వాస్తవ తనిఖీ: వైరల్ పోస్ట్ లో ఉన్న యువతి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధి కాదు, ఆమె హాలీవుడ్ నటీమణి రీస్ విథర్స్పూన్
- By: Ankita Deshkar
- Published: Dec 17, 2022 at 04:03 PM
కొత్త ఢిల్లీ (విశ్వాస్ న్యూస్): ఫేస్బుక్ పై విసృతంగా షేర్ చేయబడిన ఒక పోస్ట్ ను విశ్వాస్ న్యూస్ చూసింది. ఈ పోస్ట్ లో రెండు చిత్రాలు ఉన్నాయి, ఒక చిత్రము భారతీయ రాజకీయనాయకురాలు మరియు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధికి చెందినది. మరొకటి సోనియా గాంధి చిన్నప్పటి చిత్రము అని క్లెయిమ్ చేయబడుతోంది. విశ్వాస్ న్యూస్ వాస్తవ తనిఖీ నిర్వహించింది మరియు ఆ మరొక చిత్రము అమెరికా నటీమణి రీస్ విథర్స్పూన్ కు చెందినది అని కనుగొనింది.
క్లెయిమ్:
ఫేస్బుక్ యూజర్, భారత్ పూసె ఫేస్బుక్ గ్రూప్ एक कोटी भाजपा समर्थक లో ఒక పోస్ట్ ను షేర్ చేశారు.
ఆ చిత్రములో ఇలా వ్రాసి ఉంది: जब वो 15 साल CM और 7 साल PM रहने के बावजूद तुम्हारे लिए चायवाला है,
పోస్ట్ ను మరియు దాని ఆర్కైవ్డ్ వర్షన్ ను ఇక్కడ చూడండి.
దర్యాప్తు:
విశ్వాస్ న్యూస్ కుడిచేతివైపు ఉన్న చిత్రాన్ని క్రాప్ చేయడము ద్వారా తన దర్యాప్తును ప్రారంభించింది. ఆ తరువాత మేము ఈ చిత్రాన్ని గూగుల్ లెన్స్ ఉపయోగించి సెర్చ్ చేశాము.
యువ రీస్ విథర్స్పూన్ యొక్క 30 చిత్రాలు అనే ఒక వ్యాసానికి విశ్వాస్ న్యూస్ మళ్ళించబడింది.
ఈ వ్యాసములో ఇలా పేర్కొనబడింది: “ఈ గ్యాలరీలో అందమైన, యువ, రీస్ విథర్స్పూన్ చిత్రాలు ఉన్నాయి”, ఇందులో ఆమె చిన్నప్పటి, అలాగే, యుక్తవయసులో ఉన్నప్పటి చిత్రాలు మరియు 1990ల మధ్యలో ఆమె 20ల ప్రారంభములోని చిత్రాలు ఉన్నాయి.
వ్యాసములో 8వ సంఖ్యలో మాకు ఈ వైరల్ చిత్రము లభించింది.
అలాగే రీలివ్ రీస్ విథర్స్పూన్ యొక్క హాలీవుడ్ లోని గత 25 సంవత్సరాలు అనే ఒక వ్యాసము లో మాకు ఈ చిత్రము లభించింది.
.స్టాక్ చిత్రాల వెబ్సైట్ alamy.com పై కూడా మాకు వైరల్ చిత్రము కనిపించింది. దీని వెంబడి ఉన్న క్యాప్షన్, ఇది ఫియర్ ఇన్ 1996 నుండి రీస్ విథర్స్పూన్ యొక్క చిత్రము అని పేర్కొనింది.
అందుచేత ఇది అమెరికన్ నటీమణి రీస్ విథర్స్పూన్ యొక్క చిత్రము అని స్పష్టం అవుతోంది.
మేము కాంగ్రెస్ నేత సోనియా గాంధి యొక్క పాత చిత్రాల కొరకు చూశాము. rediff.com పై ఒక వ్యాసములో యుక్తవయసులో ఉన్న సోనియా గాంధి చిత్రము మాకు లభించింది.
NDTV పై ఒక వ్యాసములో కూడా మాకు కొన్ని చిత్రాలు లభించాయి.
దర్యాప్తు యొక్క మరొక దశలో మేము కాంగ్రెస్ విలేఖరి, రజని పాటిల్ తో మాట్లాడాము. ఈ వైరల్ చిత్రము కాంగ్రెస్ నేత సోనియా గాంధిది కాదని ఆమె మాకు చెప్పారు. ఆమె ట్రోల్స్ గురించి మరియు ఇటువంటి వార్తలను వ్యాప్తి చేసే ప్రజల నెగెటివ్ ఆలోచనల గురించి మాకు చెప్పారు. 1990ల నుండి సోనియా గాంధి రాజకీయాలలో చురుగ్గా పాల్గొన్నారని మరియు వైరల్ పోస్ట్ లో చూపిన విధంగా ఆమె ఎప్పుడు వ్యాకులత చెందలేదని ఆమె చెప్పార్.
దర్యాప్తు యొక్క చివరి దశలో మేము ఫేస్బుక్ యూజర్ యొక్క నేపథ్య తనిఖీ నిర్వహించాము. భూషన్ పూసె ఔరంగాబాద్ నివాసి మరియు ఆయనకు 2,071 మంది ఫాలోయర్స్ ఉన్నారు.
ముగింపు: వైరల్ పోస్ట్ ఉన్న యువతి కాంగ్రెస్ నేత సోనియా గాంధి ఆదు, ఆమె హాలీవుడ్ నటీమణి రీస్ విథర్స్పూన్. వైరల్ పోస్ట్ తప్పుదోవపట్టించేది.
- Claim Review : భూషణ్ పూసె
- Claimed By : సోనియా గాంధి యొక్క చిత్రము
- Fact Check : False
Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.