రోగ నిరోధకశక్తిపై ఎయిమ్స్ డాక్టర్ ఉమా కుమార్ ఇంటర్వ్యూ ఇచ్చారా ?వైరల్ అవుతున్న పోస్ట్ నిజమేనా ?
ముగింపు : విశ్వాస్ న్యూస్ దర్యాప్తులో, డాక్టర్ ఉమా కుమార్ పేరిట వైరల్ అవుతున్న ఇంటర్వ్యూ నకిలీదని తేలింది. ఆమె అలాంటి ఇంటర్వ్యూ ఇవ్వలేదు.
- By: Ashish Maharishi
- Published: Jun 9, 2020 at 04:28 PM
- Updated: Jun 9, 2020 at 04:32 PM
ఎయిమ్స్ ఆసుపత్రి సీనియర్ డాక్టర్ ఉమా కుమార్ రోగ నిరోధకశక్తికి సంబంధించి ఓ ఇంటర్వ్యూ ఇచ్చారన్న వార్త సోషల్ మీడియాలో విరివిగా షేర్ చేస్తున్నారు. ఫేస్బుక్ నుండి మొదలుకొని వాట్సాప్ వరకు ఈ నకిలీ ఇంటర్వ్యూకు సంబంధించిన వార్త వైరల్ అవుతోంది. కరోనా వైరస్ గురించి డాక్టర్ ఇంటర్వ్యూ ఇచ్చారని వైరల్ అవుతున్న పోస్టుల్లో పేర్కొంటున్నారు.
విశ్వాస్ న్యూస్ ఈ ఇంటర్వ్యూ గురించి దర్యాప్తు చేసింది. ఈ దర్యాప్తులో ఇంటర్వ్యూ నకిలీదని తేలింది. డాక్టర్ ఉమా కుమార్ అలాంటి ఇంటర్వ్యూ ఇవ్వలేదు.
వైరల్ అవుతున్నది ఏంటి ?
Ujjawal Institute అనే ప్రొఫైల్ పేరుతో ఉన్న ఫేస్బుక్ పేజీలో జూన్ 1వ తేదీన ఒక నకిలీ ఇంటర్వ్యూను అప్లోడ్ చేశారు. సీనియర్ ఎయిమ్స్ వైద్యురాలు ఉమా కుమార్‌ను ఉటంకిస్తూ ఇచ్చిన ఇంటర్వ్యూలో, కరోనా వైరస్‌కు మందు శరీరంలోనే ఉందని పేర్కొన్నారు.
ఈ నకిలీ ఇంటర్వ్యూ వాట్సాప్‌లో కూడా వైరల్ అవుతోంది.
దర్యాప్తు :
వైరల్ ఇంటర్వ్యూలో ప్రస్తావించిన డాక్టర్ ఉమా కుమార్ గురించి విశ్వాస్ న్యూస్ తొలుత వివరాలు సేకరించాలనుకుంది. మొదటగా గూగుల్ సెర్చ్‌లో డాక్టర్ ఉమా కుమార్ అని టైప్ చేసి శోధించడం జరిగింది. ఆ అన్వేషణలో డాక్టర్ ఉమా కుమార్ ఎయిమ్స్‌లో రూమటాలజీ విభాగానికి అధిపతి (HOD) అని తెలిసింది.
దర్యాప్తు తొలిదశలో డాక్టర్ ఉమా కుమార్ ఎయిమ్స్‌లో సీనియర్ వైద్యురాలన్న విషయం తేలింది. ఆ తరువాత, కరోనా వైరస్ గురించి డాక్టర్ ఉమా నిజంగానే ఏదైనా ఇంటర్వ్యూ ఇచ్చారా లేదా అని తెలుసుకోవలసి వచ్చింది. డాక్టర్ ఉమా ఈ ఇంటర్వ్యూ ఇచ్చారని నిరూపించడానికి గూగుల్ సెర్చ్‌లో ఎలాంటి వార్తలు లేదా లింకులు కనిపించలేదు.
దర్యాప్తులో భాగంగా, డాక్టర్ ఉమా కుమార్ సోషల్ మీడియా అకౌంట్లను విశ్వాస్ న్యూస్ పరిశీలించింది. అలా వెతుకుతున్న క్రమంలో డాక్టర్ ఉమా కుమార్ ఫేస్బుక్ అకౌంట్లో ఒక పోస్ట్ కనిపించింది. మే 31వ తేదీన డాక్టర్ ఉమా కుమార్ తన ఫేస్బుక్ వాల్‌పై ఒక పోస్ట్ షేర్ చేశారు. కొంతమంది తన ఫోటోలు, వృత్తిపరమైన సమాచారాన్ని ఉపయోగించి సోషల్ మీడియాలో కొన్ని అంశాలను వైరల్ చేస్తున్నారని ఆ పోస్ట్‌లో రాశారు. ఆమె తన ఫేస్బుక్ వాల్‌పై చేసిన పూర్తి పోస్ట్ క్రింద చూడవచ్చు.
దర్యాప్తు తదుపరి దశలో, విశ్వాస్ న్యూస్ డాక్టర్ ఉమా కుమార్‌ను సంప్రదించడం జరిగింది. ఈ ప్రత్యేక సందర్భంలో తాను అలాంటి ఇంటర్వ్యూ ఎవరికీ ఇవ్వలేదని డాక్టర్ ఉమాకుమార్ బదులిచ్చారు.
చివరగా, ఈ నకిలీ పోస్టు చేసిన Ujjawal Institute ఫేస్బుక్ పేజీని తనిఖీ చేయడం జరిగింది. 140 మంది మాత్రమే ఈ ప్రొఫైల్‌తో ఉన్న ఫేస్బుక్ అకౌంట్‌ను అనుసరిస్తున్నారని సోషల్ స్కానింగ్ ద్వారా తెలుసుకోవడం జరిగింది. ఈ ఫేస్బుక్ పేజీ 2016, ఫిబ్రవరి 9వ తేదీన క్రియేట్ చేశారు.
निष्कर्ष: ముగింపు : విశ్వాస్ న్యూస్ దర్యాప్తులో, డాక్టర్ ఉమా కుమార్ పేరిట వైరల్ అవుతున్న ఇంటర్వ్యూ నకిలీదని తేలింది. ఆమె అలాంటి ఇంటర్వ్యూ ఇవ్వలేదు.
- Claim Review : దావా సమీక్ష : కరోనా గురించి డాక్టర్ ఉమా ఈ ఇంటర్వ్యూ ఇచ్చినట్లు ప్రచారం చేస్తున్నారు.
- Claimed By : Ujjawal Institute
- Fact Check : False
Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.