విశ్వాస్ న్యూస్ తన వాట్సాప్ చాట్‌బాట్‌లో కూడా ఈ పోస్ట్‌ను అందుకుంది, అది భారతదేశంలోని అస్సాంలో జరిగిన వీడియో అని యూజర్ పేర్కొన్నారు.
హైదరాబాద్ (విశ్వాస్ న్యూస్) : ఒక మహిళ తలపై సుత్తితో దారుణంగా కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులోని దావా ప్రకారం, ఇది భారతదేశంలో జరిగిందని ఆరోపిస్తున్నారు. విశ్వాస్ న్యూస్ ఈ పోస్ట్‌ను పరిశోధించినప్పుడు, ఆ వీడియో బ్రెజిల్‌కు చెందినదని, కానీ భారతదేశంలో జరిగినట్లు వైరల్ అవుతోందని మేము కనుగొన్నాము.
విశ్వాస్ న్యూస్ తన వాట్సాప్ చాట్‌బాట్‌లో కూడా ఈ పోస్ట్‌ను అందుకుంది, అది భారతదేశంలోని అస్సాంలో జరిగిన వీడియో అని యూజర్ పేర్కొన్నారు.
దావా :
ఒక మహిళ ఘోరంగా హత్య చేయబడిన భయంకరమైన వీడియో భారతదేశంలో జరిగిందన్న వాదనతో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 31 సెకన్ల నిడివి ఉన్న ఈ క్లిప్‌లో, ఒక మహిళ తలపై ముసుగు ధరించిన ఒక దుండగుడు కొడుతున్నాడు. స్త్రీ చేతులు కట్టివేశారు, ఆమె నోటితో గగ్గోలు పెడుతోంది. మా వాట్సాప్ చాట్‌బాట్‌లో కూడా ఈ వీడియోను అందుకున్నాము, ఆ యూజర్ భారతదేశంలోని అస్సాంలో ఇది జరిగిందని పేర్కొన్నారు.
విశ్వాస్ న్యూస్ ఈ వీడియోను ఉన్నది ఉన్నట్లు చూపించకూడదని నిర్ణయించింది. వీడియోకు సంబంధించిన స్క్కీన్ షాట్స్‌ను బ్లర్ చేసింది. ఎందుకంటే ఆ వీడియో కలత పెట్టేదిగా ఉంది.
పోస్ట్ యొక్క ఆర్కైవ్ వెర్షన్‌ను ఇక్కడ క్లిక్ చేసి చూడవచ్చు.
దర్యాప్తు :
విశ్వాస్ న్యూస్ ఈ వీడియోను జాగ్రత్తగా విశ్లేషించింది, మరియు మహిళ ధరంచిన టాప్‌పైన లోగోను గుర్తించింది. ‘ఫోర్ట్-‘ అనే అక్షరాలు పాక్షికంగా కనిపించిన ఆ లోగో నిజానికి ఫోర్టలేజా ఫుట్‌బాల్ క్లబ్‌కు సంబంధించిన లోగో. ఆ మహిళ బ్రెజిలియన్ ఫుట్‌బాల్ క్లబ్, ఫోర్టలేజా ఫుట్‌బాల్ క్లబ్ జెర్సీని ధరించింది.
వైరల్ వీడియోలో కనిపిస్తున్న లోగో:
బ్రెజిలియన్ ఫుట్‌బాల్ క్లబ్, ఫోర్టలేజా ఫుట్‌బాల్ క్లబ్ యొక్క లోగో
మేము ఒక కీవర్డ్‌తో శోధించడం జరిగింది. అదే జెర్సీలో నేలమీద పడుకున్న ఒక మహిళ ఫోటో చూపిస్తున్న ఒక బ్లాగును కనుగొన్నాము, ఆమె థాలియా టోర్రెస్ డి సౌజా అనే 23 ఏళ్ల మహిళగా గుర్తించబడింది.
https://archive.is/ALID1
మేము గూగుల్‌లో థాలియా టోర్రెస్ డి సౌజా పేరుతో వార్తా కథనాల గురించి శోధించినప్పుడు, సెప్టెంబర్ 1, 2020 నాటి ఒక కథనాన్ని మేము కనుగొన్నాము. ఆ వార్తా కథనం ప్రకారం, బ్రెజిల్‌లోని సియర్‌లో జరిగిన అత్యంత క్రూరమైన నేరాలలో ఇది ఒకటి, బాధితురాలు 23 ఏళ్ల అమ్మాయి, ఆమె థాలియా టోర్రెస్ డి సౌజాగా గుర్తించబడింది, ఆమెను బోమ్ జార్డిమ్ పరిసరాల్లోని ఒక క్రిమినల్ వర్గానికి చెందిన సభ్యులు కిడ్నాప్ చేసి, పొరుగున ఉన్న గ్రాంజా పోర్చుగల్‌కు తీసుకువెళ్లారు.
ఆ కథనం ప్రకారం, ‘థెలియాను తాడులతో కట్టి, బలవంతంగా, తుపాకీ గురిపెట్టి, మరంగుపిన్హో నది అంచులకు తీసుకెళ్లి, రువా కరోనెల్ ఫాబ్రిసియానోకు దగ్గర క్రూరంగా హత్య చేశారు. ఈ దారుణ హత్యను నేరస్థులు చిత్రీకరించారు. ఆ మహిళను తలపై గొడ్డలితో మరియు రాళ్ళతో కొట్టినప్పుడు, రక్షించుకునేందుకు అవకాశం లేదు. ఆమె తల పగులగొట్టి, చేతులు కట్టేసిన స్థితిలో మృతదేహం కొన్ని గంటల తరువాత కనుగొనబడింది. అప్పటి వరకు గుర్తించబడని అమ్మాయి.. నీలిరంగు డెనిమ్ షాట్ మరియు తన అభిమాన జట్టు అయిన ఫోర్టాలెజా ఎస్పోర్ట్ క్లూబ్ యొక్క చొక్కాను ధరించింది.’
ఆ కథనంలో పేర్కొన్న బట్టలు వైరల్ వీడియోలో మహిళతో సరిపోలాయి.
Feminicidio – Parem de nos matar అనే పేజీలో మేము ఒక ఫోటోను కనుగొన్నాము. సెప్టెంబరు 1, 2020న ఆమె హత్య కేసు గురించి స్త్రీ హత్యలకు సంబంధించిన పోస్ట్‌లు చేయబడ్డాయి.
ఈ వీడియో భారతదేశంలోని అస్సాంలో జరిగిందని పేర్కొంటూ వైరల్ కావడంతో అస్సాంలోని గువహతి అడ్మిన్ డీసీపీ హేమంత క్రి.దాస్‌ను విశ్వాస్ న్యూస్ సంప్రదించడం జరిగింది. “అస్సాంలోని ఏ ప్రాంతంలోనూ ఇలాంటి సంఘటనలు కనుగొనబడలేదు.” అని హేమంత చెప్పారు.
ఈ వీడియోను Jaggu दादा అనే యూజర్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. మేము ఆ యూజర్ యొక్క ప్రొఫైల్‌ను స్కాన్ చేసినప్పుడు, అతనికి 1202 మంది ఫాలోవర్లు ఉన్నారని మేము కనుగొన్నాము.
निष्कर्ष: విశ్వాస్ న్యూస్ తన వాట్సాప్ చాట్‌బాట్‌లో కూడా ఈ పోస్ట్‌ను అందుకుంది, అది భారతదేశంలోని అస్సాంలో జరిగిన వీడియో అని యూజర్ పేర్కొన్నారు.
Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923