వాస్తవ తనిఖీ: సామాజిక దూరం ముఖ్యమైనది; కాని 14-గంటల విరామం కోవిడ్-19 ని చంపుతుంది అని క్లెయిమ్ చేసే వైరల్ పోస్ట్ తప్పుదారి పట్టిస్తోంది
ఒకచోట కరోనా వైరస్ జీవిత కాలం 8-12 గంటలు మరియు జనతా కర్ఫ్యూ 14 గంటల వరకు విధించబడింది…. కాబట్టి 12 వైరస్ మానవ శరీరాన్ని తాకదు, తద్వారా వైరస్ చనిపోతుంది.
- By: Pallavi Mishra
- Published: Apr 6, 2020 at 06:53 PM
మార్చ్ 19, 2020 ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోది గారు కరోనావైరస్ వ్యాప్తి గురించి దేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ, ముందు జాగ్రత్త చర్యగా మార్చ్ 22, ఆదివారం నాడు ఉదయం 7గంటల నుండి రాత్రి 9 గంటల వరకు ‘జనతా కర్ఫ్యూ’ ప్రకటించారు. జనతా కర్ఫ్యూ ప్రకటించబడిన వెంటనే సామాజిక మాధ్యమాలు జనతా కర్ఫ్యూ ప్రకటించడం వెనుక ఉన్న ఉద్దేశము మరియు లాజిక్ ను వివరించడములో మునిగిపోయాయి. కరోనావైరస్ జీవితకాలం 8-12 గంటల వరకే అని మరియు జనతా కర్ఫ్యూ 14 గంటలు ఉందని పేర్కొంటూ ఒక పోస్ట్ సామాజిక మాధ్యమములో వైరల్ అయింది. అంతే కాకుండా వైరస్ మానవ శరీరాన్ని 12 గంటలలోపు తాకకపోవడం వలన ఆ వైరస్ చనిపోతుందని ఆ పోస్ట్ లో చెప్పారు. విశ్వాస్ న్యూస్ పరిశోధించి వైరల్ పోస్ట్ తప్పుదారి పట్టిస్తోందని కనుగొనింది.
క్లెయిమ్
భల్లాతన్య. 16 అనే ఒక యూజర్ ఇన్స్టా గ్రామ్ పై షేర్ చేసిన ఒక వైరల్ పోస్ట్ లో ఇలా క్లెయిమ్ చేశారు: “జనతా కర్ఫ్యూ వెనుక ఉన్న లాజిక్….ఒకచోట కరోనా వైరస్ జీవిత కాలం 8-12 గంటల వరకు ఉండటం వలన మరియు జనతా కర్ఫ్యూ 14 గంటల వరకు విధించబడింది కాబట్టి… 12 గంటల వరకు ఆ వైరస్ మానవ శరీరాన్ని తాకదు. దీని వలన ఆ వైరస్ చనిపోతుంది” ఈ పోస్ట్ యొక్క ఆర్చివ్డ్ వర్షన్ ఇక్కడ చూడవచ్చు.
పరిశోధన
పరిశోధన సమయములో, విశ్వాస్ న్యూస్ ది న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్ లో ఒక అధ్యయనము కనుగొన్నారు. ఆ అధ్యయనం ప్రకారం, వైరస్ బహిర్గతం అయిన ఉపరితలం ఆధారంగా, అది కొన్ని గంటలు లేదా 2-3 రోజుల వరకు జీవించి ఉండవచ్చు. వారు ఒక నెబ్యులైజర్ సహాయముతో గాలిలోకి వైరస్ ను స్ప్రే చేయడము ద్వారా మానవులలోని పై మరియు కింది శ్వాసకోశ మార్గము నుండి తీసుకోబడిన నమూనాలలో పరిశీలించబడిన రకం వాతావరణాన్ని సృష్టించి అధ్యయనము నిర్వహించారు. ఈ అధ్యయనము ద్వారా వారు ఆ వైరస్ గాలిలో కనిష్ఠంగా 3 గంటల వరకు, రాగి ఉపరితలాలపై 4 గంటల వరకు, కార్డ్ బోర్డ్ పై 24 గంటల వరకు మరియు ప్లాస్టిక్ మరియు స్టెయిన్లెస్ స్టీల్ ఉపరితలాలపై 2-3 రోజుల వరకు కనుగొనబడింది అని కనుగొన్నారు.
అధ్యయనము ప్రకారం, కరోనావైరస్ గాలి ద్వారా కూడా వ్యాప్తి చెందుతుంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూహెచ్‍ఓ), ప్రకారం, “కోవిడ్-19 కలిగించే వైరస్ ఎంతకాలం ఉపరితలాలపై జీవించి ఉంటుంది అనేది ఖచ్ఛితంగా చెప్పలేము, కాని అది ఇతర కరోనావైరస్ ల మాదిరిగానే ప్రవర్తిస్తున్నట్లు కనిపిస్తోంది. కరోనావైరస్ (కోవిడ్-19 వైరస్ పై ప్రాథమిక సమాచారముతో సహా) ఉపరితలాలపై కొన్ని గంటల వరకు లేదా కొన్ని రోజుల వరకు ఉండవచ్చు అని అధ్యయనాలు తెలుపుతున్నాయి. ఇది వివిధ పరిస్థితులలో వేరువేరుగా ఉండవచ్చు. (ఉదా. ఉపరితలం రకము, పర్యావరణము యొక్క ఉష్ణోగ్రత లేదా తేమ)
ఒక ఉపరితలంపై ఇన్ఫెక్షన్ సోకవచ్చు అని మీరు అనుకుంటే, వైరస్ ను చంపుటకు దానిని ఒక సాధారణ డిస్‍ఇన్ఫెక్టెంట్ తో శుభ్రం చేయండి మరియు మిమ్మల్ని మీరు మరియు ఇతరులను రక్షించండి. మీ చేతులను ఆల్కహాల్-ఆధారిత హ్యాండ్ రబ్ తో శుభ్రం చేసుకోండి లేదా సబ్బు మరియు నీటితో కడుక్కోండి. మీ కళ్ళు, నోరు లేదా ముక్కును తాకకండి”
మార్చ్ 22, 2020 నాడు విధించబడిన జనతా కర్ఫ్యూ ప్రజల మధ్య కాంటాక్ట్ ను తగ్గిస్తుంది, ఇది వ్యాధి యొక్క సామాజిక వ్యాప్తిని కొంతవరకు తగ్గించుటలో సహాయపడుతుంది.
విశ్వాస్ న్యూస్ వారు ఈ వైరల్ క్లెయిమ్ గురించి ఇంద్రప్రస్థ అపోలో ఆసుపత్రిలో పనిచేసే డా. సుదీప్ ఖన్నా గారితో మాట్లాడారు. ఆయన, “ఒక ఉపరితలం పై కరోనావైరస్ ఎంతకాలం జీవించి ఉంటుంది అనేది తెలియదు. వైరస్ 8-12 గంటల్లో చనిపోతుంది అని చెప్పడం సరికాదు.”
డబ్ల్యూహెచ్‍ఓ అధికారి ప్రకారం కరోనావైరస్ ఉపరితలాలపై కొన్ని గంటలు లేదా కొన్ని రోజుల వరకు ఉంటుంది అనేది ఖచ్ఛితంగా చెప్పలేదు. ఇది వివిధ పరిస్థితులలో వేరువేరుగా ఉండవచ్చు.
డా. కనుప్రియసింఘాల్, ఆరోగ్య నిపుణులు, యూనిసెఫ్ ప్రకారం, “ప్రతి ఒక్కరు కరోనావైరస్ నుండి తమనుతాము రక్షించుకొనుటకు చేతులను మళ్ళీ మళ్ళీ కడుక్కోవడం మరియు వీలైనంత వరకు తాకకుండా ఉండటం ముఖ్యంగా చేయాలి”
निष्कर्ष: ఒకచోట కరోనా వైరస్ జీవిత కాలం 8-12 గంటలు మరియు జనతా కర్ఫ్యూ 14 గంటల వరకు విధించబడింది…. కాబట్టి 12 వైరస్ మానవ శరీరాన్ని తాకదు, తద్వారా వైరస్ చనిపోతుంది.
Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.