X
X

వాస్తవ తనిఖీ: అసదుద్దీన్ ఒవైసి భజనలు పాడలేదు, వైరల్ అయిన వీడియోలు ఎడిట్ చేయబడినవి

కొత్త ఢిల్లీ (విశ్వాస్ న్యూస్): అసదుద్దీన్ ఒవైసి యొక్క వీడియోలు రెండు సోషల్ మీడియాపై చాలా వైరల్ అవుతున్నాయి. ఒక వీడియోలో, ఆయన కృష్ణుడు మరియు సుధాముడి గురించి ఒక భక్తి పాట పాడుతున్నారు – ‘అరె ద్వారపాలోన్’. రెండవ వీడియోలో ఆయన్ దుర్గాదేవి గురించి ఒక భక్తి స్తుతి పాడుతున్నారు.

అసదుద్దీన్ ఒవైసి ఒక సమూహములో కృష్ణుడి గురించిన భక్తిపాటలు పాడారు అనే క్లెయిమ్ తో ఈ వీడియోలు షేర్ చేయబడ్డాయి.

అసదుద్దీన్ ఒవైసీ యొక్క ఈ రెండు వీడియోలు ఎడిట్ చేయబడినవి అని విశ్వాస్ న్యూస్ తన దర్యాప్తులో కనుగొనింది. మొదటి వీడియోలో, ఆయన ముస్లిం-వ్యతిరేక ప్రచారము గురించి ఒక ఉపన్యాసము ఇస్తున్నారు, దీనిలోని ఆడియో ఎడిట్ చేయబడి కృష్ణుడి భక్తి పాట చేర్చబడింది. రెండవ వీడియోలో, ఆయన ఒక షేర్ పఠిస్తూ కనిపించారు, దీనిని ఎడిట్ చేసి ఆ స్థానములో దుర్గాదేవి భక్తి పాట చేర్చబడింది.

క్లెయిమ్:

వైరల్ వీడియో షేర్ చేస్తూ, ఫేస్‎బుక్ యూజర్ శైలేంద్ర వర్మ క్యాప్షన్ లో ఇలా వ్రాశారు, “ఒవైసీ గారు భజనలు పాడుతున్నారు (భక్తిపాటలు)”.

పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వర్షన్ ను ఇక్కడ చూడవచ్చు.

వైరల్ వీడియో (ఆర్కైవ్ లింక్) షేర్ చేస్తూ, ఫేస్‎బుక్ యూజర్ ప్రకాష్ సింగ్ క్యాప్షన్ లో ఇలా వ్రాశారు, “ఒవైసీ భజనలు పాడటం ప్రారంభించారు.”

దర్యాప్తు:

వైరల్ క్లెయిమ్ లోని వాస్తవం తెలుసుకొనుటకు, మేము అనేక కీవర్డ్స్ తో గూగుల్ పై సెర్చ్ చేశాము, కాని వైరల్ క్లెయిమ్ కు సంబంధించి ఎలాంటి ప్రామాణిక మీడియా నివేదిక మాకు కనిపించలేదు.

మేము వీడియో యొక్క అనే కీలక ఫ్రేమ్స్ ను సంగ్రహించాము మరియు గూగుల్ రివర్స్ ఇమేజ్ ద్వారా వాటిని సెర్చ్ చేశాము. కాగా, మాకు ఒరిజినల్ వీడియో న్యూస్18 ఉర్దూ యొక్క అధికారిక యూట్యూబ్ ఛానల్ పై అప్లోడ్ చేయబడినట్లు తెలిసింది. ఈ వీడియో అక్టోబరు 26, 2022 నాడు షేర్ చేయబడింది. ఇవ్వబడిన సమాచారము ప్రకారము, వైరల్ వీడియో బిజాపూర్, కర్ణాటకలో నిర్వహించిన ఒక రాలీకి సంబంధించినది.

కర్ణాటకలోని మునిసిపల్ ఎన్నికల ముందు, ఆయన రాలీలో ప్రసంగించేందుకు వచ్చారు. వీడియోలో, ఆయన ఎన్నికల గురించి మరియు ముస్లిం-వ్యతిరేక ప్రచారము గురించి మాట్లాడటం వినవచ్చు. వీడియో చూసిన తరువాత, ఆయన ఈ వీడియోలో ఎక్కడా భజనలు పాడలేదు అని మేము చూశాము. ఈ ఆడియో వీడియోకు తరువాత చేర్చబడింది.
రెండవ వీడియో వెనుక ఉన్న వాస్తవాన్ని తెలుసుకొనుటకు, మేము సంబంధిత కీవర్డ్స్ ఉపయోగించి గూగుల్ పై సెర్చ్ చేయడం ప్రారంభించాము మరియు మళ్ళీ ఒరిజినల్ వీడియో న్యూస్18 ఉర్దూ యొక్క అధికారిక యూట్యూబ్ పై అప్లోడ్ చేయబడినట్లు కనుగొన్నాము. ఈ వీడియో అక్టోబరు 14, 2022 నాడు షేర్ చేయబడింది. ఒరిజినల్ వీడియోలో, ఆయన ఒక షేర్ పఠించడం చూడవచ్చు, భజనలు పాడటం కాదు.

మరిన్ని వివరాల కోసం మేము ఏఐఎంఐఎం విలేఖరి మహమ్మద్ సల్మాన్ గారిని సంప్రదించాము. ఈ వైరల్ క్లెయిమ్ అసత్యమని ఆయన తెలిపారు. ఒవైసీ గారి పేరుప్రతిష్ఠలను కించపరచుటకు ప్రతిపక్ష పార్టీలు ఉద్దేశపూర్వకంగా వీడియోను ఎడిట్ చేసి షేర్ చేస్తున్నారు.

దర్యాప్తు చివరిలో, విశ్వాస్ న్యూస్ నకిలీ క్లెయిమ్ షేర్ చేసిన ఫేస్‎బుక్ యూజర్ యొక్క హ్యాండిల్ గురించిన సోషల్ స్కానింగ్ నిర్వహించింది. యూజర్ కు ఫేస్‎బుక్ పై 677 స్నేహితులు మరియు 174 ఫాలోయర్స్ ఉన్నారు.

ప్రొఫైల్ పై ఇవ్వబడిన సమాచారము ప్రకారము, యూజర్ ఉత్తర్ ప్రదేశ్ నివాసి.

ముగింపు: అసదుద్దీన్ ఒవైసీ ‘భజనలు పాడుతున్న’ రెండు వైరల్ వీడియోలు ఎడిట్ చేయబడినవి అని విశ్వాస్ న్యూస్ తన దర్యాప్తులో కనుగొనింది. మొదటి వీడియోలో, ఆయన ముస్లిం-వ్యతిరేక ప్రచారములో ఉపన్యాసము ఇస్తూ కనిపించారు, దీని ఆడియో ఎడిట్ చేసి కృష్ణుడి భజనలు చేర్చబడ్డాయి. అయితే, రెండవ వీడియోలో, ఆయన ఒక షేర్ పఠిస్తూ కనిపించారు, దీని ఆడియో స్థానములో దుర్గాదేవి భజనలు చేర్చబడ్డాయి.

  • Claim Review : ఒవైసీ గారు భజనలు పాడుతున్నారు (భక్తిపాటలు)
  • Claimed By : ఫేస్‎బుక్ యూజర్ శైలేంద్ర
  • Fact Check : False
False
Symbols that define nature of fake news
  • True
  • Misleading
  • False

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!

Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.

ట్యాగ్స్

Post your suggestion

No more pages to load

సంబంధిత వ్యాసాలు

Next pageNext pageNext page

Post saved! You can read it later