విశ్వాస్ న్యూస్ యొక్క దర్యాప్తులో వైరల్ పోస్ట్ నకిలీది అని తేలింది. రాయ్పూర్, పూణెకు సంబంధించిన వాక్యాన్ని ఉపయోగించి ఈ వైరల్ స్క్రీన్ షాట్ తయారు చేశారు.
విశ్వాస్ న్యూస్ (కొత్త ఢిల్లీ): దేశములో కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తున్న ఈ సమయములో సోషల్ మీడియాలో కొంతమంది అవాస్తవాలను ప్రచారం చేసి పరిస్థితిని మరింత క్షీణింపజేసే ప్రయత్నం చేస్తున్నారు. సోషల్ మీడియా యూజర్స్ ఒక వార్తా ఛానల్ యొక్క నకిలీ స్క్రీన్ షాట్ ను వైరల్ చేస్తున్నారు. దీని ద్వారా దేశములో మళ్ళీ ఒకసారి లాక్డౌన్ విధించబడుతుంది అని నమ్మబలుకుతున్నారు. మేము చేసిన విచారణలో ఈ వైరల్ పోస్ట్ నకిలీది అని తేలింది.
విశ్వాస్ న్యూస్ వైరల్ పోస్ట్ గురించి విచారణ చేసినప్పుడు, వేరువేరు వార్తాంశాలతోపాటు కొన్ని నకిలీ వార్తలు మరియు వేరే కార్యక్రమాల ఫోటోలు కలిపి ఒక వార్తా ఛానల్ ఒక స్క్రీన్ షాట్ ను తయారు చేసింది అని తెలిసింది. ఇదే నిజము అనుకొని యూజర్స్ దీనిని వైరల్ చేస్తున్నారు.
ఏది వైరల్ అవుతోంది
ఆహిర్ ఛోరా అనే ఫేస్బుక్ యూజర్ ‘గయా బైపాస్’ పేరుతో ఒక ఫేస్బుక్ గ్రూప్ లో ఒక నకిలీ పోస్ట్ ను అప్లోడ్ చేశారు. ఇందులో ఏప్రిల్ 9 నుండి ఏప్రిల్ 19 లాక్డౌన్ విధించబడుతుంది అని పేర్కొనబడింది. ఇదే కాకుండా ఇందులో అమిత్ షా గారి పాత ఫోటో కూడా ఉపయోగించారు.
ఫేస్బుక్ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వర్షన్ ఇక్కడ చూడవచ్చు.
దర్యాప్తు
విశ్వాస్ న్యూస్ వైరల్ పోస్ట్ యొక్క కంటెంట్ ను నాలుగు భాగాలుగా విభజించి విచారణ ప్రారంభించింది. ముందుగా మేము వైరల్ స్క్రీన్ షాట్ పైన వ్రాసి ఉన్న ‘9 ఏప్రిల్ నుండి 19 ఏప్రిల్ వరకు లాక్డౌన్ విధించబడుతుంది’ అనే వాక్యాన్ని టీవీ9 యొక్క యూట్యూబ్ ఛానల్ పై ఉన్న వార్తలలో శోధించడం ప్రారంభించాము. ఏప్రిల్ 8 నాటి ఒక వార్త మాకు లభించింది. ఈ వార్త రాయ్పూర్ లో లాక్డౌన్ కు సంబంధించినది. వీడియోలోని 12వ క్షణములో మాకు వైరల్ స్క్రీన్ షాట్ పై వ్రాయబడి ఉన్న ఈ వాక్యము లభించింది. ఈ వాక్యము నుండి రాయ్పూర్ అనే పదాన్ని తొలగించారు. పూర్తి వార్త కొరకు ఇక్కడ క్లిక్ చేసి చూడండి.
ఇప్పుడు మేము రెండవ వాక్యానికి సంబంధించిన నిజాన్ని తెలుసుకోవలసి ఉంది. ‘రేపటి నుండి ఒక వారముపాటు లాక్డౌన్ విధించబడుతుంది’ అనే ఈ వాక్యాన్ని మేము టైప్ చేసి యూట్యూబ్ వైపుకు తిరిగాము. దాని వెంట కీవర్డ్ లో టీవీ9 అని కూడా వ్రాసి శోధించాము. మాకు ఏప్రిల్ 2 నాటి ఒక వార్త లభించింది. దీనిలోని 27వ క్షణములో మాకు వైరల్ స్క్రీన్ షాట్ లో అమిత్ షా గారి ఫోటో వెంట ఉపయోగించబడిన అదే వాక్యము లభించింది. ఈ వార్త పూణెలో లాక్డౌన్ కు సంబంధించినది. పూర్తి సమాచారము మీకు ఇక్కడ లభిస్తుంది.
ఇప్పుడు వైరల్ స్క్రీన్ షాట్ లో ఉపయోగించబడిన అమిత్ షా గారి ఫోటో ఎక్కడిది అనేది తెలుసుకోవలసి ఉంది. సెర్చ్ చేసిన తరువాత జూన్ 14, 2020 నాటి ఒక వార్తలో ఈ ఫోటో లభించింది. ఈ ఫోటో ఢిల్లీలో కరోనాను సమస్యా పరిష్కారానికి తీసుకోవలసిన చర్యల కొరకు కేంద్ర హోం మంత్రి సమావేశములో లభించింది. పూర్తి సమాచారము ఇక్కడ చదవండి.
విశ్వాస్ న్యూస్ చేసిన దర్యాప్తు ద్వారా వైరల్ స్క్రీన్ షాట్ కింది భాగములో వ్రాయబడిన ‘అత్యవసర సమావేశములో స్కూళ్ళు-కాలేజీ పరీక్షలు నిలిపివేయాలని నిర్ణయించబడింది’ అనే వాక్యములో వాస్తవాన్ని తెలుసుకొనుటకు గూగుల్ సెర్చ్ ఉపయోగించాము. మాకు ఈ విషయాన్ని నిర్ధారణ చేసే వార్త ఏదీ లభించలేదు. స్కూళ్ళకు సంబంధించి రాష్ట్రాలు తామే నిర్ణయం తీసుకున్నాయి.
దర్యాప్తును ముందుకు కొనసాగిస్తూ విశ్వాస్ న్యూస్ వారు టీవీ9 యొక్క సీనియర్ ఎడిటర్ ను సంప్రదించారు. వైరల్ స్క్రీన్ షాట్ తన వద్దకు కూడా వచ్చిందని ఆయన చెప్పారు. ఇది అవాస్తవమైనది.
విచారణ యొక్క చివరి దశలో మాకు నకిలీ పోస్ట్ చేసిన యూజర్ గురించి విచారణ చేశాము. అప్పుడు మాకు ఫేస్బుక్ యూజర్ ఆహిర్ ఛోరా తన అకౌంట్ ను లాక్ చేశాడు అని తెలిసింది. అందువలన మాకు ఎక్కువ సమాచారము లభించలేదు.
निष्कर्ष: విశ్వాస్ న్యూస్ యొక్క దర్యాప్తులో వైరల్ పోస్ట్ నకిలీది అని తేలింది. రాయ్పూర్, పూణెకు సంబంధించిన వాక్యాన్ని ఉపయోగించి ఈ వైరల్ స్క్రీన్ షాట్ తయారు చేశారు.
Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923