వాస్తవ తనిఖీ: లేదు, ఇది కరోనావైరస్ వ్యాక్సిన్ కాదు, ఇది కోవిడ్-19 పరీక్ష కిట్
ముగింపు: లేదు, వైరల్ పోస్ట్ లో ఉన్న చిత్రము కరోనావైరస్ వ్యాక్సిన్ కాదు. ఇది కోవిడ్-19 పరీక్ష కిట్.
- By: Pallavi Mishra
- Published: Apr 6, 2020 at 06:53 PM
యూఎస్ శాస్త్రవేత్తలు కరోనావైరస్ చికిత్స కొరకు ఒక కొత్త వ్యాక్సిన్ కనుగొన్నారని సామాజిక మాధ్యమాలలో వైరల్ అయిన ఒక పోస్ట్ చెబుతోంది. ఈ ఆదివారం రోషె మెడికల్ కంపెనీ ఆ వ్యాక్సిన్ ను ప్రవేశపెడుతుంది అని యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారని కూడా ఆ పోస్ట్ చెబుతోంది. విశ్వాస్ న్యూస్ వారు పరిశోధించి ఈ వైరల్ పోస్ట్ నకిలీ పోస్ట్ అని కనుగొన్నారు. వైరల్ అయిన చిత్రము కరోనావైరస్ వ్యాక్సిన్ కాదు. వాస్తవానికి ఇది కోవిడ్-19 పరీక్ష కిట్.
క్లెయిమ్
బచ్చాబాబు యాదవ్ అనే ఒక యూజర్ ద్వారా ఫేస్బుక్ పై షేర్ చేయబడిన ఒక వైరల్ పోస్ట్ ఈ విధంగా ఉంది: యూఎస్ శాస్త్రవేత్తలు కరోనావైరస్ చికిత్స కొరకు ఒక కొత్త వ్యాక్సిన్ ను కనుగొన్నారు. ఈ ఆదివారం రోషె మెడికల్ కంపెనీ ఆ వ్యాక్సిన్ ను ప్రవేశపెడుతుంది అని యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఆ పోస్ట్ యొక్క ఆర్చివ్డ్ వర్షన్ ను మీరు ఇక్కడ చూడవచ్చు.
పరిశోధన
విశ్వాస్ న్యూస్ వారు ఆ చిత్రము యొక్క గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ నిర్వహించడము ద్వారా తమ పరిశోధనను ప్రారంభించారు. పరిశోధనలో ఆ చిత్రములో చూపించబడిన ఉత్పత్తి వ్యాక్సిన్ కాదని, అది నోవెల్ కరోనావైరస్ కొరకు ఒక పరీక్ష కిట్ అని వెల్లడి అయింది. మేము వైరల్ చిత్రములో చూపించబడిన ఉత్పత్తి తయారీదారుడి వెబ్సైట్ అయిన Sugentech ను సందర్శించాము.
ఆ ఉత్పత్తి వివరణలో “SGTi-flex కోవిడ్-19 IgM/IgG అనేది మానవ హోల్ బ్లడ్ (చేతివేలి పై గుచ్చి లేదా నరములో తీసుకొన్నది), సీరం లేదా ప్లాస్మాలో కోవిడ్-19 యొక్క IgM మరియు IgG యాంటిబాడీస్ యొక్క నాణ్యతాపరమైన నిర్ధారణ కొరకు ఉపయోగించబడే ఒక గోల్డ్ నానోపార్టికల్-ఆధారిత ఇమ్యూనోక్రోమాటోగ్రాఫిక్ పరీక్ష కిట్. ఈ కిట్స్ చాలా ఖచ్ఛితమైనవి మరియు సులభంగా ఉపయోగించదగినవి మరియు 10 నిమిషాలలో ఫలితాలను నేరుగా కంటితో చూడవచ్చు”
‘Sugentech’ పేజ్ లోని ‘మా గురించి’ విభాగాన్ని మేము చూసినప్పుడు, Sugentech, Inc. ఒక కొరియా-మూలాలు ఉన్న తయారీ సంస్థ అని, ఇది ఇన్-విట్రో డయాగ్నోస్టిక్ ఉత్పత్తుల శ్రేణిని రూపొందించి వాణిజ్యం చేస్తుందని మేము తెలుసుకున్నాము.
ఇంద్రప్రస్థ అపోలో ఆసుపత్రి, కొత్త ఢిల్లీలో పల్మనాలజిస్ట్ అయిన డా. నిఖిల్ మోది గారితో విశ్వాస్ న్యూస్ మాట్లాడారు. మేము ఆయనకు వైరల్ చిత్రాన్ని చూపించగా, ఆయన, “ఇది కరోనావైరస్ ను పరీక్షించుటకు కొరియన్ కంపెనీ రూపొందించబడిన ఒక కిట్. ఇది వ్యాక్సిన్ కాదు. ఇప్పటి వరకు కరోనావైరస్ కు వ్యాక్సిన్ లేదు.” అని అన్నారు.
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఎమ్డికల్ రిసర్చ్ (ఐసీఎంఆర్) కూడా పరీక్ష కిట్స్ ను వాణిజ్య వినియోగానికి సిఫారసు చేసింది.
సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్, ప్రకారము, ప్రస్తుతము 2019-nCoV ఇన్ఫెక్షన్ ను నివారించుటకు ఎలాంటి వ్యాక్సిన్ లేదు. అయినప్పటికీ, శ్వాసకోశ వైరస్ ల వ్యాప్తిని నివారించుటకు సహాయపడే నివారణాత్మక చర్యలు తీసుకోవచ్చు.
निष्कर्ष: ముగింపు: లేదు, వైరల్ పోస్ట్ లో ఉన్న చిత్రము కరోనావైరస్ వ్యాక్సిన్ కాదు. ఇది కోవిడ్-19 పరీక్ష కిట్.
- Claim Review : యూఎస్ శాస్త్రవేత్తలు కరోనావైరస్ చికిత్స కొరకు ఒక కొత్త వ్యాక్సిన్ ను రూపొందించారు.
- Claimed By : బచ్చాబాబు యాదవ్
- Fact Check : False
Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.