వాస్తవ తనిఖీ: వాట్స్యాప్ లో నకిలీ దావా వైరల్ అవుతోంది, ఈ మెసేజ్ ను నమ్మకండి
ముగింపు: వాట్స్యాప్ కు సంబంధించిన ఈ నకిలీ మెసేజ్ చాలా సంవత్సరాలుగా సోషల్ మీడియాలో షేర్ చేయబడుతోంది. ఇది వాస్తవం కాదని తెలుపుతూ, ఇకపై దీనికి షేర్ చేయవద్దని వాట్స్యాప్ అభ్యర్ధించింది.
- By: ameesh rai
- Published: Feb 27, 2021 at 11:00 AM
- Updated: Feb 27, 2021 at 12:27 PM
కొత్త ఢిల్లీ (విశ్వాస్ న్యూస్) సోషల్ మీడియాపై వాట్స్యాప్ లో ఒక మెసేజ్ వైరల్ అవుతోంది. ఈ మెసేజ్ లో వరుణ్ పులయాని అనే ఒక వ్యక్తి ప్రస్తావన చేయబడింది మరియు ఈయన వాట్స్యాప్ డైరెక్టర్ అని పేర్కొనబడింది. ఈ మెసేజ్ వరుణ్ పులయాని తరఫున పంపించబడింది అని మరియు దీనిని కనీసం 20 మందికి ఫార్వర్డ్ చేయకపోతే కొత్త సర్వర్ లో మీ అకౌంట్ తొలగించబడుతుంది అనే వాదనలు వినిపించాయి. ఈ వైరల్ మెసేజ్ లో ‘జిమ్ బాల్సామిక్’ అనే వ్యక్తి ప్రస్తావన కూడా ఉంది. ఈయన వాట్స్యాప్ యొక్క సీఈఓ అని పేర్కొనబడింది. ఇంకా వాట్స్యాప్ మెసెంజర్ లో యూజర్ నేమ్ ఒత్తిడి పెరిగిపోయింది అని వాదనలు వినిపించాయి. ఇక్కడ కూడా మెసేజ్ ఫార్వర్డ్ చేస్తూ అలా ఫార్వర్డ్ చేయకపోతే అకౌంట్ తొలగించబడుతుంది అని చెప్పబడుతోంది. ఈ వాదన ప్రకారం వాట్స్యాప్ ను రీయాక్టివ్ చేసుకొనుటకు నెలకు 25 రూపాయలు చార్జ్ చేయబడుతుంది.
విశ్వాస్ న్యూస్ దర్యాప్తులో ఈ వాదనలు అన్నీ అవాస్తవాలు అని తేలింది. ఈ మెసేజ్ చాలారోజుల నుండి సోషల్ మీడియాలో షేర్ చేయబడుతోంది.
ఏది వైరల్ అవుతోంది
Takhat Sana Huidrom అనే ఒక ఫేస్బుక్ యూజర్ ఒక పబ్లిక్ గ్రూప్ లో ఈ వైరల్ మెసేజ్ ను పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వర్షన్ ను ఇక్కడ క్లిక్ చేసి చూడవచ్చు.
దర్యాప్తు
విశ్వాస్ న్యూస్ ఇదివరకు కూడా ఇలాంటిదే ఒక వైరల్ మెసేజ్ గురించి దర్యాప్తు చేసింది. ఫేస్బుక్ యజమాని మార్క్ జుకర్బర్క్ వాట్స్యాప్ ను 19 అరబ్ డాలర్ లకు కొన్నారని ఈ వైరల్ మెసేజ్ లో ప్రస్తావించబడింది. అయితే ఇదివరకటి వైరల్ మెసేజ్ లో ఇదే వాదన ముఖేష్ అంబాని గురించి చేయబడింది. ఇది తప్ప ఈ రెండు వైరల్ మెసేజ్ లలోని మిగతా వాదనలు అన్నీ ఒక్కటే.
వాట్స్యాప్ యొక్క వ్యవస్థాపకుడు బ్రియాన్ ఆక్టన్ అని మరియు సహ-వ్యవస్థాపకుడు జాన్ కోమ్ అని దర్యాప్తులో మేము తెలుసుకున్నాము. వీరు 2014లో సుమారు 19 అరబ్ డాలర్ల డీల్ లో వాట్స్యాప్ ను ఫేస్బుక్ కు అమ్మేసారు. బీబీసీ యొక్క ఈ రిపోర్ట్ లో ఈ విషయాలన్నీ నిర్ధారించబడ్డాయి. ఈ సమాచారాన్ని మీరు ఇక్కడ క్లిక్ చేసి వాట్స్యాప్ వెబ్సైట్ పై కూడా చూడవచ్చు. వాట్స్యాప్ డైరెక్టర్ గా వరుణ్ పులయాని పేరు మాకు ఎక్కడ కనిపించలేదు.
ఇలంటి వైరల్ వాదనలపై ఇదివరకు విశ్వాస్ న్యూస్ నిర్వహించిన దర్యాప్తును మీరు ఈ దిగువన చూడవచ్చు.
ఈ మెసేజ్ లో 2017 సంవత్సరము వేసవి నుండి వాట్స్యాప్ వినియోగానికి డబ్బులు చెల్లించవలసి ఉంటుంది అని పేర్కొనబడింది. అంటే పాత మెసేజ్ లే ఇప్పటికీ షేర్ చేయబడుతున్నాయని స్పష్టం అవుతుంది. ఇదే కాకుండా ఈ వాదన తప్పు కూడా, ఎందుకంటే వాట్స్యాప్ ఇప్పటికీ ఉచిత మెసేజింగ్ యాప్ గానే ఉంది. దీని సేవల కొరకు యూజర్ నుండి ఎలాంటి చార్జెస్ వసూలు చేయబడవు.
ఈ వైరల్ మెసేజ్ యొక్క రెండవ భాగములో ‘జిమ్ బాల్సామిక్’ అనే ఒక వ్యక్తి వాట్స్యాప్ సీఈఓ అని పేర్కొనబడింది. ఆయన అకౌంట్ నుండి యూజర్ ఈ వైరల్ మెసేజ్ ను తిరిగి షేర్ చేయాలని అభ్యర్ధించబడింది, అలా చేయకపోతే వారి అకౌంట్ తొలగించబడుతుందని చెప్పబడింది. మేము ఈ పేరును ఇంటర్నెట్ పై శోధించినప్పుడు వాట్స్యాప్ యొక్క అధికారిక వెబ్సైట్ పై సమాచారము లభించింది. ఈ సమాచారము ప్రకారం ఈ వైరల్ మెసేజ్ ను ప్రస్తావిస్తూ ఇది నకిలీది అని పేర్కొనబడింది. ఈ రిపోర్ట్ కొరకు మీరు ఇక్కడ క్లిక్ చేసి చూడవచ్చు.
వాట్స్యాప్ సపోర్ట్ సహకారముతో విశ్వాస్ న్యూస్ ఈ వైరల్ మెసేజ్ గురించి దర్యాప్తు చేసింది. వాట్స్యాప్ సపోర్ట్ మాకు మెయిల్ లో సమాధానాలు ఇస్తూ ఈ మెసేజ్ నకిలీది అని తెలిపింది. వాట్స్యాప్ సపోర్ట్ ప్రకారం ఈ మెసేజ్ అనధికార మూడవ పార్టీ నుండి వచ్చింది. ఇలాంటి మెసేజ్ లను నమ్మవద్దని మరియు వాటి ఫార్వర్డ్ చేయవద్దని వాట్స్యాప్ సపోర్ట్ అభ్యర్ధించింది.
ఈ వైరల్ మెసేజ్ ను షేర్ చేసిన Takhat Sana Huidrom అనే ఫేస్బుక్ ప్రొఫైల్ ను విశ్వాస్ న్యూస్ స్కాన్ చేసింది ఈ ప్రొఫైల్ తన గురించిన సమాచారాన్ని పబ్లిక్ చేయలేదు.
निष्कर्ष: ముగింపు: వాట్స్యాప్ కు సంబంధించిన ఈ నకిలీ మెసేజ్ చాలా సంవత్సరాలుగా సోషల్ మీడియాలో షేర్ చేయబడుతోంది. ఇది వాస్తవం కాదని తెలుపుతూ, ఇకపై దీనికి షేర్ చేయవద్దని వాట్స్యాప్ అభ్యర్ధించింది.
- Claim Review : Do not ignore please read it carefully
- Claimed By : Kangleipak Meme Lovers team(KMLT)
- Fact Check : False
Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.