కొత్త ఢిల్లీ (విశ్వాస్ న్యూస్) – దేశవ్యాప్తంగా యునిఫార్మ్ సివిల్ కోడ్ గురించి చర్చ జరుగుతున్న నేపథ్యములో, కొంతమంది సోషల్ మీడియా యూజర్లు ఒక ఫోన్ నంబరును షేర్ చేస్తున్నారు, ఆ నంబరుకు ఒక మిస్ కాల్ ఇవ్వడము ద్వారా మీరు యూనిఫార్మ్ సివిల్ కోడ్ కు మీ మద్ధతును రిజిస్టర్ చేయవచ్చు అని క్లెయిమ్ చేయబడింది.
‘9090902024’ ఫోన్ నంబరు రాబోయే 2024 లోక్ సభ ఎన్నికల కొరకు బిజేపి ప్రచారానికి అనుసంధానించబడింది అని కనుగొనింది. మోడి ప్రభుత్వము తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు తమ మద్ధతును తెలుపుటకు యూజర్స్ ఆ నంబరుకు ఒక మిస్ కాల్ ఇవ్వవచ్చు అనే వైరల్ క్లెయిమ్ గురించి విశ్వాస్ న్యూస్ వాస్తవ-తనిఖీ చేసి ఈ నంబరుకు యూనిఫార్మ్ సివిల్ కోడ్ కు ఎలాంటి సంబంధం లేదని దర్యాప్తులో తేల్చింది.
ఫేస్బుక్ యూజర్ ‘యోగి సపోర్టర్స్ గ్రూప్’ జూన్ 27, 2023 నాడు వైరల్ పోస్ట్ షేర్ చేసి, ఇలా వ్రాసింది, అసలు పోస్ట్ హిందీలో ఉంది, “హిందూ సోదర సోదరీమణులారా, మీరు యూనిఫార్మ్ సివిల్ కోడ్ (యూసిసి) సపోర్ట్ ఫార్మ్ ను ఆన్లైన్ లో మీరు పూర్తి చేయలేకపోతే, ఈ నంబరు 9090902024 పై ఒక మిస్ కాల్ ఇవ్వండి మరియు మీ ఐకమత్యాన్ని చూపండి.”
పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వర్షన్ ను ఇక్కడ చూడండి.
ఈ క్లెయిమ్ ను పరీక్షించుటకు, మేము సంబంధిత కీవర్డ్స్ ఉపయోగించి గూగుల్ పై సెర్చ్ చేశాము. యూనిఫార్మ్ సివిల్ కోడ్ గురించి వైరల్ క్లెయిమ్ కు మద్ధతుగా ఎలాంటి వార్తా నివేదికలు మాకు లభించలేదు.
అయితే, మాకు లా కమిషన్ ఆఫ్ ఇండియా వారు జారీ చేసిన, జూన్ 14, 2023 తేదీ నాటి ఒక నోటీసు లభించింది. ఈ నోటీసు యూనిఫార్మ్ సివిల్ కోడ్ కు సంబంధించి సాధారణ ప్రజానీకము, రాజకీయ పార్టీలు మరియు ఇతరుల వ్యాఖ్యలను కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు memberecretary-lci@gov.in వద్ద లా కమిషన్ ఆఫ్ ఇండియాకు ఒక ఈమెయిల్ లో యూసిసి గురించి తమ అభిప్రాయాలను వ్రాయాలని ఈ నోటీసు కోరింది. ఈ నోటీసులో వైరల్ నంబరు కాని లేదా యూసిసికు మద్ధతును తెలుపుటకు మార్గముగా ఒక నిర్దిష్ట నంబరుకు మిస్ కాల్ ఇవ్వడాన్ని పేర్కొనలేదు.
మా తదుపరి దర్యాప్తు దశలో, మేము ఆ వైరల్ నంబరుకు కాల్ చేయాలని నిర్ణయించుకున్నాము. ఒకే ఒక రింగ్ తరువాత కాల్ డిస్కనెక్ట్ అయ్యింది. చివరిగా, మేము మూలము హిందీలో ఉన్న ఒక మెసేజ్ మాకు అందింది, “సేవ, మంచి పరిపాలన, మరియు పేదల సంక్షేమము పట్ల మోడీ ప్రభుత్వము యొక్క నిబద్ధతకు మద్ధతును ఇచ్చినందుకు ధన్యవాదములు. 9 సంవత్సరాల మోడి ప్రభుత్వం యొక్క విజయాలను తెలుసుకొనుటకు 9yearsofseva.bjp.org పై క్లిక్ చేయండి. బిజేపి”
ఈ మెసేజ్ మమ్మల్ని అధికారిక బిజేపి ట్విట్టర్ హ్యాండిల్ పై జూన్ 29, 2023 నాడు పోస్ట్ చేసిన ఒక పోస్ట్ కు తీసుకెళ్ళింది. ‘జన్ సంపర్క్ సే జన్ సమర్థన్’ ప్రచారాన్ని చేరమని ఈ ట్వీట్ 9090902024 నంబరు పై ఒక మిస్ కాల్ ఇవ్వాలని ప్రజలను కోరింది.
అంతేకాకుండా, జూన్ 30 తేదీ నాటి NDTV యొక్క వార్తా పోర్టల్ పై ఒక ఆర్టికల్ మాకు లభించింది. ఇది బిజేపి ఈ నంబరును తమ తొమ్మిది సంవత్సరాల అధికారానికి గుర్తుగా బిజేపి తమ అతిపెద్ద మాస్-కనెక్ట్ కార్యక్రమములో భాగంగా ప్రారంభించింది అని ధృవీకరించింది.
మరిన్ని వివరాల కోసం, మేము బిజేపి విలేఖరి విజయ్ సోంకర్ శాస్త్రిని కలిశాము, ఈయన వైరల్ నంబరు బిజేపికి మద్ధతు కొరకు ప్రారంభించబడింది అని ధృవీకరించారు.
చివరిగా, మేము నకిలీ పోస్ట్ ను షేర్ చేసిన ఫేస్బుక్ గ్రూప్ ‘యోగి సపోర్టర్స్ గ్రూప్’ యొక్క ప్రొఫైల్ ను స్కాన్ చేశాము. ఈ గ్రూప్ కు సుమారు 8000 ఫాలోయర్స్ ఉన్నారని మేము గమనించాము.
ముగింపు: వాస్తవ-తనిఖీ నిర్వహించిన తరువాత, విశ్వాస్ న్యూస్ ఒక బిజేపి ప్రచారముతో జతపడిన ‘9090902024’ నంబరు మోడి ప్రభుత్వము యొక్క తొమ్మిది సంవత్సరాల అధికారానికి మద్ధతును సేకరించుటకు ప్రారంభీంచబడింది అని కనుగొనింది. వైరల్ పోస్ట్ లో క్లెయిమ్ చేయబడినట్లుగా దీనికి యూనిఫార్మ్ సివిల్ కోడ్ కు ఎలాంటి సంబంధం లేదు.
Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923