వాస్తవ తనిఖీ: లేదు, కాకరకాయ రసము నోవెల్ కరోనావైరస్ ను తగ్గించలేదు, ఆరోగ్య నిపుణులు ఈ వైరల్ క్లెయిమ్ ను తోసిపుచ్చారు.
ముగింపు: కాకరకాయ రసం నోవెల్ కరోనావైరస్ ను 2 గంటలలో తగ్గిస్తుంది అనేది నకిలీ క్లెయిమ్. బీహార్ ఆరోగ్య విభాగము ఇలాంటి స్టేట్మెంట్ ను జారీ చేయలేదు.
- By: Pallavi Mishra
- Published: Apr 6, 2020 at 06:52 PM
కాకరకాయ రసము 2 గంటలలో నోవెల్ కరోనావైరస్ ను సమర్థవంతంగా తగ్గించగలదని సామాజిక మాధ్యమములోని ఒక వైరల్ పోస్ట్ పేర్కొంటోంది. అంతే కాకుండా ఈ సమాచారాన్ని తెలియజేసిందని బీహార్ ఆరోగ్య విభాగము పేరు కూడా ఆ పోస్ట్ పేర్కొనింది. విశ్వాస్ న్యూస్ పరిశోధన చేసి ఈ వైరల్ క్లెయిమ్ తప్పు అని కనుగొనింది. వైరల్ క్లెయిమ్ కు మద్ధతుగా ఎలాంటి రుజువు లేదని చెబుతూ వైద్య నిపుణులు క్లెయిమ్ ను తోసిపుచ్చారు.
క్లెయిమ్
ఎండీషహీద్ అనే యూజర్ ఫేస్బుక్ పై షేర్ చేసిన ఒక పోస్ట్ ఈ విధంగా ఉంది: కరోనావైరస్ కు చికిత్స కనుగొనబడింది. కాకరకాయ రసము తాగడము వలన కరోనావైరస్ 2 గంటలలో చనిపోతుందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. బీహార్ ఆరోగ్య విభాగము పాట్నా వారి పేరు కూడా పేర్కొనబడింది. పోస్ట్ యొక్క ఆర్చివ్డ్ వర్షన్ ను ఇక్కడ చూడవచ్చు.
పరిశోధన
విశ్వాస్ న్యూస్ వారు బీహార్ రాష్ట్ర విభాగము యొక్క డిసీజ్ కంట్రోల్ అండ్ పబ్లిక్ హెల్త్ లో డైరెక్టర్ అయిన డా. నవీన్ చంద్ర ప్రసాద్ గారిని సంప్రదించడము ద్వారా తమ పరిశోధనను ప్రారంభించారు. ఆయన, “ఇది తప్పు క్లెయిమ్. మేము ఇటువంటి స్టేట్మెంట్ ఏదీ జారీ చేయలేదు. ఇవన్నీ ఒట్టి పుకార్లే. ఈ క్లెయిమ్ కు మద్దతుగా ఎలాంటి రుజువులు లేవు”
అంటే, ఈ వైరల్ క్లెయిమ్ పొరపాటుగా బీహార్ ప్రభుత్వం ఆరోగ్య విభాగానికి ఆపాదించబడింది.
కాకరకాయ రసం కరోనావైరస్ ను తగ్గించగలదా అనే విషయముపై మేము మరింతగా పరిశోధించారు. సైన్స్ డైరెక్ట్ లో ప్రచురించబడిన ఒక నివేదిక ప్రకారం, కాకరకాయ రసం కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉంది. కాని, ఎక్కడా కాకరకాయ రసం 2 గంటలలో కరోనావైరస్ ను తగ్గిస్తుంది అని పేర్కొనబడలేదు.
విశ్వాస్ న్యూస్ వారు డా. విమల్ ఎన్, ఫార్మాకోవిజిలెన్స్ ఆఫీసర్, ఆయుష్ మంత్రిత్వశాఖ, తో కూడా మాట్లాడారు. ఆయన కూడా “ఇది తప్పు వార్త. కాకరకాయ కరోనావైరస్ కు చికిత్స కాదు” అని చెప్తూ ఈ క్లెయిమ్ ను తోసిపుచ్చారు.
ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వారు కూడా ట్విట్టర్ లో ఒక స్టేట్మెంట్ ను జారీ చేసి కాకరకాయ రసం కరోనావైరస్ కు చికిత్స కాదు అని, ఇది ఒక నకిలీ క్లెయిమ్ అని పేర్కొన్నారు.
Cసెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం, ప్రస్తుతము 2019-nCoV ఇన్ఫెక్షన్ ను నివారించుటకు ఎలాంటి వ్యాక్సిన్ లేదు. అయినప్పటికీ, శ్వాసకోశ వైరస్ ల వ్యాప్తిని నివారించుటకు సహాయపడే నివారణాత్మక చర్యలు తీసుకోవచ్చు.
निष्कर्ष: ముగింపు: కాకరకాయ రసం నోవెల్ కరోనావైరస్ ను 2 గంటలలో తగ్గిస్తుంది అనేది నకిలీ క్లెయిమ్. బీహార్ ఆరోగ్య విభాగము ఇలాంటి స్టేట్మెంట్ ను జారీ చేయలేదు.
- Claim Review : క్లెయిమ్ సమీక్ష: బీహార్ ఆరోగ్య విభాగము ప్రకారం కాకరకాయ రసం నోవెల్ కరోనావైరస్ ను తగ్గిస్తుంది.
- Claimed By : Md Shahid
- Fact Check : False
Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.