కొత్త ఢిల్లీ (విశ్వాస్ న్యూస్): పబ్జి ద్వారా ప్రేమలో పడిన తరువాత పాకిస్తాన్ నుండి తన పిల్లలతో ఇండియాకు అక్రమంగా చేరిన సీమా హైదర్, ఈరోజులలో వార్తల్లో నిలిచింది. సీమా హైదర్ పాకిస్తాన్ సైన్యములో పనిచేసింది అని క్లెయిమ్ చేస్తూ సీమా హైదర్ మరొక మహిళతో ఉన్న ఒక కొల్లాజ్ ను షేర్ చేసిన యూజర్స్ నుండి విశ్వాస్ న్యూస్ యొక్క టిప్‌లైన్ నంబర్ కు అనేక అభ్యర్ధనలు వచ్చాయి. వైరల్ కొల్లాజ్ లో కనిపించే మహిళ పాకిస్తాని సైన్యం యూనిఫార్మ్ ధరించింది.
విశ్వాస్ న్యూస్ దర్యాప్తు జరిపి, ఈ క్లెయిమ్ అసత్యము అని తేల్చింది. పాకిస్తాన్ సైన్యాధికారి మేజర్ సామియా రెహమాన్ ను వైరల్ పోస్ట్ లో సీమా హైదర్ గా క్లెయిమ్ చేస్తున్నారు. మేజర్ రెహమాన్ యునైటెడ్ నేషన్స్ శాంతి పరిరక్షణ దళములో భాగంగా పాకిస్తాన్ నుండి ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో శాంతి పరిరక్షణ చర్యలలో పాల్గొనింది. యూఎన్ శాంతి పరిరక్షకురాలిగా ఆమె పదవీకాలం 2020లో ముగిసింది.
ఒక యూజర్ విశ్వాస్ న్యూస్ యొక్క వాట్సాప్ టిప్‌లైన్ నంబర్ +91 9599299372 కు ఈ వీడియో పంపిస్తూ, దాని ప్రామాణికత గురించి స్పష్టతను అభ్యర్ధించారు.
వైరల్ కొల్లాజ్ లో సైన్యం యూనిఫార్మ్ లో సీమా హైదర్ పక్కన ఉన్నట్లు కనిపిస్తుంది. మేము ఈ చిత్రము యొక్క అసలు మూలాన్ని కనుక్కోవడానికి ఒక రివర్స్ ఇమేజ్ సెర్చ్ నిర్వహించాము. సెర్చ్ సమయములో, ఈ చిత్రాన్ని మేము పాకిస్తాని వెబ్సైట్ ostpk.com పై చూశాము. ఇది జనవరి 16, 2022లో ప్రచురించబడింది. అందించబడిన సమాచారము ప్రకారము, ఈ చిత్రము పాకిస్తాని మేజర్ సామియా రెహమాన్ కు సంబంధించినది. సైన్యం యూనిఫార్మ్ లో ఉన్న ఆమె ఫోటోలు అనేక ఇతర నివేదికలలో కూడా చూడవచ్చు.
తదుపరి సెర్చ్ లో మాకు యూట్యూబ్ ఛానల్ ‘పాకిలింక్స్ న్యూస్’ పై ఒక సంవత్సరం క్రితం అప్లోడ్ చేయబడిన ఒక వీడియో లభించింది, ఇందులో ఇదే చిత్రం షేర్ చేయబడింది. అందించబడిన సమాచారము ప్రకారము, ఈ చిత్రము యునైటెడ్ నేషన్స్ లో సేవలు అందించిన మేజర్ సామియా రెహమాన్ కు చెందినది.
సామియా రెహమాన్ చిత్రాలను చూస్తే, ఆమె మరియు సీమా హైదర్ ఇద్దరు వేరువేరు వ్యక్తులు అని స్పష్టం అవుతుంది. చూపించబడిన కొల్లాజ్ లో ఈ విషయం స్పష్టంగా తెలుస్తుంది.
‘మేజర్ సామియా రెహమాన్’ అనే కీవర్డ్స్ ను మా సెర్చ్ లో ఉపయోగించినప్పుడు, మాకు thenews.com.pk పై మే 12, 2020 నాడు ప్రచురించబడిన ఒక నివేదిక మాకు లభించింది. ఆ నివేదిక ప్రకారము, పాకిస్తాన్ యొక్క బహుమతి-విజేత మేజర్ సామియా రెహమాన్, యూఎన్ శాంతి పరిరక్షణ దళముతో తన పదవీకాలాన్ని పూర్తి చేసుకున్న తరువాత కోవిడ్-19 కారణంగా ఇంటికి తిరిగి రాలేకపోయింది. యునైటెడ్ నేషన్స్ శాంతి పరిరక్షణ దళముతో తన చివరి మిషన్ లో భాగంగా డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో లో ఆమెను నిలబెట్టారు.
యూఎన్ శాంతి పరిరక్షణ యొక్క అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ కూడా ఏప్రిల్ 6, 2020 నాడు ఆమె పదవీకాలం ముగిసింది అని ధృవీకరించింది.
మేము పాకిస్తాని విలేఖరి మరియు ఫాక్ట్-చెక్కర్ లుబ్నా జరార్ నక్విని వైరల్ చిత్రానికి సంబంధించి సంప్రదించాము. వైరల్ ఫోటోలో సైన్యం యూనిఫార్మ్ లో ఉన్న మహిళ పాకిస్తాని సైన్యాధికారి సామియా రెహమాన్ అని ఆమె ధృవీకరించారు. “యూఎన్ శాంతి పరిరక్షణ దళముతో తన ప్రచారాల కారణంగా సామియా రెహమాన్ పేరుప్రతిష్ఠలు సంపాదించారు మరియు యూఎన్ లో ఆమె పదవీకాలం 2020లో ముగిసింది.” అని ఆమె చెప్పారు.
జాగరణ్ లో నివేదిక ప్రకారము, “కరాచి, పాకిస్తాన్ కు చెందిన సీమా హైదర్, ఆల్లైన్ పబ్జి ఆట ఆడేటప్పుడు రబుపురా నివాసి అయిన సచిన్ ను సంప్రదించింది. ఇద్దరు రాత్రంతా ఆటలు ఆడేవారు. ఈ సమయములో వాళ్ళు ప్రేమలో పడ్డారు. మే 13న భారతదేశ సరిహద్దు దాటి తన నలుగురు పిల్లలతో రబుపురాకు వచ్చింది. ఆమె ముందుగా పాకిస్తాన్ నుండి దుబాయ్ కు ప్రయాణించింది మరియు వీసా లేకుండా నేపాల్ మీదుగా భారతదేశములోకి ప్రవేశించింది. పోలీసులు ఆమె భారతదేశములో ఒకటిన్నర నెలలు ఉన్నతరువాత జులై 5 న సీమా హైదర్ మరియు సచిన్ లను అరెస్ట్ చేశారు. కోర్టు నుండి బెయిల్ వచ్చిన తరువాత్, ఇద్దరు రబుపురాలో నివసించేవారు.”
మా దర్యాప్తు ఆధారంగా, పాకిస్తాన్ నుండి భారతదేశానికి వచ్చిన సీమా హైదర్ కు చెందినది అనే క్లెయిమ్ తో ఉన్న వైరల్ చిత్రములో ఉన్నది పాకిస్తానీ సైన్యాధికారి. ఆ చిత్రము యూఎన్ శాంతిపరిరక్షణ మిషన్ లో పనిచేసే మరొక మహిళను చూపుతుంది.
విశ్వాస్ న్యూస్ ఇచ్చిన ఈ వాస్తవ-తనిఖీ నివేదిక, సైన్యం యూనివార్మ్ వేసుకున్న ఒక మహిళ ఫోటో ఆధారంగా సీమా హైదర్ పాకిస్తాన్ సైన్యములో సేవలు అందించింది అని సూచించే వైరల్ కొల్లాజ్ గురించి దర్యాప్తు చేయడముపై దృష్టి కేంద్రీకరించింది.
ముగింపు: వైరల్ చిత్రములోని యూనిఫార్మ్ వేసుకున్న మహిళ, యూఎన్ శాంతి పరిరక్షణ దళములో పనిచేసిన పాకిస్తాన్ మేజర్ సామియా రెహమాన్ కు చెంఇద్నది. అది ప్రేమకోసం పాకిస్తాన్ నుండి భారతదేశానికి వచ్చిన సీమా హైదర్ కు చెందినది కాదు.
Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923