X
X

వాస్తవ తనిఖీ: అమెజాన్ తన సొంత టోకెన్స్ యొక్క ముందస్తు అమ్మకాలు ప్రారంభించింది అని క్లెయిమ్ చేసే పోస్ట్ నకిలీది

విశ్వాస్ న్యూస్ దర్యాప్తు చేసి అమెజాన్ తన సొంత టోకెన్స్ యొక్క ముందస్తు అమ్మకాలను ప్రారంభించింది అని క్లెయిమ్ చేసే వైరల్ పోస్ట్ నకిలీది అని కనుగొనింది. ఈ క్లెయిమ్ అసత్యము అని సంస్థ తెలిపింది. ఇది డబ్బును దోచుకునేందుకు మరియు వ్యక్తిగత డేటాను సేకరించుటకు ఉద్దేశించబడిన ఒక స్కామ్.

కొత్త ఢిల్లీ (విశ్వాస్ న్యూస్):సోషల్ మీడియాపై వైరల్ అవుతున్న ఒక పోస్ట్ రీటెయిల్ దిగ్గజం అయిన అమెజాన్ తన సొంత టోకెన్స్ యొక్క “ముందస్తు అమ్మకాలు” ప్రారంభించింది అని క్లెయిమ్ చేస్తోంది. ఈ సృజనాత్మకత యొక్క స్క్రీన్ షాట్ కు ఒక లింక్ కూడా ఉంది. విశ్వాస్ న్యూస్ దర్యాప్తు చేసింది మరియు ఈ వైరల్ పోస్ట్ నకిలీది అని కనుగొనింది. ఈ క్లెయిమ్ అసత్యము అని కంపెనీ చెబుతోంది. డబ్బు దోచుకునేందుకు మరియు వ్యక్తిగత డేటాను సేకరించుటకు ఉద్దేశించబడిన స్కాం ఇది.

దర్యాప్తు

సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఒక స్క్రీన్ షాట్ ఆన్లైన్ రీటెయిల్ దిగ్గజము అయిన అమెజాన్ తన సొంత టోకెన్స్ యొక్క “ముందస్తు అమ్మకాలు” ప్రారంభించింది అని క్లెయిమ్ చేస్తోంది. ఈ స్క్రీన్ షాట్ లో ఒక లింక్ కూడా ఉంది AMZTOKENSALES.NET

విశ్వాస్ న్యూస్ తన వాట్సాప్ చాట్‎బోట్ పై వాస్తవ తనిఖీ కొరకు పోస్ట్ అందుకుంది.

దర్యాప్తు

ఈ వైరల్ పోస్ట్ కు సంబంధించి విశ్వాస్ న్యూస్ అమెజాన్ కస్టమర్ కేర్ అధికారులను సంప్రదించింది. వాళ్ళు వైరల్ అవుతున్న పోస్ట్ యొక్క స్క్రీన్ షాట్ షేర్ చేయమని మమ్మల్ని అడిగారు. దర్యాప్తు చేసిన తరువాత, వాళ్ళు ఇలా అన్నారు: “ఈ సృజనాత్మకత ఒక స్కాం లో భాగము. ఇది సంస్థ యొక్క పేరుప్రతిష్ఠలకు హాని కలిగించుటకు మరియు యూజర్స్ ను మోసం చేయుటకు ఒక మార్గము. వైరల్ అయిన పోస్ట్ నకిలీది మరియు ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించుటకు చేసిన ఒక ప్రయత్నము.”

మేము మరింత శోధించి ఇంటర్నెట్ సెక్యూరిటి సంస్థ అయిన అవాస్ట్ ద్వారా ఒక బ్లాగ్ పోస్ట్ ను కనుగొన్నాము, అందులో ఇలా పేర్కొనబడింది, “అమెజాన్ క్రిప్టోకరెన్సీ మార్కెట్లోకి ప్రవేశిస్తోందని మరియు దానిలో భాగంగా తమ సొంత టోకెన్స్ ను సృష్టిస్తోందని తెలియజేసిన వార్తా కథనాల నుండి ఈ పుకార్లు ఉద్భవించాయి. ఈ కథనాలు జులై 2021 లో అమెజాన్ ఉద్యోగాల పోస్టింగ్ నుండి ఊహాగానాలపై ఆధారపడినవి. ఈ పుకార్లు నిరూపించబడలేదు మరియు ప్రస్తుతం అమెజాన్ టోకెన్లు ఏవి అమ్మకానికి లేవు”.

“ఈ హానికరమైన యాడ్స్ లో ఏదైనా ఒకదానిపై ఎవరైనా ఒకసారి క్లిక్ చేస్తే, వారు అమెజాన్ వారి కొత్త (ఉనికిలో లేనిది) టోకెన్ క్రిప్టోకరెన్సీ ని ప్రచారం చేసేదిగా కనిపించే బాగా-నిర్మించబడిన వెబ్సైట్ కు మళ్ళించబడతారు. అయితే, సమగ్ర దర్యాప్తు చేసిన తరువాత, ఈ సైట్స్ పై అక్కడక్కడ కొన్ని అక్షర దోషాలను మీరు గమనించవచ్చు, అంటే ఇవి చట్టబద్ధమైనవి కాదు అని మనకు సూచిస్తాయి”, అని పేర్కొనబడింది.

ఇదివరకు కూడా అమేజాన్ యొక్క పేరుప్రతిష్ఠలకు హాని కలిగించాలని ప్రయత్నించిన ఇటువంటి క్లెయిమ్ ను విశ్వాస్ న్యూస్ అసత్యముగా నిరూపించింది. ఇక్కడ చూడండి.

निष्कर्ष: విశ్వాస్ న్యూస్ దర్యాప్తు చేసి అమెజాన్ తన సొంత టోకెన్స్ యొక్క ముందస్తు అమ్మకాలను ప్రారంభించింది అని క్లెయిమ్ చేసే వైరల్ పోస్ట్ నకిలీది అని కనుగొనింది. ఈ క్లెయిమ్ అసత్యము అని సంస్థ తెలిపింది. ఇది డబ్బును దోచుకునేందుకు మరియు వ్యక్తిగత డేటాను సేకరించుటకు ఉద్దేశించబడిన ఒక స్కామ్.

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!

Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.

ట్యాగ్స్

Post your suggestion

No more pages to load

సంబంధిత వ్యాసాలు

Next pageNext pageNext page

Post saved! You can read it later