విశ్వాస్ న్యూస్ వైరల్ క్లెయిమ్ గురించి దర్యాప్తు చేసి వైరల్ క్లెయిమ్ అసత్యము అని కనుగొనింది. రాహుల్ గాంధి గురుద్వారా సాహిబ్ లో లాంగర్ తిన్నారు.
కొత్త ఢిల్లీ (విశ్వా న్యూస్). కాంగ్రెస్ నేత రాహుల్ గాంధి, పంజాబ్ నుండి వచ్చిన తన 117 కార్యకర్తలతో ప్రార్థనలు చేయడానికి గురువారము నాడు అమృతసర్ స్వర్ణదేవాలయం హర్మందిర్ సాహిబ్ చేరుకున్నారు. దీనికి సంబంధించి ఆయన వీడియో ఒకటి సోషల్ మీడియా పై వైరల్ అవుతోంది. ఈ వీడియోలో, రాహుల్ గాంధి గురుద్వారాలోని ఒక లాంగర్ ప్రదేశములో ఒక మాస్క్ వేసుకొని కూర్చుకొని ఉన్నారు, మరియు ఆయన చుట్టూ ఉన్న వారు లాంగర్ తింటూ కనిపిస్తున్నారు. ఈ వీడియో షేర్ చేయడము ద్వారా, రాహుల్ గాంధి కేవలం ఫోటోగ్రాఫ్ కోసం మాత్రమే గురుద్వారాకు వెళ్ళారని క్లెయిమ్ చేయబడింది. ఆయన కంచం ఖాళీగా ఉంది మరియు ఆయన మాస్క్ ధరించి ఉన్నారు. ఈ క్లెయిమ్ ప్రకారం, “మాస్క్ ధరించి ఎవరైనా లాంగర్ తింటారా? రాహుల్ గాంధి లాంగర్ ప్రసాదము తినలేదు. ఇలా చేసి రాహుల్ గాంధి గురుద్వారాను అవమానించారు”. విశ్వాస్ న్యూస్ ఈ వైరల్ క్లెయిమ్ గురించి దర్యాప్తు నిర్వహించింది మరియు ఈ వైరల్ క్లెయిమ్ ఒక అబద్ధపు ప్రచారము అని కనుగొనింది. రాహుల్ గాంధి గురుద్వారా వద్ద లాంగర్ తిన్నారు.
వైరల్ వీడియో షేర్ చేసే సమయములో, ట్విట్టర్ యొజర్ @sagrolikarBJP ఈ విధంగా వ్రాశారు, “ఖాళీ కంచం మరియు మాస్క్ ధరించి నటించే సూపర్‌స్టార్స్ లాంగర్ తింటున్నారు. గురుద్వారా సాహెబ్ కు అవమానకరం. ఎప్పుడు ప్రజలను అవమానిస్తూ మరియు వారిని అమాయకులను చేస్తున్నారు, గురునానక్ దేవాలయములో నటించమని వారికి ఎవరు చెప్పారు?”
పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వర్షన్ ను ఇక్కడ చూడవచ్చు.
వైరల్ క్లెయిమ్ లోని వాస్తవాన్ని తెలుసుకొనుటకు, మేము కొన్ని కీవర్డ్స్ ఉపయోగించి గూగుల్ పై సెర్చ్ చేశాము. వైరల్ పోస్ట్ కు సంబంధించి Dainik Jagran పై జనవరి 28, 2022 నాడు వెబ్సైట్ పై మాకు ప్రచురించబడిన ఒక రిపోర్ట్ లభించింది. రాగుల్ గాంధి గురుద్వారాలో లాంగర్ తిన్నారు. రిపోర్ట్ లో ఉపయోగించబడిన ఫోటోలో, రాహుల్ గాంధి లాంగర్ తింటూ కనిపించారు.
దర్యాప్తును మరింత ముందుకు తీసుకెళ్తూ, మేము కాంగ్రెస్ యొక్క అధికారిక యూట్యూబ్ ఛానల్ ను స్కాన్ చేయడం ప్రారంభించాము. ఈ సమయములో వైరల్ క్లెయిమ్ కు సంబంధించి మాకు 27 జనవరి 2022 నాడు అప్లోడ్ చేయబడిన ఒక వీడియో కనిపించింది. ఇందులో రాహుల్ గాంధి తన మాస్క్ ను తీసివేసి లాంగర్ తినడము స్పష్టంగా చూడవచ్చు.
మరింత సమాచారము కొరకు, మేము రాహుల్ గాంధి సందర్శనను కవర్ చేసిన దైనిక్ జాగరణ్ యొక్క అమృతసర్ చీఫ్ రిపోర్టరయిన విపిన్ రాణా గారిని కలిశాము. మేము ఆయనకు వైరల్ వీడియోను షేర్ చేశాము. ఆయన మాతో ఇలా అన్నారు, “వైరల్ క్లెయిమ్ అసత్యం. రాహుల్ గాంధి తన హర్మిందర్ సాహిబ్ సందర్శనలో లాంగర్ తిన్నారు”
దర్యాప్తు చివరిలో, ఈ పోస్ట్ షేర్ చేసిన మేము ట్విట్టర్ యూజర్ @సాగ్రోలికర్బిజేపి గురించి సోషల్ స్కానింగ్ చేశాము. యూజర్ ఒక భావజాలము వలన ప్రభావితుడు అయ్యాడని మాకు తెలిసింది. ట్విట్టర్ పై ఈ యూజర్ కు 1300 కంటే ఎక్కువ ఫాలోయర్స్ ఉన్నారు. శివచరణ్ పాటిల్ జూన్ 2010 నుండి ట్విట్టర్ పై యాక్టివ్ గా ఉన్నారు.
निष्कर्ष: విశ్వాస్ న్యూస్ వైరల్ క్లెయిమ్ గురించి దర్యాప్తు చేసి వైరల్ క్లెయిమ్ అసత్యము అని కనుగొనింది. రాహుల్ గాంధి గురుద్వారా సాహిబ్ లో లాంగర్ తిన్నారు.
Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923