కొత్త ఢిల్లీ విశ్వాస్ న్యూస్ – కాంగ్రెస్ నేత ఉదిత్ రాజ్ ను చూపిస్తూ తప్పుగా క్లెయిమ్ చేయబడే ఒక వీడియో ఆన్లైన్ లో చక్కర్లుకొడుతోంది. ఒక ఫుట్బాల్ తన్నుతూ కింద పడ్డాడు అని తప్పుగా క్లెయిమ్ చేస్తూ కొంతమంది సోషల్ మీడియా యూజర్స్ ఉదిత్ రాజ్ ను ఆటపట్టించటానికి ఈ వీడియోను ఉపయోగిస్తున్నారు. నిజానికి ఈ వీడియో యూట్యూబ్ పై అయిదు సంవత్సరాల క్రితమే ఉంది, మరియు ఈ అసలు వీడియోలో త్రిపుర ఎంఎల్ఏ గోపాల్ చంద్ర రాయ్ ఫుట్బాల్ తన్నుతూ కిందపడిన దృశ్యాన్ని చూపింది.
“మ్యాచ్ ను ప్రారంభిస్తున్న గౌరవనీయులు డా గారు శ్రీ ఉదిత్ రాజ్ భాయ్” అని క్లెయిమ్ చేస్తూ ఫేస్బుక్ యూజర్ ఓమ్ దత్ జులై 9 నాడు ఒక వీడియోను పోస్ట్ చేశాడు.
పోస్ట్ లోని క్లెయిమ్ ను విశ్వస్తిస్తూ, ఇతర యూజర్లు కూడా దీనిని వైరల్ చేశారు.
పోస్ట్ లోని విషయాలు ఇక్కడ యథాతథంగా వ్రాయబడ్డాయి. దీని ఆర్కైవ్డ్ వర్షన్ ను ఇక్కడ చూడవచ్చు.
విశ్వాస్ న్యూస్ ముందుగా ఇన్విడ్ టూల్ ఉపయోగించి వైరల్ వీడియో యొక్క చాలా కీఫ్రేమ్స్ ను సంగ్రహించింది. దీని తరువాత, ఈ కీఫ్రేమ్స్ గూగుల్ రివర్స్ సెర్చ్ ఇమేజ్ టూల్ కు అప్లోడ్ చేయబడ్డాయి. అసలైన వీడియో ది కరెస్పాండెంట్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ పై అయిదు సంవత్సరాల క్రితమే అప్లోడ్ చేయబడింది. అది ఆగస్ట్ 11, 2017 నాడు అప్లోడ్ చేయబడింది. ఈ వీడియోలో, ఎంఎల్ఏ గోపాల్ చంద్ర రాయ్ ఒక టోర్నమెంట్ ప్రారంభించేటప్పుడు ఫుట్బాల్ ను తన్నుతూ జారిపడ్డాడు అని చెప్పబడింది.
సెర్చ్ సమయములో, ఇదే వీడియో ఎస్టివి త్రిపుర అనే ఒక యూట్యూబ్ ఛానల్ పై కూడా కనిపించింది. ఇది ఆగస్ట్ 9, 2017 నాడు ఎంఎల్ఏ గోపాల్ చంద్ర రాయ్ అగర్తలా లోని ఒక పొలములో పడ్డారు అనే వివరణతో పోస్ట్ చేయబడింది.
ఈ వీడియోను ఆగస్ట్ 13, 2017 నాడు ఎంఎల్ఏ గోపాల్ చంద్ర రాయ్ ఒక ఫుట్బాల్ తన్నుతూ గాయపడ్డారు అని పేర్కొంటూ మరొక యూట్యూబ్ ఛానల్ పై అప్లోడ్ చేయబడింది. వైరల్ వీడియో మరియు ఈ యూట్యూబ్ ఛానల్ పై అప్లోడ్ చేయబడిన వీడియో గోపాల్ చంద్ర రాయ్ కు చెందినవే అని స్పష్టం అయ్యింది.
తదుపరి విశ్వాస్ న్యూస్ కాంగ్రెస్ నేత ఉదిత్ రాజ్ ను సంప్రదించింది. వైరల్ వీడియో తనది కాదని మరియు తన పెరుప్రతిష్ఠలు పాడుచేసే లక్ష్యముతో వైరల్ పోస్ట్ షేర్ చేయబడింది అని ఆయన తరఫున చెప్పబడింది.
ముగింపు: విశ్వాస్ న్యూస్ దర్యాప్తు చేసి వైరల్ పోస్ట్ నకిలీది అని కనుగొనింది. కాంగ్రెస్ నేత ఉదిత్ రాజ్ పేరున వైరల్ చేయబడిన వీడియో ఆయనది కాదు, కాని త్రిపుర ఎంఎల్ఏ గోపాల్ చంద్ర రాయ్ కు సంబంధించినది.
Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923