వాస్తవ తనిఖీ : బ్రిటన్ మహారాణి ఎలిజిబెత్ ఫోటో ఉన్న ఈ బిల్ బోర్డ్ ఎడిట్ చేయబడినది

ముగింపు : విశ్వాస్ న్యూస్ తన దర్యాప్తులో ఈ వైరల్ అవాస్తవమైనది అని తెలిసింది. వైరల్ ఫోటో ఎడిట్ చేయబడింది. అసలైన ఫోటోలో బ్రిటన్ మహారాణి ఎలిజిబెత్ యొక్క మరొక సందేశము ఉంది.

కొత్త ఢిల్లీ (విశ్వాస్ న్యూస్) : సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక ఫోటోలో బిల్ బోర్డ్ పై బ్రిటన్ మహారాణి ఎలిజిబెత్ యొక్క ఫోటో వెంబడి వ్యాక్సిన్ అందించినందుకు భారత ప్రధాని మోదీగారికి ధన్యవాదాలు తెలుపుతున్నట్లుగా వ్రాయబడింది.

విశ్వాస్ న్యూస్ తన దర్యాప్తులో ఈ వైరల్ పోస్ట్ అసత్యము అని కనుగొనింది. వైరల్ అయిన ఫోటో ఎడిట్ చేయబడింది. అసలైన ఫోటోలో బ్రిటన్ మహారాణి ఎలిజిబెత్ చెప్పిన వేరొక సందేశము ఉంది.

వైరల్ వీడియోలో ఏముంది?

వైరల్ ఫోటోలో బిల్ బోర్డ్ పై బ్రిటన్ మహారాణి ఎలిజిబెత్ యొక్క ఫోటోతో పాటు ఈ విధంగా వ్రాయబడి ఉంది, “Thank you PM Modi for sending us COVID 19 vaccine, you are a good boy” ఈ ట్వీట్ తో పాటు వివరణ కూడా వ్రాయబడింది : “200 సంవత్సరాలు మనలను పరిపాలించిన రవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యము, నేడు ప్రధానమంత్రి మోడీగారికి ధన్యవాదాలు తెలుపుతున్నారు. ఇంగ్లండ్ కు కరోనా వ్యాక్సిన్ అందించి సహాయం చేసినందుకు లండన్ లో మహారాణి ఎలిజిబెత్ II మోదీగారికి ధన్యవాదములు తెలిపారు”

విశ్వాస్ న్యూస్ తన వాస్తవ తనిఖీ వాట్స్యాప్ చాట్బోట్ (+91 95992 99372) లో కూడా ఈ దావా యొక్క వాస్తవ తనిఖీ కొరకు ఇవ్వబడింది.

వైరల్ పోస్ట్ యొక్క ఆర్కైవ్ లింక్ ను ఇక్కడ చూడవచ్చు.

దర్యాప్తు

మా దర్యాప్తును ప్రారంభించుటకు మేము ముందుగా ఫోటోను గూగుల్ రివర్స్ ఇమేజ్ పై శోధించాము. మాకు ఈ ఫోటో బీబీసీ యొక్క ఒక ట్వీట్ లో లభించింది. ఇది ఏప్రిల్ 20, 2020 నాడు ట్వీట్ చేయబడింది. ఇక్కడ బిల్ బోర్డ్ పై ఈ విధంగా వ్రాయబడింది “We will be with our friends again; we will be with our families again; we will meet again” మాకు ఈ ఫోటో newsweek.com యొక్క ఒక వార్తలో లభించింది. ఏప్రిల్ 8, 2020 నాడు ప్రచురించబడిన దాని ప్రకారం, ఈ ఫోటో Piccadilly Circus యొక్క ఒక బిల్ బోర్డ్ కు సంబంధించినది. ఆ వార్త ప్రకారం, “రాణి ఎలిజిబెత్ II యొక్క కరోనావైరస్ సందేశాన్ని పిక్కడిల్లీ సర్కస్, లండన్ యొక్క స్క్రీన్ మీద ఏప్రిల్ 2020 నాడు ప్రదర్శించబడింది. OCEAN OUTDOOR!” వార్త ప్రకారం, ఈ సందేశం పిక్కడిల్లీ సర్కస్ యొక్క లైట్ స్క్రీన్ పై చూపబడింది. వివరణలో OCEAN OUTDOOR అని వ్రాయబడింది. మేము జరిపిన విచారణలో పిక్కడిల్లీ సర్కస్, లండన్ యొక్క లైట్ స్క్రీన్ ను OCEAN OUTDOOR అనే ఒక కంపెనీ నిర్వహిస్తుందని మాకు తెలిసింది.

ఈ బిల్ బోర్డ్ యొక్క ఫోటో మాకు gettyimages.co.uk పై కూడా లభించింది. ఈ ఫోటోను గ్లెన్ కిర్క్ అనే ఒక ఫోటోగ్రాఫర్ క్లిక్ చేశారు. మేము ట్విట్టర్ ద్వారా గ్లెన్ కిర్క్ ను సంప్రదించాము మరియు ఈ బిల్ బోర్డ్ గురించి ప్రశ్నించాము. ఆయన “ఈ బిల్ బోర్డ్ గత సంవత్సరము ఏప్రిల్ కు సంబంధించినది. అసలైన బిల్ బోర్డ్ మీద “We will be with our friends again; we will be with our families again; we will meet again” అని వ్రాయబడింది. దీనిని కరోనా సందర్భముగా రాణి చేసిన మొదటి సందేశము”.

మేము నిర్ధారణ కొరకు ఓషన్ అవుట్డోర్ కంపెనీకి కాల్ చేసి సంప్రదించాము. కంపెనీ యొక్క కమ్యూనికేషన్ ఇంచార్జ్ ఎమిలి అర్థ్ ఇలా చెప్పారు “అసలైన యాడ్ లో ఈ విధంగా వ్రాయబడి ఉంది ‘We will be with our friends again; We will be with our families again; We will meet again’ మీమ్స్ సృష్టించే కొన్ని సైట్స్ కూడా ఈ యాడ్ టెంప్లేట్ ను ఉపయోగిస్తున్నారు మరియు ప్రజలు దీనిపై వారికి నచ్చిన సందేశాలను వ్రాసుకుంటున్నారు”

శోధించినప్పుడు మాకు ఈ బిల్ బోర్డ్ పై ఉన్న ఫోటో ఒక మీమ్స్ తయారు చేసే వెబ్సైట్ పై కూడా లభించింది. అక్కడ యూజర్ ఈ స్క్రీన్ మీద తనకు నచ్చిన సందేశము వ్రాసుకోవచ్చు మరియు మీం తయారు చేసుకోవచ్చు. బహుశా ఈ ఫోటోను ఇలాంటి ఒక సైట్ తయారు చేసి ఉండవచ్చు.

మార్చ్ 5, 2021 నాడు విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ ట్వీట్ చేసి భారతదేశములో తయారుచేయబడిన వ్యాక్సిన్ లండన్ కు పంపించడం జరిగిందని తెలిపారు.

రైటర్  యొక్క ఒక వార్త ప్రకారం బ్రిటన్ ప్రభుత్వ ప్రతినిధి ఒకరు బ్రిటీష్ ప్రభుత్వము ఆస్ట్రాజెనెకా యొక్క COVID – 19 వ్యాక్సిన్ ను 100 మిలియన్ మోతాదులను ఆర్డర్ చేసింది. ఇందులో 10 మిలియన్ మోతాదులు భారతదేశానికి చెందిన సీరం ఇన్స్టిట్యూట్ నుండి వస్తాయి. అయితే మాకు ఎక్కడా దీని గురించి బ్రిటన్ మహారాణి ఎలిజిబెత్ చేసిన ప్రకటన లభించలేదు.

ఈ పోస్ట్ ట్విట్టర్ యూజర్ @anandagarwal554 షేర్ చేశారు. ఈ ప్రొఫైల్  2016లో సృష్టించబడింది. దీనికి 5,302 ఫాలోయర్స్ ఉన్నారు.

निष्कर्ष: ముగింపు : విశ్వాస్ న్యూస్ తన దర్యాప్తులో ఈ వైరల్ అవాస్తవమైనది అని తెలిసింది. వైరల్ ఫోటో ఎడిట్ చేయబడింది. అసలైన ఫోటోలో బ్రిటన్ మహారాణి ఎలిజిబెత్ యొక్క మరొక సందేశము ఉంది.

Know The Truth...

Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923

Related Posts
ఇటీవలి పోస్ట్ లు