X
X

వాస్తవ తనిఖీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడి తలనీలాలు తీయించుకోలేదు, వైరల్ చిత్రము ఎడిట్ చేయబడినది.

కొత్త ఢిల్లీ (విశ్వాస్ న్యూస్): నరేంద్ర మోడి తన తలనీలాలు మరియు గడ్డము తీయించున్నట్లు కనబడిన ఒక చిత్రాన్ని విశ్వాస్ న్యూస్ చూసింది. ఆ పోస్ట్ లో తన తల్లి హీరాబేన్ డిసెంబరు 30న మరణించినందున హిందూ సంప్రదాయము ప్రకారము మోడి తలనీలాలు తీయించుకున్నారు అని క్లెయిమ్ చేయబడింది. ఈ వైరల్ పోస్ట్ నకిలీది అని విశ్వాస్ న్యూస్ తన దర్యాప్తులో కనుగొనింది.

క్లెయిమ్:

ఫేస్‎బుక్ యూజర్, प्रवीण राठौड़ ठि.हरनावा पट्टी ఈ వైరల్ చిత్రాన్ని షేర్ చేసి ఇలా వ్రాశారు: తొలగించబడింది.

అనువాదము: నరేంద్ర మోడిగారి తల్లి హీరాబేన్ మరణించిన తరువాత, ప్రధాని నరేంద్ర మోడి హిందూ సంప్రదాయము ప్రకారము తలనీలాలు తీయించుకున్నారు.

పోస్ట్ ను మరియు దాని ఆర్కైవ్ వెర్షన్ ను ఇక్కడ చూడండి.

దర్యాప్తు:

ప్రధాని నరేంద్ర మోడి మరియు ఆయన తల్లి మరణము గురించిన వార్తా నివేదికలను సెర్చ్ చేస్తూ విశ్వాస్ న్యూస్ తన దర్యాప్తును ప్రారంభించింది.

ఆయన తల్లి మరణము గురించి మాకు కొన్ని రిపోర్ట్స్ లభించాయి. కాని ఎక్కడ ప్రధాని తన తలనీలాలు తీయించుకున్నారు అనే వార్త మాకు కనిపించలేదు.

తన తల్లి మరణము తరువాత, ప్రధానమంత్రి పశ్చిమ బెంగాల్ లో రైల్వే ప్రాజెక్ట్స్ ను వర్చువల్ గా ప్రారంభించారు. వార్తా రిపోర్ట్స్ లో దీనికి సంబంధించిన చిత్రమే ఉంది మరియు అందులో ఆయన తలనీలాలు తీయించుకున్నట్లు కనిపించలేదు.

అంతేకాకుండా ఆయన కోల్కతా లో నేషనల్ గంగా కౌన్సిల్ సమావేశము కు వర్చువల్ గా అధ్యక్షత వహించారు. అక్కడ కూడా వైరల్ చిత్రములో ఇవ్వబడిన విధంగా ఆయన ఉన్నట్లు మాకు కనిపించలేదు.

మేము ప్రధాని నరేంద్ర మోడి గారి ట్విట్టర్ ప్రొఫైల్ ను చూడా తనిఖీ చేశాము మరియు ఇటీవలి చిత్రాలలో కూడా ఆయన తలనీలాలు తీయించుకున్నట్లు ఎక్కడా కనిపించలేదు.

వైరల్ ఫోటో పై మేము ఒక యాండెక్స్ సెర్చ్ నిర్వహించాము మరియు ప్రధాని నరేంద్ర మోడి యొక్క అసలైన చిత్రాన్ని చూశాము.

రెండు చిత్రాల మధ్య పోలికను ఈ దిగువన చూడండి.

దర్యాప్తు యొక్క తరువాతి దశలో, మేము బిజేపి జాతీయ విలేఖరి డా. బిజయ్ సోంకర్ శాస్త్రి ని సంప్రదించాము. వైరల్ క్లెయిమ్ నకిలీది అని, అది ప్రధాని నరేంద్ర మోడిని అపఖ్యాతిపాలు చేయాలనే ఉద్దేశముతో చేయబడిందని ఆయన మాకు చెప్పారు. “ఒకవేళ ఆయన నిజంగా తలనీలాయి తీయించుకొని ఉంటే, అధికారిక హ్యాండిల్ పై షేర్ చేయబడిన చిత్రాలలో మరియు ఆయన బహిరంగ ప్రదర్శనలలో మీరు చూసి ఉండవచ్చు,” అని డా శాస్త్రి చెప్పారు.

దర్యాప్తు చివరి దశలో విశ్వాస్ న్యూస్ వైరల్ పోస్ట్ ను షేర్ చేసిన యూజర్ యొక్క సామాజిక నేపథ్యము గురించిన తనిఖీ నిర్వహించింది. ఫేస్‎బుక్ యూజర్, प्रवीण राठौड़ ठि.हरनावा पट्टी కి 7k మంది ఫాలోయర్స్ ఉన్నారు.

ముగింపు: ప్రధాని నరేంద్ర మోడి ఇటీవల తన తల్లి హీరాబేన్ మరణము తరువాత తలనీలాలు తీయలేదు. ప్రధాని యొక్క వైరల్ చిత్రము ఎడిట్ చేయబడినది.

  • Claim Review : నరేంద్ర మోడిగారి తల్లి హీరాబేన్ మరణించిన తరువాత, ప్రధాని నరేంద్ర మోడి హిందూ సంప్రదాయము ప్రకారము తలనీలాలు తీయించుకున్నారు.
  • Claimed By : प्रवीण राठौड़ ठि.हरनावा पट्टी
  • Fact Check : False
False
Symbols that define nature of fake news
  • True
  • Misleading
  • False

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!

Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.

ట్యాగ్స్

Post your suggestion

No more pages to load

సంబంధిత వ్యాసాలు

Next pageNext pageNext page

Post saved! You can read it later