వాస్తవ తనిఖీ: లేదు, మైక్రోవేవ్ ఓవెన్స్ లను పారవేయాలని జపాన్ నిర్ణయించలేదు
ముగింపు: తన దర్యాప్తులో జపాన్ మైక్రోవేవ్ ఓవెన్స్ ను నిషేధించడము లేదని, ఆ వైరల్ క్లెయిమ్ నకిలీ అని విశ్వాస్ న్యూస్ కనుగొనింది.
- By: Ankita Deshkar
- Published: Nov 25, 2021 at 03:28 PM
కొత్త ఢిల్లీ (విశ్వాస్ న్యూస్): ఈ సంవత్సరాంతానికి మైక్రోవేవ్ ఓవెన్స్ లను జపాన్ పూర్తిగా నిషేధించబోతోందని క్లెయిమ్ చేస్తూ ఒక పోస్ట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ పోస్ట్ గురించి విశ్వాస్ న్యూస్ ఒక తనిఖీ నిర్వహించి ఈ పోస్ట్ నకిలీది అని కనుగొనింది.
క్లెయిమ్:
ఫేస్బుక్ ప్రొఫైల్, సలహారి అనేక కారణాల వలన జపాన్ మైక్రోవేవ్ ఓవెన్ లను నిషేధిస్తుంది అని తన ప్రొఫైల్ పై ఒక పెద్ద సందేశాన్ని పోస్ట్ చేసింది.
కొంతమంది దీనిని ఈ క్రింది క్లెయిమ్స్ తో వాట్సాప్ లో షేర్ చేస్తున్నారు:
ఆ పోస్ట్ ను మరియు దాని ఆర్కైవ్డ్ వర్షన్ ను ఇక్కడ చూడండి.
దర్యాప్తు:
ఒక సాధారణ గూగుల్ సెర్చ్ తో విశ్వాస్ న్యూస్ తన దర్యాప్తును ప్రారంభించింది. ఇటువంటి నివేదికను విశ్వసనీయమైన వార్తా సంస్థ ఏది విడుదల చేయలేదని మేము కనుగొన్నాము.
ఒక రష్యన్ వెబ్సైట్ పై ఈ ఆర్టికల్ ను మేము కనుగొన్నాము, ఇందులో “ఈ సైట్ పై అన్ని వచనాలు వాస్తవము యొక్క వింతైన పేరడీలు మరియు అవి నిజమైన వార్తలు కావు” అని స్పష్టంగా పేర్కొనబడింది.
అలాగే యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ వారి వెబ్సైట్ పై ఒక ఆర్టికల్ ను విశ్వాస్ న్యూస్ కనుగొనింది, ఇందులో ఈ విధంగా పేర్కొనబడింది, “సేంద్రీయ పదార్థములో అయనీకరణ రేడియేషన్ కు బహిర్గతం కావడం అనేది అణువులు మరియు పరమాణువులను మార్చవచ్చు మరియు కణాలకు నష్టం కలిగించవచ్చు”
ఆర్టికల్ ను ఇక్కడ చదవండి.
చివరిగా విశ్వాస్ న్యూస్ జపాన్ లోని భారతదేశంలో జన్మించిన ఆసియా మూలానికి చెందిన అసెంబ్లీ సభ్యుడు యోగేంద్ర పురాణిక్ ను సంప్రదించారు. ఆయన కూడా జపాన్ లో మినిస్ట్రీల వద్ద పారిశ్రామిక సలహాదారుడు మరియు ఉపన్యాసకుడు. ఆయన విశ్వాస్ న్యూస్ తో ఇలా అన్నారు, “ఇది మొత్తం బూటకం. మైక్రోవేవ్స్ చాలా కాలం క్రితమే ఉత్పన్నం చేయబడ్డాయి. తయారీ సాంకేతికతలలో ఆరోగ్య స్పృహ ఎంతో ఉంది. అలాగే, ఉపయోగించిన ఓవెన్స్, ఆమాటకు వస్తే ఉపయోగించిన గృహోపకరణాలను అన్నిటిని పారవేయడములో జపాన్ ఒక మంచి వ్యవస్థ కలిగి ఉంది. వాటిని ఇంటి వద్ద నుండే సేకరిస్తారు మరియు విరగ్గొట్టిన తరువాత రీసైకిల్ చేస్తారు”.
చివరిగా, ఈ వైరల్ క్లెయిమ్ ను షేర్ చేసిన యూజర్ పై విశ్వాస్ న్యూస్ ఒక వాస్తవ తనిఖీ నిర్వహించింది. ఫేస్బుక్ ప్రొఫైల్ సలహారి లీక్స్ తనను తాను ఒక విలేఖరిగా చెప్పుకుంటుంది.
निष्कर्ष: ముగింపు: తన దర్యాప్తులో జపాన్ మైక్రోవేవ్ ఓవెన్స్ ను నిషేధించడము లేదని, ఆ వైరల్ క్లెయిమ్ నకిలీ అని విశ్వాస్ న్యూస్ కనుగొనింది.
Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.