X
X

వాస్తవ తనిఖీ: ధోని ఇస్లాం మతంలోకి మారలేదు, ఎడిట్ చేయబడిన చిత్రాలు వైరల్ అవుతున్నాయి

విశ్వాస్ న్యూస్ దర్యాప్తులో ఈ క్లెయిమ్ అసత్యము అని తేలింది. ధోని యొక్క ఈ చిత్రాలు ఎడిటింగ్ టూల్స్ సహాయముతో తయారు చేయబడ్డాయి. సోషల్ మీడియా యూజర్లు ధోని యొక్క ఎడిట్ చేయబడిన చిత్రాలను తప్పు క్లెయిమ్ తో షేర్ చేస్తున్నారు. దైనిక్ జాగరట్ యొక్క డిజిటల్ స్పోర్ట్స్ ఇన్ చార్జ్ మరియు దైనిక్ జాగరణ్ రాంచి సంపాదకులు ఇద్దరు ఈ పోస్ట్ నకిలీది అని ధృవీకరించారు.

  • By: Pallavi Mishra
  • Published: Aug 13, 2022 at 05:02 PM
  • Updated: Jul 12, 2023 at 06:25 PM

విశ్వాస్ న్యూస్ (కొత్త ఢిల్లీ): మాజీ భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి సంబంధించిన రెండు చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియా యూజర్లు ధోని ఒక ఇస్లామిక్ టోపి ధరించినట్లు ఉన్న వైరల్ చిత్రాలను షేర్ చేస్తున్నారు. ఇందులో మాజీ కెప్టెన్ ఇస్లాం మతంలోకి మారాడు అని క్లెయిమ్ చేయబడింది. విశ్వాస్ న్యూస్ వారి దర్యాప్తులో ఈ క్లెయిమ్ అసత్యమని తేలింది. ధోనికి సంబంధించిన ఈ చిత్రాలు ఎడిటింగ్ సాధనాల సహాయముతో తయారు చేయబడ్డాయి. సోషల్ మీడియా యూజర్లు తప్పు క్లెయిమ్ తో ధోని యొక్క ఎడిట్ చేయబడిన చిత్రాలను షేర్ చేస్తున్నారు.

ఏది వైరల్ అవుతోంది

విశ్వాస్ న్యూస్ ఈ క్లెయిమ్ ను వాస్తవ తనిఖీ కొరకు తన వాస్తవ తనిఖీ వాట్సాప్ చాట్‎బోట్ (+91 95992 99372) లో అందుకుంది. ఒక యూజర్ ఈ వైరల్ క్లెయిమ్ ను షేర్ చేశారు మరియు దీని గురించిన వాస్తవాన్ని తెలుసుకోవాలని అనుకున్నారు. కొన్ని కీవర్డ్స్ తో సెర్చ్ చేసినప్పుడు మాకు కూడా ఈ వైరల్ పోస్ట్ ఫేస్‎బుక్ పై కనిపించింది. “క్రికెట్ ఈస్ మై డ్రగ్. ముఫా భాయ్ ఈస్ మై డీలర్” అనే ఫేస్‎బుక్ పేజ్ ఈ చిత్రాన్ని షేర్ చేసి “మాషాఅల్లా! శుభానల్లా! 3సార్లు ఐసిసి ట్రాఫీ విజేత, ఈనాటి వరకు ఉత్తమ భారత కెప్టెన్, ఇన్షాఅల్లా ఎంఎస్ ధోని ఇస్లాం మతాన్ని స్వీకరించారు. ఆయన తన పేరును ఎండి ధానిష్ ని మార్చుకున్నారు” అని వ్రాసింది.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వర్షన్ ను ఇక్కడ క్లిక్ చేయడం ద్వారా చూడవచ్చు.

దర్యాప్తు

వైరల్ క్లెయిమ్ తోపాటు రెండు చిత్రాలు షేర్ చేయబడ్డాయి. మొదటి చిత్రములో, ధోని ఎరుపు రంగు టి-షర్ట్ వేసుకున్నారు, రెండవ చిత్రములో ఆయన్ పసుపుపచ్చ రంగు టి-షర్ట్ ధరించారు. రెండు చిత్రాలలో, ఆయన తన తలపై ఇస్లామిక్ టోపీని ధరించారు. దర్యాప్తు కొరకు మేము వైరల్ చిత్రాలను వేరువేరుగా పరీక్షించాలని నిర్ణయించుకున్నాము.

మొదటి చిత్రము

ధోని ఎరుపురంగు టి-షర్ట్ లో ఉన్న మొదటి చిత్రాన్ని పరీక్షించుటకు మేము గూగుల్ రివర్స్ ఇమేజ్ ను ఉపయోగించాము. ఈ చిత్రము మాకు indiatvnews.com. పై 2010 నాటి వార్తా కథనములో కనిపించింది. ఈ చిత్రములో,ఆయన తన భార్య సాక్షి ధోనితో కలిసి ఉన్నారు. కాని ఈ చిత్రములో, ఆయన తన తలపిఅ ఇస్లామిక్ టోపి ధరించలేదు.

ఇదే చిత్రము మాకు NDTV యొక్క మరొక వార్తా కథనములో లభించింది. ఈ చిత్రములో కూడా ధోని ఇస్లామిక్ టోపి ధరించలేదు.

రెండవ చిత్రము

ధోని యొక్క పసుపుపచ్చ టి-షర్ట్ చిత్రాన్ని పరీక్షించుటకు కూడా మేము గూగుల్ రివర్స్ ఇమేజ్ ఉపయోగించాము thenewsminute.com యొక్క 2020 నాటి వార్తా కథనములో మాకు ఈ చిత్రము లభించింది. కాని ఈ చిత్రములో కూడా, ఆయన తన తలపై ఇస్లామిక్ టోపి ధరించలేదు.

ఇప్పుడు ధోని ఇస్లాం మతంలోకి మారాడా లేదా అని కనుగొనుటకు మేము కీవర్డ్ సెర్చ్ ను ఆశ్రయించాము. ఏ ప్రామాణిక వార్తా వెబ్సట్ లో కూడా మాకు ఇటువంటి వార్తలు ఏవి లభించలేదు.

ధోని చిత్రాలను మేము Jagran.com స్పోర్ట్స్ ఇన్ చార్జ్ విప్లవ్ కుమార్ కు షేర్ చేశాము. ఈ చిత్రాల వెంబడి చేయబడిన క్లెయిమ్ ను ఆయన కూడా ఖండించారు మరియు ఈ చిత్రాలు ఎడిట్ చేయబడినవి అని మరియు ధోని మతమార్పిడి గురించిన ఎలాంటి వార్త లేదని మాకు చెప్పారు.

ధోని రాంచికి చెందినవారు. అందుచేత, దీనికి సంబంధించిన ధృవీకరణ కొరకు మేము దైనిక్ జాగరణ్ రాంచి సంపాదకులు ప్రదీప్ శుక్లాను కూడా సంప్రదించాము. ఆయన కూడా ఇది అసత్యపు క్లెయిమ్ అని చెప్పారు.

ఈ వైరల్ క్లెయిమ్ “క్రికెట్ ఈస్ మై డ్రగ్. ముఫా భాయ్ ఈస్ మై డీలర్” అనే ఫేస్‎బుక్ పేజ్ ద్వారా షేర్ చేయబడింది. ఈ పేజ్ ను 4000 మందికి పైగా లైక్ చేశారు.

निष्कर्ष: విశ్వాస్ న్యూస్ దర్యాప్తులో ఈ క్లెయిమ్ అసత్యము అని తేలింది. ధోని యొక్క ఈ చిత్రాలు ఎడిటింగ్ టూల్స్ సహాయముతో తయారు చేయబడ్డాయి. సోషల్ మీడియా యూజర్లు ధోని యొక్క ఎడిట్ చేయబడిన చిత్రాలను తప్పు క్లెయిమ్ తో షేర్ చేస్తున్నారు. దైనిక్ జాగరట్ యొక్క డిజిటల్ స్పోర్ట్స్ ఇన్ చార్జ్ మరియు దైనిక్ జాగరణ్ రాంచి సంపాదకులు ఇద్దరు ఈ పోస్ట్ నకిలీది అని ధృవీకరించారు.

  • Claim Review : 3సార్లు ఐసిసి ట్రాఫీ విజేత, ఈనాటి వరకు ఉత్తమ భారత కెప్టెన్, ఇన్షాఅల్లా ఎంఎస్ ధోని ఇస్లాం మతాన్ని స్వీకరించారు. ఆయన తన పేరును ఎండి ధానిష్ ని మార్చుకున్నారు.
  • Claimed By : క్రికెట్ ఈస్ మై డ్రగ్. ముఫా భాయ్ ఈస్ మై డీలర్
  • Fact Check : False
False
Symbols that define nature of fake news
  • True
  • Misleading
  • False

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!

Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.

ట్యాగ్స్

Post your suggestion

No more pages to load

సంబంధిత వ్యాసాలు

Next pageNext page

Post saved! You can read it later