మమతా బెనర్జీ కనిపిస్తున్న ఈ వైరల్ వీడియో పాతది, అమిత్ షా ఇటీవలి బెంగాల్ టూర్‌తో ఈ వీడియోకు సంబంధం లేదు.
హైదరాబాద్ (విశ్వాస్ న్యూస్): కేంద్ర హోంశాఖ మంత్రి, బిజెపి నేత అమిత్ షా బెంగాల్ పర్యటన కారణంగా బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కలత చెందారని ఆరోపిస్తూ, కొందరు మమతా పాత వీడియో ఇటీవల వైరల్ చేస్తున్నారు.
విశ్వాస్ న్యూస్ ఈ వైరల్ వీడియోను ఫ్యాక్ట్‌చెక్ చేసింది, మరియు మమతా బెనర్జీ కనిపిస్తున్న ఈ వీడియో చాలా కాలం నుండి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లు కనుగొనడం జరిగింది. అమిత్ షా ఇటీవలి బెంగాల్ పర్యటనతో దీనికి సంబంధం లేదు. వైరల్ పోస్ట్ నకిలీ.
దావా :
ఫేస్బుక్ యూజర్ విక్రమ్ లఖ్రా మమతా బెనర్జీ యొక్క పాత వీడియోను పోస్ట్ చేశారు (తెలుగులో అనువదించబడింది): “అమిత్ షా బెంగాల్ పర్యటన కారణంగా మమతా బెనర్జీకి పిచ్చి పట్టింది.’
రూపేష్ తివారీ అనే యూజర్ ఇలా పేర్కొన్నారు: “బెంగాల్‌లోని తృణమూల్ కాంగ్రెస్ నాయకుల ఫిరాయింపులు మమతా దీదీ యొక్క మానసిక సమతుల్యతను దెబ్బతీసింది, ఈ వీడియో చూడండి.”
ఫేస్బుక్ పోస్ట్ ఆర్కైవ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.
దర్యాప్తు :
విశ్వాస్ న్యూస్ ఈ వీడియోను ఇన్విడ్ టూల్లో అప్లోడ్ చేసి కొన్ని స్క్రీన్గ్రాబ్లను సేకరించడం జరిగింది. తరువాత, మేము పొందిన స్క్రీన్గ్రాబ్లను గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్‌లో శోధించాము. ఆ సమయంలో, ఏడు సంవత్సరాల క్రితం ఓ యూట్యూబ్ ఛానెల్లో అప్లోడ్ చేసిన వీడియోను మేము కనుగొన్నాము. అసెంబ్లీలో టీఎంసీ నేతలు ఇబ్బందులు సృష్టించారని ఆ వీడియో డిస్క్రిప్షన్లో పేర్కొన్నారు. అది 2006లో జరిగిన సంఘటన అని కొందరు ఆ వీడియో కింద కామెంట్లు చేయడం కనిపించింది. ఆ వీడియోను ఇక్కడ చూడవచ్చు.
దైనిక్ జాగరణ్ బెంగాల్ బ్యూరో చీఫ్ జె.కె.వాజ్‌పేయిని విశ్వాస్ న్యూస్ సంప్రదించి మమతా బెనర్జీ వైరల్ వీడియో గురించి అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ వైరల్ పోస్ట్ నకిలీదని, ఇది పాత వీడియో అని వాజ్‌పేయి చెప్పారు.
విశ్వాస్ న్యూస్ అసలు ఈ వీడియో ఎప్పుడు రికార్డ్ చేయబడిందో లేదా ఎంత పాతదో స్వతంత్రంగా నిర్ధారించలేదు, కానీ ఈ వీడియో పాతదని మాత్రం ధృవీకరించబడింది. అమిత్ షా ఇటీవలి బెంగాల్ పర్యటనతో ఈ వీడియోకు సంబంధం లేదు.
వైరల్ వీడియోను షేర్ చేసిన ఫేస్బుక్ యూజర్ విక్రమ్ లఖారా ప్రొఫైల్‌ను మేము సోషల్ స్కాన్ చేశాము. ఆ యూజర్‌కు ఒక రాజకీయ పార్టీకి సపోర్ట్ చేస్తారని మేము కనుగొన్నాము. అతనికి 800 మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు.
निष्कर्ष: మమతా బెనర్జీ కనిపిస్తున్న ఈ వైరల్ వీడియో పాతది, అమిత్ షా ఇటీవలి బెంగాల్ టూర్‌తో ఈ వీడియోకు సంబంధం లేదు.
Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923