దావా సమీక్ష : దేశంలో ఒక కోటి మంది కరోనా సోకిన రోగులకు చికిత్స అందించినట్లు ప్రధాని మోదీ పేర్కొన్నారు.
హైదరాబాద్
(విశ్వాస్ న్యూస్) : భారతదేశంలో కరోనా వైరస్ సోకిన కోటిమందికి ఉచితంగా చికిత్స అందించి
వారికి నయం చేశామని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నట్లు ఓ హిందీ న్యూస్ ఛానల్‌కు సంబంధించిన
బ్రేకింగ్ ప్లేట్ స్క్రీన్‌షాట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
విశ్వాస్ న్యూస్ దర్యాప్తులో ఈ వాదన అబద్ధమని తేలింది. ఒక కోటిమంది కరోనా సోకిన రోగులకు ఉచిత చికిత్సను అందించామని ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించలేదు. కానీ మోదీ పేరు మీద తప్పుడు ప్రచారం జరుగుతోంది.
వైరల్ పోస్ట్ లో ఏముంది ?
‘Humorously Serious‘ పేరుతో ప్రొఫైల్ కలిగి ఉన్న ఓ ఫేస్‌బుక్ యూజర్ ఈ వైరల్ పోస్ట్ చేశారు. ”1 crore treated. 👏😅 Last I checked even the worldometer hasn’t reached this number.” అని ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు.
ఈ రైటప్‌ను తెలుగులో అనువదిస్తే.. “1 కోటిమందికి చికిత్స. 👏😅 వరల్డ్‌మీటర్‌లో కూడా కరోనా సోకిన రోగుల సంఖ్య ఈ నెంబర్‌కు చేరుకోలేదు అన్నది నేను గమనించాను.”
(Viral Post Image)
విశ్వాస్‌న్యూస్ పరిశోధన మేరకు 800 మందికి పైగా ఈ పోస్ట్‌ను షేర్ చేసుకున్నారు. చాలా మంది ఇతర యూజర్లు కూడా ఈ బ్రేకింగ్ ప్లేట్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
పరిశోధన :
మే 31వ తేదీన ‘మన్ కి బాత్’ కార్యక్రమం ద్వారా ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ధృవీకరించబడిన యూట్యూబ్ ఛానల్ ‘నరేంద్ర మోడీ’లో ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియో అందుబాటులో ఉంది. ఈ వీడియోలో, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆయుష్మాన్ భారత్ యోజన గురించి మాట్లాడుతూ ఈ పథకం కింద దేశంలోని ఒక కోటి మంది ప్రజలకు ఉచితంగా చికిత్స అందించినట్లు చెప్పారు.
ఈ 29 నిమిషాల 40 సెకన్ల వీడియోలో, 17.35 నుండి 18.07 సెకన్ల ఫ్రేమ్‌లో, ప్రధాని మోడీ ప్రసంగాన్ని ఇలా వినవచ్చు, ”కోటి కోట్ల మంది పేదలు మన దేశంలో దశాబ్దాలుగా ఎంతో ఆందోళనతో జీవిస్తున్నారు. మీరు అనారోగ్యానికి గురైతే చికిత్స గురించి ఆలోచించాలా.. కుటుంబ పోషణ గురించి ఆలోచించాలా ? అన్న ఆందోళన ఉండేది. ఈ సమస్యను గ్రహించి ఈ ఆందోళనను పరిష్కరించడానికి ఆయుష్మాన్ భారత్ యోజనను ఒకటిన్నర సంవత్సరాల క్రితం ప్రారంభించారు. కొద్ది రోజుల క్రితం ఆయుష్మాన్ భారత్ లబ్ధిదారుల సంఖ్య ఒక కోటి సంఖ్య దాటింది.”
అంటే, ఒక కోటి కరోనా రోగుల చికిత్స గురించి ప్రధాని చెప్పలేదు, ఆయుష్మాన్ భారత్ పథకం కింద ఇప్పటివరకు కోటి మందికి పైగా చికిత్స పొందారని అన్నారు.
Pmjay.gov.in నుండి వచ్చిన డేటా ద్వారా ఇది ధృవీకరించబడింది. వెబ్‌సైట్‌లో ఇచ్చిన గణాంకాల ప్రకారం, జూన్ 2, 2020 వరకు, ఈ పథకం కింద కోటి రెండు లక్షల మంది రోగులు ఆసుపత్తుల్లో చికిత్స పొందారు.
స్క్రీన్ షాట్ వైరల్ కావడం
గురించి ఇండియా టీవీ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అనితా శర్మను సంప్రదించడం జరిగింది. ఈ సందేశంపై సమాధానమిస్తూ, “కరోనా మహమ్మారి
కారణంగా కొనసాగుతున్న లాక్‌డౌన్ మధ్య, 31 మే 2020 న, గౌరవనీయ ప్రధానమంత్రి
మన్‌కీ బాత్ ద్వారా దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ఆ కార్యక్రమం ఇండియాటీవీలో ప్రత్యక్ష
ప్రసారం చేయబడింది. ప్రేక్షకుల సౌలభ్యం కోసం, ప్రధాని యొక్క ఈ ప్రసంగం
యొక్క ముఖ్యమైన విషయాలు ఆయన ప్రసంగంలో ముఖ్య భాగంగా హైలైట్ చేయబడ్డాయి. ఎవరో ఒకరి తప్పిదం కారణంగా, ఒక కోటి కరోనా రోగులకు
ఉచితంగా చికిత్స అందించినట్లు పేర్కొనబడింది. అయితే, ఆయుష్మాన్ భారత్ పథకం
కింద ఒక కోటి రోగులకు ఉచితంగా చికిత్స అందించినట్లు వాస్తవానికి చెప్పబడింది. ప్రసారం
సమయంలో అక్కడ పనిచేస్తున్న టీమ్ ఈ తప్పును గమనించి వెంటనే సరిచేశారు. దీనికి
వివరణ కూడా అదే రోజు రాత్రి 9.45 గంటలకు ఇండియా టివిలో
ప్రసారం చేయబడింది.
ఈ వివరణ ఇండియా టివి యొక్క అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో చూడవచ్చు.
ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ లెక్కల ప్రకారం (జూన్ 3వ తేదీ ఉదయం 8 గంటల వరకు) దేశంలో కరోనా వైరస్ యొక్క యాక్టివ్ కేసుల సంఖ్య 1,01,497 కాగా, 1,00,302 మంది చికిత్స తీసుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఈ వైరస్ కారణంగా దేశంలో ఇప్పటివరకు 5,815 మంది మరణించారు.
వైరల్ వీడియో షేరింగ్ చేసిన ఫేస్‌బుక్ పేజీని సుమారు ఇరవై వేల మంది అనుసరిస్తున్నారు.
disclaimer : విశ్వస్ న్యూస్ యొక్క కరోనా వైరస్ (COVID-19) కు సంబంధించిన ఫాక్ట్ చెక్ స్టోరీని చదివేటప్పుడు లేదా షేర్ చేసుకునేటప్పుడు, ఉపయోగించిన డేటా లేదా పరిశోధన డేటా ఎప్పటికప్పుడు మారుతుందని అని మీరు గుర్తుంచుకోవాలి.
ఎందుకు మారుతుందంటే ఈ అంటువ్యాధికి సంబంధించిన గణాంకాలు (వైరస్ సోకిన మరియు నయం చేయబడిన రోగుల సంఖ్య, మరణాల సంఖ్య) నిరంతరం మారుతూ ఉంటాయి. అదే సమయంలో, ఈ వ్యాధికి వ్యాక్సిన్‌ను కనుగొనే దిశలో కొనసాగుతున్న పరిశోధనల యొక్క ఖచ్చితమైన ఫలితాలు ఇంకా రాలేదు. ఈ కారణంగా, చికిత్స మరియు నివారణకు సంబంధించి అందుబాటులో ఉన్న డేటా కూడా మారవచ్చు. అందువల్ల కథనంలో ఉపయోగించిన డేటాను దాని తేదీ సందర్భంలో చూడటం చాలా ముఖ్యం.
ముగింపు : కరోనా వైరస్ సోకిన ఒక కోటిమంది రోగులకు ఉచితంగా చికిత్సను అందించామని ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించలేదు. మన్‌కీ బాత్ కార్యక్రమంలో, ఆయుష్మాన్ భారత్ పథకం కింద ఒక కోటి మంది రోగులకు ఉచిత చికిత్స గురించి ప్రస్తావించారు.
निष्कर्ष: దావా సమీక్ష : దేశంలో ఒక కోటి మంది కరోనా సోకిన రోగులకు చికిత్స అందించినట్లు ప్రధాని మోదీ పేర్కొన్నారు.
Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923