు : కర్నాటకలోని రోజువారీ కూలీ కార్మికుల కుటుంబానికి చెందిన రేవతి అనే అమ్మాయి యూపీఎస్సీ పరీక్షలో మూడో ర్యాంక్‌ సాధించినట్లు సోషల్‌ మీడియాలో జరుగుతున్న వైరల్‌ పోస్ట్‌లు అబద్ధమని మా దర్యాప్తులో తేలింది. రేవతి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో సబ్‌ఇన్స్‌పెక్టర్‌గా ఉద్యోగం చేస్తున్నారు.

హైదరాబాద్‌ (విశ్వాస్ న్యూస్) : కర్ణాటకలోని రోజువారీ కూలీ కార్మికుల కుటుంబానికి చెందిన రేవతి అనే అమ్మాయి యుపిఎస్‌సి పరీక్షల్లో మూడో ర్యాంక్‌ సాధించిందంటూ ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె IASకి ఎంపికయ్యిందని ఈ పోస్ట్‌లో క్లెయిమ్‌ చేస్తున్నారు.

విశ్వాస్ న్యూస్ దర్యాప్తులో యుపీఎస్సీ పరీక్షలో రేవతి మూడవ ర్యాంక్‌ సాధించడం, ఐఏఎస్‌కు ఎంపికయ్యిందని జరుగుతున్న ప్రచారం రెండూ తప్పే అని తేలాయి. ఆమె ఆంధ్రప్రదేశ్ పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌లో సబ్ ఇన్స్‌పెక్టర్ (ఎస్ఐ) గా ఉద్యోగం సంపాదించారు. ఎస్‌ఐ ఉద్యోగం సంపాదించిన సమయంలో తల్లిదండ్రులు ఆమెను అభినందిస్తున్న ఫోటో ఇది.

వైరల్‌ అవుతున్నది ఏంటి ?

ఈ పోస్ట్‌కు సంబంధించిన కామెంట్‌ ఇంగ్లీష్‌లో రాశారు. దాంతో పాటు.. రెండు ఫోటోలతో కూడిన పోస్ట్‌ ఇది. ఈ ఫోటోలకు సంబంధించిన క్యాప్షన్‌లో రేవతి యుపీఎస్సీలో మూడో ర్యాంకు సాధించిందని, ఆమె ఐఎఎస్‌కు ఎంపికైందని రాశారు. రోజువారీ కూలీలైన రేవతి తల్లిదండ్రులు ఈ సంతోష సమాచారం తెలిసి అభినందిస్తున్నారని రైటప్‌ ఇచ్చారు. సివిల్ సర్వీసులపై ఆసక్తి ఉన్న యువతకు రేవతి రోల్ మోడల్ అని కూడా ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు.

ఈ పోస్ట్ 19 జూన్ 2020 న సోషల్ మీడియాలో పోస్ట్‌ చేశారు. ఈ పోస్ట్ ఇప్పటివరకు 24 మంది షేర్‌ చేశారు. ఈ ఫేస్‌బుక్ పోస్ట్‌కు సంబంధించిన ఆర్కైవ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

ఈ పోస్ట్ ఇంకా చాలా చోట్ల షేర్‌ చేసుకోవడం కనిపించింది. షినానాథురై జ్ఞానకరన్ అనే యూజర్‌ 2020 జూన్ 26వ తేదీన ఈ ఫోటోను తన అకౌంట్‌లో పోస్ట్‌ చేశారు. పైన పేర్కొన్న వివరాలన్నీ ఈ పోస్ట్‌లో కూడా పేర్కొన్నారు. ఈ పోస్ట్ ఇప్పటివరకు 1900 మంది షేర్‌ చేసుకున్నారు. ఈ పోస్ట్‌పై 222 మంది కామెంట్లు కూడా చేశారు.

దర్యాప్తు :
ఈ పోస్ట్‌ నిజమా, కాదా అని తెలుసుకోవడానికి, విశ్వాస్‌ న్యూస్‌ దర్యాప్తు చేయాలని నిర్ణయించింది. మొదట గూగుల్‌ సెర్చ్‌ ఇంజన్‌లో ఐఎఎస్ టాపర్ రేవతి పేరుతో శోధించడం జరిగింది. తరువాత మేము ఆమె ఈ ఫోటోను ట్విట్టర్లో కనుగొన్నాము. ఈ పోస్ట్‌ను సుమన్ చోప్రా అనే యూజర్ షేర్ చేశారు. రేవతి యుపీఎస్సీలో మూడవ ర్యాంక్ సాధించారని ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు. అయితే, సరిగ్గా మూడేళ్లక్రితమే అంటే 2017 జూలై 6వ తేదీన ట్విట్టర్‌లో ఈ పోస్ట్ చేశారు.

సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్న పోస్ట్‌లోని ఈ ఫోటో కొత్తది కాదని, అలాగే ప్రచారం కూడా కొత్తది కాదని దీనిద్వారా తేలింది. ఇక, ఈ క్రమంలోనే, ఈ ఫోటోకు సంబంధించిన వాస్తవం ఏంటో తెలుసుకునేందుకు మేము గూగుల్ రివర్స్ ఇమేజ్‌లో శోధించాము. చాలాసేపు ప్రయత్నించిన తర్వాత, మాకు తెలుగు వెబ్‌సైట్ జర్నలిజం పవర్.కామ్‌కు సంబంధించిన లింక్ వచ్చింది. ఈ లింక్ ప్రకారం, రేవతి గురించిన వార్తలు 2017 మార్చి 26వ తేదీనే ప్రచురితమయ్యాయి. ఈ వార్త ప్రకారం, వెంకట రేవతి స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని కృష్ణాజిల్లా అవనిగడ్డ. తల్లిదండ్రులు చాలా పేదవాళ్లు. ఆమె ఆంధ్రప్రదేశ్ పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌ పరీక్షలో సబ్ ఇన్స్‌పెక్టర్ (ఎస్ఐ) పోస్టుకు ఎంపికయ్యారు.

ఈ కేసును ధృవీకరించడానికి విశ్వాస్ న్యూస్ వెంకట్ రేవతిని సంప్రదించాలని నిర్ణయించింది. ఎస్‌ఐ రేవతి తన పై అధికారి డీఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి అనుమతి మేరకు విశ్వాస్‌ న్యూస్‌తో మాట్లాడారు. ఎస్‌ఐ రేవతి తన ఫోటోతో సోషల్‌ మీడియాలో జరుగుతున్న ఈ తప్పుడు ప్రచారంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో తన పేరు మీద జరుగుతున్న ఈ ప్రచారం పూర్తిగా తప్పు అని ఆమె స్పష్టం చేశారు. 2017వ సంవత్సరం నోటిఫికేషన్‌లో ఎస్‌ఐ పదవికి దరఖాస్తు చేసుకున్నట్లు రేవతి చెప్పారు. 2018 లో ఎస్‌ఐగా బాధ్యతలు స్వీకరించానని తెలియజేశారు. తాను సివిల్స్‌కు ఎంపికైనట్లు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోందని చెప్పారు. ఈ ప్రచారానికి వ్యతిరేకంగా ఎస్‌ఐ రేవతి తన ఉన్నతాధికారులకు ఫిర్యాదు కూడా చేశారు. రేవతి స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా అవనిగడ్డ.

ఎస్‌ఐ రేవతికి సంబంధించిన ఇదే నకిలీ పోస్ట్‌ను ‘Untold Baatein’ అనే ఫేస్‌బుక్ పేజీలో కూడా షేర్ చేశారు. 993 మంది ఈ పేజీని ఫాలో అవుతున్నారు.

निष्कर्ष: ముగింపు : కర్నాటకలోని రోజువారీ కూలీ కార్మికుల కుటుంబానికి చెందిన రేవతి అనే అమ్మాయి యూపీఎస్సీ పరీక్షలో మూడో ర్యాంక్‌ సాధించినట్లు సోషల్‌ మీడియాలో జరుగుతున్న వైరల్‌ పోస్ట్‌లు అబద్ధమని మా దర్యాప్తులో తేలింది. రేవతి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో సబ్‌ఇన్స్‌పెక్టర్‌గా ఉద్యోగం చేస్తున్నారు.

False
Symbols that define nature of fake news
Know The Truth...

Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923

Related Posts
ఇటీవలి పోస్ట్ లు