వాస్తవ తనిఖీ: డొనాల్డ్ ట్రంప్ యొక్క అరెస్ట్ యొక్క నకిలీ చిత్రాలు సోషల్ మీడియాపై గందరగోళాన్ని సృష్టిస్తోంది
- By: Devika Mehta
- Published: Apr 11, 2023 at 09:26 AM
కొత్త ఢిల్లీ (విశ్వాస్ న్యూస్): మాజీ యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అరెస్ట్ అయ్యారు అనే చిత్రాలు సోషల్ మీడియా పై వైరల్ అయిన తరువాత జనరేటివ్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాంకేతికత యొక్క లాభ నష్టాలపై ఒక చర్చ టాపు లేపేసింది. ఇంటర్నెట్ పై తికమకను మరియు గందరగోళానికి దారి తీసిన సమాచారాన్ని చాలామంది విశ్వసించారు. అయితే, విశ్వాస్ న్యూస్, తన దర్యాప్తులో, ఈ నకిలీ చిత్రాలు సాంకేతికత గురించి అవగాహనను వ్యాప్తి చేయుటకు డిజిటల్ గా సృష్టించబడ్డాయి అని కనుగొనింది.
క్లెయిమ్:
ఫేస్బుక్ యూజర్ ‘ఇమాకులాడా గౌవియా లేటె’ ఈ వైరల్ పోస్ట్ ను షేర్ చేశారు:
“బ్రేకింగ్: ట్రంప్ లైవ్ లో కనిపిస్తున్నారు, షాకింగ్ అరెస్ట్ ముందు క్షణాలు! షాకింగ్ వీడియోలు & డాక్యుమెంట్లు
అంతా సిద్ధంగా ఉంది మరియు ఆస్తులు వాటి స్థానంలో ఉన్నాయి కాని అవి మనలను మూసివేస్తాయి. ఈ క్షణములో మొత్తం ప్రపంచం మారుతోంది!
ట్రంప్ తన సమయాన్ని వెచ్చిస్తున్నాడు మరియు ముందుకు వచ్చి దేశాన్ని కాపాడుటకు సరైన సమయం కొరకు వేచి ఉన్నారు. ఇది చాలా పెద్దవిషయం!
(ట్రంప్ ప్రతి ఒక్కరిని ఆన్లైన్ లోకి పిలిచారు)
తెరవెనుక ఏం జరుగుతోంది?
మీడియా మన నుండి ఏం దాస్తోంది?
ఆయన ఇదివరకు చెప్పింది విశ్వసించలేకపోతున్నాం…
ఇదివరకటి కంటే ఇప్పుడే ఆయనకు మన సహకారం అవసరం ⬇️
ఇక్కడ కలవండి https: // t.me/+ OaWbDHrKxAtjMzk8
ట్రంప్ కొరకు ప్రార్ధించండి”
ఇతర యూజర్లు కూడా సోషల్ మీడియాపై ఇలాంటి పోస్ట్స్ లు షేర్ చేశారు.
దర్యాప్తు:
ముందుగా, విశ్వాస్ న్యూస్ డొనాల్డ్ ట్రంప్ యొక్క అరెస్ట్ గురించి రిపోర్ట్స్ కొరకు అనేక సెర్చ్ ఇంజన్స్ ను స్కాన్ చేసింది కాని ఏమి లభించలేదు. Reuters, CNN, మరియు అనేక ఇతర ఛానల్స్ తమ రిపోర్ట్స్ లో ప్రజలను తప్పుదోవపట్టించినందుకు ట్రంప్ తప్పుపట్టారు, తద్వారా ఈ వారం ఆయన అరెస్ట్ అవుతాడని మరియు నిరసనలు తెలియజేయవలసి ఉంటుందని ప్రజలు ఆశించారు‘.
ఇతర వార్తా రిపోర్ట్స్ కూడా ట్రంప్ యొక్క అరెస్ట్ కు సంబంధించిన ఈ నకిలీ చిత్రాలు ఎలా విఘాతం కలిగించే ఏఐ పెరుగుదలను చూపుతాయి అనేదాని గురించి మాట్లాడాయి.
తదుపరి, విశ్వాస్ న్యూస్ పోస్ట్ నుండి కీవర్డ్స్ కు సంబంధించి ఓపెన్ గూగుల్ సెర్చ్ నిర్వహించింది మరియు ఇటువంటి క్లెయిమ్స్ ట్విట్టర్ పై కూడా కనుగొనింది. మేము మూలము మాదిరిగానే ఉన్న ఒక పోస్ట్ ను గుర్తించాము. ఈ పోస్ట్ ను ఎలియొట్ హిగ్గిన్స్ ద్వారా సోషల్ మీడియాపై పోస్ట్ చేయబడింది మరియు ఇందులో “ట్రంప్ అరెస్ట్ కోసం ఎదురుచూస్తుండగా ట్రంప్ అరెస్ట్ చేయబడినట్లుగా చిత్రాలు తయారుచేయడం” అని వ్రాసి ఉంది.
అతని ట్విట్టర్ త్రెడ్, లో ఇటువంటి క్రియేషన్స్ ఉన్నాయి. ఈమెయిల్ ద్వారా విశ్వాస్ న్యూస్ అతనిని సంప్రదించినప్పుడు , ఆయన స్పందించారు, “వాటిని నేను మిడ్జర్నీ ఉపయోగించి సృష్టించాను. ముందుగా, మిడ్జర్నీ ఏమి చేయగలదు అని చూపించేందుకు నేను ప్రధానంగా వాటిని షేర్ చేశాను, తరువాత మిడ్జర్నీ ఏమి చేయగలదు అని పరీక్షించేందుకు వాటిని నేను వివరణాత్మకంగా చేశాను. త్రెడ్ చివరిలో నేను కొన్ని పాయింట్స్ చేశాను, బహుశా అవి మీకు ఆసక్తికరంగా ఉండవచ్చు.”
అతని ట్విట్టర్ ప్రొఫైల్ వివరణ ఈ విధంగా ఉంది: బీలింగ్క్యాట్ యొక్క వ్యవస్థాపకుడు మరియు సృజనాత్మక డైరెక్టర్ మరియు బీలింగ్క్యాట్ ప్రొడక్షన్స్ డైరెక్టర్ బివి. వి ఆర్ బీలింగ్క్యాట్ రచయిత. టోనల్ విప్లాష్ జోన్”. అయినప్పటికీ, తన క్రియేషన్స్ ఆన్లైన్ లో వచ్చిన తరువాత, మిడ్జర్నీ తమ సైట్ నుండి అతనిని బాన్ చేసింది.
మిడ్జర్నీ గురించి తెలియని వారి కోసం, ఇది శాన్ ఫ్రాన్సిస్కో-ఆధారిత స్వతంత్ర పరిశోధన ల్యాబ్ ద్వారా సృష్టించబడిన ఒక ఏఐ కార్యక్రమము, ఇది ఓపెన్ఏఐ’స్ డాల్-ఈ మరియు స్టేబుల్ డిఫ్యూషన్ మాదిరిగానే “ప్రాంప్ట్స్” అని పిలువబడే సహజ భాషా వివరణల నుండి చిత్రాలను ఉత్పన్నం చేస్తుంది
ఆ చిత్రాలు ఏఐ ద్వారా ఉత్పన్నం చేయబడ్డాయి అని అర్థంచేసుకునేందుకు మేము నిపుణుడు స్వప్ననీల్ మెహత, పిహెచ్డి స్కాలర్, ఎన్వైయూ డేటా సైన్స్ తో మాట్లాడాము. ఈయన పరిశోధనలు మెషీన్ లెర్నింగ్ నుండి సాధనాలను ఉపయోగించి సోషల్ మీడియాపై డిస్ఇన్ఫర్మేషన్ ను పరిమితం చేయడం గురించి ప్రస్తావిస్తాయి.
ఆయన ఇలా వివరించారు, “సోర్స్ ట్రాకింగ్ వంటి సేఫ్గార్డ్స్ లేకుండా జనరేటివ్ ఆర్ట్ యొక్క ప్రజాస్వామ్యీకరణ, సంక్లిష్ట గుర్తింపును మరియు ట్రంప్ యొక్క అరెస్ట్ ను చూపించే ఉత్పాదక కళ చుట్టూ వ్యాప్తి చెందిన నకిలీ వార్తల వంటి తప్పు సమాచారము వ్యాప్తి చేయుటకు విరోధి నటులకు అనుమతించడము వంటి మధ్యస్థ సవాళ్ళను సృష్టిస్తుంది.”
“మూలాధారం లేదా మూలం యొక్క ట్రాకింగ్ అనేది ఏఐ-జనరేటెడ్ కంటెంట్ యొక్క దుర్వినియోగాన్ని ఆపేందుకు ఆవశ్యకము. ఇది ఆందోళన పెరుగుతున్న ఒక రంగము, ముఖ్యంగా కంటెంట్ తనిఖీ చేయబడక ముందే తక్షణ పంపిణీ ఛానల్ ను అంఇద్చే సోషల్ నెట్వర్క్స్,” అని మెహతా చెప్పారు.
వైరల్ పోస్ట్ షేర్ చేసిన యూజర్ యొక్క సోషల్ స్కాన్ ద్వారా, డిలి (కాంగో) నుండి ఒక డిజిటల్ క్రియేటర్ అని మరియు ఫేస్బుక్ పై సుమారు 9000 ఫాలోయర్స్ చే అనుసరించబడుతోందని తెలిసింది.
ముగింపు: ఆన్లైన్ లో చక్కర్లు కొడుతున్న డొనాల్డ్ ట్రంప్ యొక్క అరెస్ట్ యొక్క వైరల్ చిత్రాలు నకిలీవి మరియు ఏఐ అప్లికేషన్ మిడ్జర్నీ ద్వారా ఉత్పన్నం చేయబడినవి. ఈ చిత్రాలు, సాంకేతికత – దాని వినియోగము మరియు దుర్వినియోగము గురించి అవగాహనను వ్యాప్తి చేయుటకు డిజిటల్ గా సృష్టించబడ్డాయి!
- Claim Review : డొనాల్డ్ ట్రంప్ హష్-మనీ చెల్లింపు కేసులో అరెస్ట్ అయ్యారు
- Claimed By : ఎఫ్బి యూజర్: ఇమాకులాడా గౌవియా లేటె
- Fact Check : False
Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.