తాండవ నది వరద రైల్వేబ్రిడ్జిపైనుంచి వెళ్తుందంటూ జరుగుతున్న ప్రచారం తప్పుదారి పట్టిస్తోంది. ఇది ఏడేళ్ల క్రితం నాటి వీడియో. ఇప్పుడు రికార్డ్ చేసిందంటూ సోషల్ మీడియాతో పాటు.. మీడియా ఛానెళ్లు కూడా ప్రసారం చేశాయి.
హైదరాబాద్ (విశ్వాస్ న్యూస్) : ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాల కారణంగా తాండవ నది పొంగి పొర్లుతోందని, వరద నీరు రైల్వే బ్రిడ్జిని ముంచెత్తిందని ఓ వీడియో సోషల్ మీడియాలో తిరుగుతోంది. ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో ఇది నిజమే అనుకొని చాలామంది దీనిని ఫార్వార్డ్ చేస్తున్నారు.
విశ్వాస్ న్యూస్ దర్యాప్తులో ఈ వీడియో పాతది అని కనుగొనడం జరిగింది. ఏడు సంవత్సరాల క్రితం పోటెత్తిన వరదల సమయంలో ఈ దృశ్యాలు రికార్డు చేసినట్లు నిర్ధారించడం జరిగింది. ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ తప్పుదారి పట్టిస్తున్నారు.
వైరల్ అవుతున్నది ఏంటి?
సోషల్ మీడియాతో పాటు.. యూట్యూబ్‌లో కూడా ఓ వీడియో విపరీతంగా తిరుగుతోంది. ఆ వీడియో కింద రైటప్ ఇలా ఇచ్చారు. ‘ఆంధ్రప్రదేశ్‌ను ముంచెత్తుతున్న వర్షాలతో తాండవనది ఉగ్రరూపం దాల్చింది. రైల్వేబ్రిడ్జిపై నుంచి వరద నీరు ప్రవహిస్తోంది’. అంటూ ప్రచారం జరుగుతోంది. ఈ బ్రిడ్జి ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లా తుని సమీపంలో ఉంది.
దర్యాప్తు :
ఈ వీడియో ఇప్పటిదేనా? లేదంటే పాతదా అని తెలుసుకునేందుకు విశ్వాస్ న్యూస్ దర్యాప్తు చేసింది. మొదట ఇన్‌విడ్ వీడియో టూల్ ద్వారా వాస్తవం ఏంటోకనుక్కునే ప్రయత్నం చేశాము. ఆ తర్వాత కీలక పదాలతోనూ శోధించడం జరిగింది. ఇలా పరిశోధిస్తున్న సమయంలో రిజల్ట్స్ దొరికాయి. ప్రధాన మీడియా ఛానెళ్లు కూడా ఈ వీడియోను మొన్నటి వరదలు వచ్చిన సమయంలో తీసినదని ప్రచారం చేశాయి.
తెలుగు మీడియా ఛానెల్ ఎన్‌టీవీ ఈ వీడియోను ప్రసారం చేయడంతో పాటు.. తన యూట్యూబ్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేసింది. ఈ లింక్‌లో వీడియోను చూడవచ్చు.
ఎన్‌టీవీ వీడియో లింక్ అర్కైవ్ వెర్షన్ ఇక్కడ చూడొచ్చు.
నవ తెలంగాణ దినపత్రిక తన వెబ్‌సైట్‌లో ఈ వీడియోను అప్‌లోడ్ చేసింది. ఇక్కడ దీని లింక్ చూడవచ్చు.
నవతెలంగాణ లింక్ అర్కైవ్ వెర్షన్ ఇక్కడ చూడొచ్చు.
‘solo బ్రతుకు’ అనే ట్విట్టర్ హ్యాండిల్‌పై కూడా ఈ వీడియో అప్‌లోడ్ చేశారు. తుని రైల్వే బ్రిడ్జి ఇలా ఉందంటూ రైటప్‌ఇచ్చారు. ఆ లింక్ ఇక్కడ చూడొచ్చు.
ఈ లింక్ అర్కైవ్ వెర్షన్‌ను ఇక్కడ చూడొచ్చు.
ఇవే కాదు.. చాలా యూట్యూబ్ ఛానెళ్లలో ఈ వీడియోను అప్‌లోడ్ చేశారు. ఇటీవలి వరదలకు సంబంధించిన వీడియో అంటూ పేర్కొన్నారు. వాటిలో ప్రధాన టీవీ ఛానెళ్లు కూడా ఉండటం ఆశ్చర్యం కలిగించింది. అందరూ ఇప్పటిదే ఆ వీడియో అంటూ అప్‌లోడ్ చేసేశారు.
విశ్వాస్ న్యూస్ అయినా కూడా నమ్మకుండా ఇంకా దర్యాప్తును కొనసాగించింది. ఈ దర్యాప్తు ఫలించింది. ఈ వీడియో ఏడేళ్లక్రితం నాటిది అనేందుకు అవసరమైన లింక్‌ను కనుక్కుంది. ఈ వీడియో లింక్ ఇక్కడ చూడొచ్చు.
ఆ వీడియో అర్కైవ్ లింక్ ఇక్కడ చూడొచ్చు.
దీనిని నిర్ధారించుకునేందుకు విశ్వాస్ న్యూస్ సౌత్ సెంట్రల్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ రాకేష్‌ను సంప్రదించింది. ఆ వీడియో ఇప్పుడు రికార్డ్ చేసినది కాదని, రైల్వేబ్రిడ్జి మీదకు నీళ్లు రాలేదని తెలిపారు. రైళ్లు మామూలుగానే తిరుగుతున్నాయని స్పష్టత ఇచ్చారు.
అలాగే, తాండవ నది బ్రిడ్జి వద్ద ప్రస్తుత పరిస్థితికి సంబంధించి తాజా ఫోటోగ్రాఫ్‌లు విశ్వాస్‌న్యూస్ సంపాదించింది.
వైరల్ పోస్ట్ చేసిన ట్విట్టర్ అకౌంట్‌ను సోషల్ స్కాన్ చేయడం జరిగింది. ఈ ట్విట్టర్ హ్యాండిల్‌కు 468 మంది ఫాలోవర్లు ఉన్నారు. డిసెంబర్ 2017 నుంచి ఈ అకౌంట్ యాక్టివ్‌గా ఉంది.
निष्कर्ष: తాండవ నది వరద రైల్వేబ్రిడ్జిపైనుంచి వెళ్తుందంటూ జరుగుతున్న ప్రచారం తప్పుదారి పట్టిస్తోంది. ఇది ఏడేళ్ల క్రితం నాటి వీడియో. ఇప్పుడు రికార్డ్ చేసిందంటూ సోషల్ మీడియాతో పాటు.. మీడియా ఛానెళ్లు కూడా ప్రసారం చేశాయి.
Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923