మహమ్మద్ రఫీ పాట గురించిన వైరల్ క్లెయిమ్ తప్పుదోవపట్టించేది అని తేలింది. సెన్సార్ బోర్డ్ వారు ఈ పాటలోని వాక్యాలను మార్చారు. ఈ పాట బ్యాన్ చేయబడలేదు.
విశ్వాస్ న్యూస్ (కొత్త ఢిల్లీ): మహమ్మద్ రఫీ పాట ‘కాశ్మీర్ హై భారత్ కా, కాశ్మీర్ న దేంగే’ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పాకిస్తాన్ అభ్యంతరం వెలిబుఛి భారత ప్రభుత్వాన్ని ఈ పాటను బ్యాన్ చేయమనింది కాబట్టి ఈ పాట కొన్ని సంవత్సరాల క్రితం బ్యాన్ చేయ అని క్లెయిమ్ చేయబడింది అని క్లెయిమ్ చేయబడింది. విశ్వాస్ న్యూస్ దర్యాప్తులో ఈ వైరల్ క్లెయిమ్ తప్పుదోవపట్టించేది అని తేలింది. ఈ పాటను బ్యాన్ చేయలేదు. ఈ పాటలోని కొన్ని వాక్యాలను సెన్సార్ బోర్డు మార్చింది.
ఫేస్బుక్ యూజర్ హబీబ్ ఖురేషి (ఆర్కైవ్) ఈ వీడియోను షేర్ చేసి మహమ్మద్ రఫీ పాడిన ఈ పాటకు పాకిస్తాన్ అభ్యంతరం తెలిపింది మరియు ఈ పాటను బ్యాన్ చేయాలని భారత ప్రభుత్వాన్ని కోరింది. మన ప్రభుత్వము ఆ సమయములో ఈ పాటను బ్యాన్ చేసింది, ఇది చాలా అరుదైన పాట, బహుశా ఎమెరు దీనిని ఎప్పుడు విని ఉండరు, ఒకసారి వినండి.
అనేక కీవర్డ్స్ ఉపయోగించి మేము గూగుల్ పై సెర్చ్ చేశాము. ఈ వైరల్ పాట పేరు ‘జన్నత్ కి హై తస్వీర్‘. అని మేము కనుగొన్నాము. ఇది 1966లో విడుదల అయిన ‘జోహార్ ఇన్ కాశ్మీర్’ సినిమాలోనిది. ఈ సినిమా భారతదేశ విభజన తరువాత 1940లలో కాశ్మీర్ గురించి తీయబడింది.
మేము అందుకున్న సమాచారము ఆధారంగా, మళ్ళీ గూగుల్ పై మరికొన్ని ఇతర కీవర్డ్స్ ఉపయోగించి సెర్చ్ చేయడం ప్రారంభించాము. మాకు సమాచార మరియు ప్రసార మంత్రిత్వశాఖ యొక్క వెబ్సైట్ పై 1966 లోని ఒక గెజెట్ ఆఫ్ ఇండియా డాక్యుమెంట్ లభించింది. 1966లో సమాచార మరియు ప్రసార మంత్రిత్వశాఖ ఈ పాట నుండి ‘హాజి పీర్’ అనే పదాన్ని తొలగించాలని ఆదేశము జారీ చేసింది. ఈ సవరణల తరువాత ఈ పాట విడుదల చేయబడింది. ఈ డాక్యుమెంట్ లో ఎక్కడా ఈ పాట బ్యాన్ చేయబడినట్లు ప్రస్తావన లేదు. మహమ్మద్ రఫీ పాడిన ఈ పాట ఆన్లైన్ ప్లాట్ఫార్మ్స్ పై అందుబాటులో ఉంది, దీనిన్ సెర్చ్ చేసి వినవచ్చు.
ఈ పాటపై మరింత సమాచారము కొరకు, విశ్వాస్ న్యూస్ సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ & విమర్శకుడు అయిన ఎస్. రామచంద్రన్ గారిని సంప్రదించింది. ఆయన ఈ వైరల్ క్లెయిమ్ అసత్యము అని మాకు చెప్పారు. ఈ పాటను సెన్సార్ బోర్డ్ వారు బ్యాన్ చేయలేదు. కేవలం దీనికి కొన్ని మార్పులు మాత్రమే చేశారు.
నకిలీ క్లెయిమ్ షేర్ చేసిన యూజర్ హబీబ్ ఖురేషి యొక్క సోషల్ స్కానింగ్ చేసిన తరువాత, ఈ యూజర్ కు 189 మంది ఫాలోయర్స్ ఉన్నారు అని మాకు తెలిసింది. ఈ యూజర్ బులంద్‌షహర్, ఉత్తర్ ప్రదేశ్ నివాసి.
निष्कर्ष: మహమ్మద్ రఫీ పాట గురించిన వైరల్ క్లెయిమ్ తప్పుదోవపట్టించేది అని తేలింది. సెన్సార్ బోర్డ్ వారు ఈ పాటలోని వాక్యాలను మార్చారు. ఈ పాట బ్యాన్ చేయబడలేదు.
Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923