ముగింపు : ఉస్మానియా ఆసుపత్రి మార్చురీకి సంబంధించిన పాత వీడియోను.. కరోనా ఇన్ఫెక్షన్ నేపథ్యంలో వైరస్‌కు ముడిపెడుతూ వైరల్ చేశారు. వాస్తవానికి, సుమారు ఆరు సంవత్సరాల క్రితం వీడియో ఇది. దీనికి కరోనా వైరస్ వ్యాప్తితో సంబంధం లేదు.
హైదరాబాద్ (విశ్వాస్ న్యూస్) : దేశవ్యాప్తంగా రోజురోజుకూ పెరిగిపోతున్న కరోనా వైరస్ కేసుల మధ్య, ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో చాలా మృతదేహాలు కనిపిస్తున్నాయి. కరోనా వైరస్‌తో మరణించిన వాళ్ల మృతదేహాలు ఇలా గుట్టలు గుట్టలుగా ఉస్మానియా ఆసుపత్రి మార్చురీలో పడి ఉన్నాయని ఆ వీడియోలో పేర్కొన్నారు.
విశ్వాస్ న్యూస్ దర్యాప్తులో ఈ వాదన అబద్ధమని తేలింది. ఉస్మానియా హాస్పిటల్ మార్చురీకి సంబంధించిన ఆరేళ్లక్రితం వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. వీటికి కరోనా వైరస్‌కు ఎలాంటి సంబంధం లేదు.
వైరల్ పోస్ట్ లో ఏముంది ?
‘హైదరాబాద్ మేరే జాన్’ అనే ఫేస్ బుక్ పేజీలో ఈ వైరల్ వీడియో (ఆర్కైవ్ లింక్) ను షేర్ చేశారు.
‘#Shame Shame #osmania Hospital Ka Ye Haal Hai Corona Virus Ke Died Body’s ka yeh hall hai waha Is Virus Ko Mazak Maat Samjho Pls#
Stay home’ అని రైటప్ కూడా ఇచ్చారు.
దర్యాప్తులో భాగంగా ఈ ఫేస్‌బుక్ పేజీని పరిశీలించగా.. 408 మందికి పైగా ఈ వీడియోను షేర్ చేసుకున్నారు. అదే సమయంలో, ఈవీడియోను సుమారు ఏడు వేల మంది చూశారు.
దర్యాప్తు :
వీడియోతో పాటు ప్రస్తావించిన దావాల్లో నిజాయితీ ఎంత ఉందో ధృవీకరించడానికి మేము YouTube సహాయంతో పరిశోధించాము. అలా శోధిస్తున్న క్రమంలో ‘Ind ToDaY’ అనే యూట్యూబ్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేసిన అదే వీడియోను గుర్తించడం జరిగింది. వాస్తవానికి 2013 డిసెంబర్ 25వ తేదీన ఈ వీడియోను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశారు. ఈ వీడియోతో పాటు అందించిన సమాచారం ప్రకారం, హైదరాబాద్‌లోని ఉస్మానియా హాస్పిటల్‌కు సంబంధించిన మార్చురీ మృతదేహాల కుప్పలతో నిండి ఉంది. వాటిని గుర్తించడానికి గానీ, తీసుకెళ్లడానికి గానీ ఎవరూ రావడం లేదు.
https://www.youtube.com/watch?v=4EnfUhGznkM&feature=youtu.be
ఈ క్రమంలోనే పరిశోధిస్తున్న సమయంలో.. జూన్ 26వ తేదీన ‘Ind Today’ ఫేస్ బుక్ పేజీలో
ఈ వీడియోకు సంబంధించిన వివరణ కనిపించింది. దీంతో వైరల్ అవుతున్న ఈ వీడియోపై స్పష్టత వచ్చింది.
2020 జూన్ 26వ తేదీన ఈ వీడియో ఆరేళ్లక్రితం నాటిదని ‘Ind Today’ స్పష్టత ఇచ్చింది. ఆ పోస్ట్‌లో ఉన్న వివరాలు చూస్తే… ‘IndToday’ వైరల్ వీడియోపై ఈ స్పష్టత ఇస్తోంది :
‘IndToday కు చెందిన ఒక వీడియో ట్యాంపర్ చేయబడిందని, ఉస్మానియా హాస్పిటల్ మార్చురీ యొక్క దారుణమైన పరిస్థితిని చూపించే ఆ వీడియో తప్పుడుగా సోషల్ మీడియాలో వైరల్ చేయబడిందని ‘IndToday’ తన ప్రేక్షకులకు తెలియజేస్తుంది. రోజుల తరబడి గుట్టలుగా పేరుకుపోయిన మృతదేహాలను చూపిస్తున్న ఈ వీడియో వాస్తవానికి ఆరేళ్లక్రితం నాటిది. ఇది డిసెంబర్ 25, 2013న యూట్యూబ్‌లో పోస్ట్ చేసిన వీడియో. వాట్సాప్ యూజర్లు దీనిని తాజా వీడియోగా పొరపాటు పడవద్దని, భయపడవద్దని IndToday అభ్యర్థిస్తుంది.
ఎవరైనా ఈ వీడియోను ఉపయోగిస్తే, చట్టపరమైన పరిణామాలకు వాళ్లు బాధ్యత వహించాల్సి ఉంటుంది. ధన్యవాదాలు.’
ఈ వైరల్ వీడియోకు సంబంధించి మరింత స్పష్టత కోసం మేము టీవీ 9 అనే న్యూస్ ఛానెల్‌లో పనిచేసే హైదరాబాద్ క్రైమ్ రిపోర్టర్ నూర్ మహ్మద్‌ను సంప్రదించాము. “ఈ వైరల్ అవుతున్న వీడియోకు కరోనా వైరస్ వ్యాప్తితో ఎటువంటి సంబంధం లేదు. ఇది ఆరు సంవత్సరాల క్రితం వీడియో, ఈ వాస్తవాన్ని ప్రజలు గుర్తించారు. వాస్తవాలను షేర్ కూడా చేసుకుంటున్నారు.’ అని ఆయన విశ్వాస్ న్యూస్‌కు చెప్పారు.
కరోనా వ్యాప్తి నేపథ్యంలో పాత ఫోటోలు, వీడియోలు తప్పుడు వాదనలతో సోషల్ మీడియాలో ఎక్కువగా షేర్ చేయబడుతున్నాయి. ఇటీవలే న్యూ ఢిల్లీలోని లోక్‌నాయక్ జయప్రకాష్ నారాయణ్ హాస్పిటల్ పేరిట ముంబైలోని ఒక ఆసుపత్రికి సంబంధించిన పాత వీడియో వైరల్ అయ్యింది, దీనిని విశ్వాస్ న్యూస్ దర్యాప్తు చేసింది. అది తప్పుడు ప్రచారమని తేల్చింది.
”హైదరాబాద్ ఉస్మానియా ఆసుపత్రి మార్చురీకి సంబంధించిన తప్పుడు వైరల్ వీడియోను షేర్ చేసిన పేజీని నాలుగు వేల మందికి పైగా ఫాలో అవుతున్నారు. ”
निष्कर्ष: ముగింపు : ఉస్మానియా ఆసుపత్రి మార్చురీకి సంబంధించిన పాత వీడియోను.. కరోనా ఇన్ఫెక్షన్ నేపథ్యంలో వైరస్‌కు ముడిపెడుతూ వైరల్ చేశారు. వాస్తవానికి, సుమారు ఆరు సంవత్సరాల క్రితం వీడియో ఇది. దీనికి కరోనా వైరస్ వ్యాప్తితో సంబంధం లేదు.
Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923