ముగింపు: లేదు, మీ శ్వాసను 10 క్షణాల వరకు పట్టిఉంచడము కరోనావైరస్ కు “స్వీయ-తనిఖీ పరీక్ష” కాదు. మీ గొంతును తేమగా ఉంచుకోవడం మరియు ప్రతి 15 నిమిషాలకు నీరు త్రాగడం వలన కరోనావైరస్ చనిపోదు.
విశ్వాస్ న్యూస్, కొత్త ఢిల్లీ. ఒక సాధారణ ‘స్వీయ-తనిఖీ పరీక్ష’ మీకు కరోనావైరస్ ఉందా లేదా అని నిర్ణయించ గలుగుతుందని ఒక పోస్ట్ సామాజిక మాధ్యమములో చక్కర్లు కొడుతోంది. మీరు దీర్ఘ శ్వాస తీసుకొని ఎలాంటి ఇబ్బంది, పట్టినట్టుగా లేదా బిగువుగా లేకుండా 10 క్షణాల వరకు పట్టి ఉంచగలిగితే, మీ ఊపిరితిత్తులలో ఎలాంటి ఫైబ్రోసిస్ లేదని, ఇది మీకు కరోనావైరస్ ఇన్ఫెక్షన్ లేదని సూచిస్తుందని ఈ వైరల్ పోస్ట్ పేర్కొనింది.
క్లెయిమ్
రాండీ ఫడ్జ్‍బ్రౌనీ అనే ఒక యూజర్ షేర్ చేసిన సామాజిక మాధ్యమములోని వైరల్ పోస్ట్ ఈ విధంగా చెబుతోంది: “కోవిడ్-19, ఒక నిమిషం సమయం వెచ్చించి చదవండి. అర్థంచేసుకోండి!!! కోవిడ్-19 ను నివారించేందుకు ఒక జపాన్ వైద్యుడు అద్భుతమైన సలహాను అందిస్తున్నారు. కొత్త కరోనావైరస్ చాలా రోజుల వరకు (14-27 రోజులు) ఎలాంటి లక్షణాలు చూపించకపోవచ్చు. ఒక వ్యక్తికి ఇన్ఫెక్షన్ సోకింది అని ఎలా తెలుసుకోవాలి? అతనికి జ్వరము మరియు/లేదా దగ్గు వచ్చి ఊపిరితిత్తుల ఆసుపత్రికి వెళ్ళే సమయానికి అతనికి50% ఫైబ్రోసిస్ ఉండవచ్చు, అప్పటికే చాలా ఆలస్యం అయిపోతుంది. తైవాన్ నిపుణులు మనము రోజూ ఉదయం స్వయంగా-నిర్ధారించుకోగలిగే ఒక సులభమైన వ్యాయామాన్ని గురించి చెబుతున్నారు: దీర్ఘ శ్వాస తీసుకోండి మరియు అలాగే 10 క్షణాల కంటే ఎక్కువగా పట్టి ఊపిరి ఉంచండి. ఇలా మీరు దగ్గు మరియు ఇతర ఇబ్బంది, ఎలాంటి ఆందోళన లేదా ఛాతి బిగువు లేకుండా విజయవంతంగా చేయగలిగితే, మీకు ఫైబ్రోసిస్ లేదని మరియు మీకు ఎలాంటి ఇన్ఫెక్షన్ లేదని అది సూచిస్తుంది. తాజా వాతావరణములో ప్రతిరోజూ మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. కోవిడ్-19 కు చికిత్స అందిస్తున్న జపాన్ వైద్యుడు దీనిని నివారించుటకు ఒక ఉత్తమమైన సలహాను అందిస్తున్నారు:
నోరు మరియు గొంతు ఎప్పుడు తేమగా ఉన్నాయని ప్రతిఒక్కరు నిర్ధారించుకోవాలి. ప్రతి 15 నిమిషాలకు నీరు త్రాగండి. ఎందుకు తాగకూడదు? ఒకవేళ వైరస్ నోటిలోకి ప్రవేశించినా, నీరు లేదా ఇతర ద్రవాలు తాగడం వలన అది అన్నవాహిక ద్వారా కడుపులోకి చేరుతుంది. వైరస్ కడుపులో ఉన్నప్పుడు – మీ కడుపులో ఉన్న హైడ్రోక్లోరిక్ ఆమ్లము క్రిములను చంపుతుంది. మీరు తగినంత నీటిని అప్పుడప్పుడు తాగకపోతే, వైరస్ గాలి మార్గాల ద్వారా మీ ఊపిరితిత్తులలోకి చేరగలదు, ఇది ప్రమాదకరమైన పరిస్థితి. ఈ సందేశాన్ని వ్యాప్తి చేయండి” పోస్ట్ యొక్క ఆర్చివ్డ్ వర్షన్ ఇక్కడ చూడవచ్చు.
పరిశోధన
విశ్వాస్ న్యూస్ వారు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూహెచ్‍ఓ) లేదా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) వారు ప్రజల కొరకు విడుదల చేసిన సలహాలలో కరోనావైరస్ కొరకు ఇలాంటి స్వీయ-తనిఖీ పరీక్షను జారీ చేశారా అని కనుగొనుటకు తమ పరిశోధనను ప్రారంభించింది. హెల్త్ ఆర్గనైజేషన్స్ యొక్క వెబ్సైట్స్ లో ఎక్కడా ఇలాంటి స్వీయ-తనిఖీ పరీక్షల గురించి పేర్కొనబడలేదు.
అయితే, హెల్త్ ఆర్గనైజేషన్లు తమకు కోవిడ్-19 ఉండవచ్చు అని భావించే వారిని ఐసొలేషన్ లో ఇంటి వద్దనే ఉండాలని మరియు ఆరోగ్య అధికారుల నుండి వైద్య సంరక్షణను పొందాలని సూచిస్తోంది.
సెంటర్స్ ఫర్ డిసీస్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) ప్రకారము, “కోవిడ్-19 తో కొద్దిగా అనారోగ్యానికి గురి అయిన వారు ఇంటివద్దనే కోలుకోగలుగుతారు. వైద్య సంరక్షణ కొరకు తప్పితే బయటికి రాకండి. బహిరంగ ప్రదేశాలకు వెళ్ళకండి”
ఈ క్లెయిమ్ చైనీస్ వైద్యులు మరియు తైవానీస్ వైద్యులకు తప్పుగా ఆపాదించబడింది
విశ్వాస్ న్యూస్ వారు క్రిటికల్ కేర్, ఇంద్రప్రస్థ అపోలో ఆసుపత్రి, కొత్తఢిల్లీ లో పనిచేసే పల్మనాలజిస్ట్ అయిన డా. రాజేష్ చావ్లా గారిని సంప్రదించింది. ఆయన “ఇది సరికాదు. కరోనావైరస్ 50 శాతం ఫైబ్రోసిస్ కలిగిస్తుంది అనేందుకు ఎలాంటి రుజువు లేదు మరియు ఇది కరోనావైరస్ కు స్వీయ–తనిఖీ పరీక్ష కాదు” అని చెప్తూ ఈ వైరల్ క్లెయిమ్ ను తోసిపుచ్చారు.
మేము క్రిటికల్ కేర్, ఇంద్రప్రస్థ అపోలో ఆసుపత్రి, కొత్తఢిల్లీ లో పనిచేసే పల్మనాలజిస్ట్ అయిన డా. నిఖిల్ మోది గారితో కూడా మాట్లాడాము. ఆయన “ఇది సత్యం కాదు. ఇలాంటి పరీక్ష ఏదీ లేదు. ఇది కరోనావైరస్ గురించి వ్యాప్తి చెందుతున్న ఒక తప్పుడు సమాచారం” అని చెప్తూ ఈ క్లెయిమ్ ను తోసిపుచ్చారు
పోస్ట్ యొక్క మరొక వైరల్ క్లెయిమ్ నీరు ఎక్కువగా తాగుతూ మీ గొంతును తేమగా ఉంచుకోవడం వలన వైరస్ చనిపోతుందని పేర్కొనింది.
మేము పరిశోధించి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూహెచ్‍ఓ) వారి ట్వీట్ ను కనుగొన్నాము. అది ఇలా పేర్కొనింది “నీరు త్రాగి తేమ కలిగి ఉండటం మన ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ, అది కరోనావైరస్ ఇన్ఫెక్షన్ ను నివారించదు”.
సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం, ప్రస్తుతము 2019-nCoV ఇన్ఫెక్షన్ ను నివారించుటకు ఎలాంటి వ్యాక్సిన్ లేదు. అయినప్పటికీ, శ్వాసకోశ వైరస్ ల వ్యాప్తిని నివారించుటకు సహాయపడే నివారణాత్మక చర్యలు తీసుకోవచ్చు.
ముగింపు: లేదు, మీ శ్వాసను 10 క్షణాల వరకు పట్టిఉంచడము కరోనావైరస్ కు “స్వీయ-తనిఖీ పరీక్ష” కాదు. మీ గొంతును తేమగా ఉంచుకోవడం మరియు ప్రతి 15 నిమిషాలకు నీరు త్రాగడం వలన కరోనావైరస్ చనిపోదు.
निष्कर्ष: ముగింపు: లేదు, మీ శ్వాసను 10 క్షణాల వరకు పట్టిఉంచడము కరోనావైరస్ కు “స్వీయ-తనిఖీ పరీక్ష” కాదు. మీ గొంతును తేమగా ఉంచుకోవడం మరియు ప్రతి 15 నిమిషాలకు నీరు త్రాగడం వలన కరోనావైరస్ చనిపోదు.
Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923