X
X

సురక్షిత ఇంటర్నెట్ దినోత్సవం: డిజిటల్ యుగములో మీ గుర్తింపును ఎలా సురక్షితం చేయాలి

కొత్త ఢిల్లీ (విశ్వాస్ న్యూస్): ఆధునిక జీవనములో, కమ్యూనికేషన్, వినోదము, షాపింగ్ మరియు బ్యాంకింగ్ కొరకు అవకాశాలను సమృద్ధిగా అందించే ఇంటర్నెట్ అనేది ఒక అనివార్య అంశం అయ్యింది. అయితే, డిజిటల్ మాధ్యమముపై మనము ఆధారపడటం పెరగడముతో, సైబర్ క్రైమ్, మోసము మరియు గుర్తింపు చౌర్యము వంటి ప్రమాదాలు కూడా పెరుగుతాయి. అందుచేత మన ఆన్లైన్ ఉనికిని సురక్షితం చేసుకోవడానికి మరియు మన సున్నితమైన సమాచారాన్ని పరిరక్షించుకోవడానికి చర్యలు తీసుకోవడం అత్యవసరం.

సురక్షిత ఇంటర్నెట్ దినోత్సవం అనేది ప్రతి సంవత్సరం ఫిబ్రవరి రెండవ వారం రెండవ రోజున పాటించబడుతుంది మరియు ఈ సంవత్సరం అది ఫిబ్రవరి 7వ తేదీన జరుపుకోబడుతుంది. ఈరోజు ఆన్లైన్ సురక్షత మరియు భద్రతల గురించి అవగాహన పెంచుటకు ఒక బలమైన పిలుపు. ఈ వ్యాసములో, మనము వ్యక్తులు తమ ఆన్లైన్ ఫుట్‎ప్రింట్ ను సురక్షితం చేసుకొనుటకు చేపట్టగలిగే కొన్ని ప్రాక్టికల్ చర్యల గురించి పరిశోధిద్దాము.

మొట్టమొదటిగా, అన్ని ఆన్లైన్ ఖాతాలకు ధృఢమైన మరియు ప్రత్యేకమైన పాస్వర్డ్స్ సృష్టించడం అవసరం. ఒక ఉత్తమమైన పాస్వర్డ్ పొడవు కనీసము 12 అక్షరాలు ఉండాలి మరియు అక్షరాలు, అంకెలు మరియు చిహ్నాల సమ్మేళనముగా ఉండాలి. ఇందులో సులభంగా ఊహించగలిగే వ్యక్తిగత సమాచారము ఉండకూడదు, అంటే ఒకరి పేరు, పుట్టినతేది, లేదా చిరునామా వంటివి. సురక్షితమైన పాస్వర్డ్స్ ఉత్పన్నం చేయుటకు మరియు నిల్వ చేయుటకు ఒక పాస్వర్డ్ మేనేజర్ సహకరించగలదు. ధృఢమైన మరియు ప్రత్యేకమైన పాస్వర్డ్స్ సృష్టించుటకు చిట్కాలను మీరు చదవగలిగే ఒక లింక్ ఇక్కడ ఇవ్వబడింది.

ఆన్లైన్ లో స్కామ్స్ మరియు ఫిషింగ్ ప్రయత్నాలు ఉంటాయి, సైబర్ నేరస్థులు వీటిని నమ్మకమైన వ్యక్తుల నుండి సున్నితమైన సమాచారాన్ని సేకరించుటకు ఒక మాధ్యమముగా ఉపయోగిస్తారు. అందుచేత తెలియని మూలాల నుండి ఈమెయిల్స్, సందేశాలు లేదా ఫోన్ కాల్స్ అందుకునే సమయములో జాగ్రత్తగా ఉండడం ముఖ్యం.

ఎలాంటి లింక్స్ లేదా అటాచ్మెంట్స్ పై క్లిక్ చేయకండి మరియు ఎప్పుడు వ్యక్తిగత సమాచారాన్ని అందించకండి. ఎప్పుడూ పంపించేవారి ప్రామాణికతను తనిఖీ చేయండి మరియు పాస్వర్డ్స్ లేదా సున్నితమైన సమాచారము కొరకు అభ్యర్ధనల పట్ల జాగ్రత్తగా ఉండండి. మొబైల్ లేదా ఏటిఎం కోనింగ్ నుండి ఎలా నివారించుకోవాలో తెలుసుకొనుటకు ఇక్కడ చెక్ చేయండి 

మన మొబైల్-ఫస్ట్ ప్రపంచములో, స్మార్ట్ ఫోన్లు మరియు టాబ్లెట్లు మన వ్యక్తిగత సమాచారానికి నిక్షేపస్థానాలు అవుతున్నాయి, దీనితో ఇవి సైబర్ నేరస్థులకు ప్రాథమిక లక్ష్యాలు అవుతున్నాయి. ఈ పరికరాలను సురక్షితం చేయుటకు, ధృఢమైన పాస్వర్డ్స్ లేదా పిన్స్ ఉపయోగించాలని మరియు స్కానింగ్ కొరకు వేలిముద్రలు లేదా ఫేషియల్ గుర్తింపు వంటి బయోమెట్రిక్ ప్రామాణీకరణ పద్ధతులను ఉపయోగించే దిశగా ఆలోచించాలని సూచించబడుతోంది. నష్టము లేదా చౌర్యము జరిగిన సందర్భాలలో, ఎవరైనా ‘ఫైండ్ మై ఫోన్’ ఫీచర్ ను ఉపయోగించాలి, అవసరమైతే రిమోట్‌గా డేటాను తొలగించాలి మరియు మొబైల్ క్యారియర్ కు ఈ సంఘటన గురించి తెలియజేయాలి. పోయిన పరికరము నుండి యాక్సెస్ చేసిన ఖాతాల కొరకు పాస్వర్డ్స్ ను తక్షణమే మార్చాలి. ఒకవేళ మీ పరికరము నష్టము లేదా చోరీ కాబడినా దానిని ఎలా కనుగొనాలి మరియు దానిని కనుగొనలేకపోతే ఏం చేయాలి అనేదానిపై ఒక వీడియోను ఇక్కడ చూడండి. 

డిజిటల్ యుగములో, ఎవరైనా ఆన్లైన్ లో షేర్ చేయబడిన, ముఖ్యంగా సోషల్ మీడియా ప్లాట్ఫార్మ్స్ పై సమాచారము గురించి జాగ్రత్తగా ఉండాలి. పాస్వర్డ్స్, ఆర్ధిక వివరాలు, మరియు ఇంటి చిరునామాలు వంటి సున్నితమైన సమాచారాన్ని జనాంతికం చేయకూడదు. యాప్స్ డౌన్లోడ్ చేసుకునే సమయములో జాగ్రత్తగా ఉండాలి, వాటిని కేవలం విశ్వసనీయమైన మూలాలు, యాప్ స్టోర్ లేదా గూగుల్ ప్లే వంటిమూలాల నుండి డౌన్లోడ్ చేసుకోండి. మీ పాస్వర్డ్స్ ను పరిరక్షించుకోవడం ఎందుకు ముఖ్యం అనేదానిపై అవగాహన కొరకు ఈ వీడియో ను చెక్ చేయండి.

ముగింపు, ఆన్లైన్ సురక్షతను తీవ్రంగా పరిగణించుటకు సురక్షిత ఇంటర్నెట్ దినోత్సవం ఒక జ్ఞాపిక. సులభమైన మరియు ప్రాక్టికల్ చర్యలను అవలంబించడం ద్వారా, ఎవరైనా తమ ఆన్లైన ఫుట్‎ప్రింట్ ను సురక్షితం చేసుకోవచ్చు మరియు డిజిటల్ మాధ్యమములో జరిగే ప్రమాదాల నుండి తమను తాము రక్షించుకోవచ్చు. గుర్తుంచుకోండి, మీ ఆన్లైన్ సురక్షత మీ చేతిలోనే ఉంది మరియు దానిని సురక్షతం చేసుకోవడం మీ ఇష్టం.

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!

Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.

ట్యాగ్స్

Post your suggestion

No more pages to load

సంబంధిత వ్యాసాలు

Next pageNext pageNext page

Post saved! You can read it later