ఈ క్లెయిమ్ అవాస్తవం అని తన దర్యాప్తులో విశ్వాస్ న్యూస్ కనుగొనింది. వీడియోలో కనిపించే వ్యక్తి యుక్రెయిన్ అధ్యక్షుడు వొలొడిమిర్ జెలెన్స్కీ కాదు, ఆయన యుక్రెయిన్ బ్యాండ్ విన్నిషియా పెప్పర్స్ లోని ఒక కమెడియన్ మరియు ఉక్రేనియన్ రాజకీయవేత్త అయిన వసిలీ ల్యుబానియుకి.
విశ్వాస్ న్యూస్ (కొత్త ఢిలీ): ఉక్రెయిన్-రష్యా యుద్ధం నేపథ్యములో సోషల్ మీడియాపై ఒక పోస్ట్ వైరల్ అవుతోంది, ఇందులో ఒక వ్యక్తి కొంతమంది మహిళలతోకలిసి వేదికపై పాడుతూ కనిపిస్తారు. ఈ వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి యుక్రెయిన్ అధ్యక్షుడు వొలొడిమిర్ జెలెన్స్కీ అని ఈ పోస్ట్ క్లెయిమ్ చేస్తోంది. ఈ క్లెయిమ్ అవాస్తవం అని తన దర్యాప్తులో విశ్వాస్ న్యూస్ కనుగొనింది. వీడియోలో కనిపించే వ్యక్తి యుక్రెయిన్ అధ్యక్షుడు వొలొడిమిర్ జెలెన్స్కీ కాదు, ఆయన యుక్రెయిన్ బ్యాండ్ లోని ఒక కమెడియన్ మరియు రాజకీయవేత్త అయిన వసిలీ గుమెన్యుక్.
ఫేస్బుక్ యూజర్ యోగేష్ దంగాయచ్ నమో ఈ చిత్రాన్ని తన ఫేస్బుక్ ప్రొఫైల్ పై పోస్ట్ చేశారు మరియు దానికి ఈ విధంగా శీర్షికను వ్రాశారు “మిత్రులారా… మీకు పరిచయం చేస్తున్నాను… కొత్త గ్లోబల్ హీరో, మేధావి – ఉన్నత వర్గం బావమరిది, ప్రపంచపు గొప్ప యోధుడు. ది యాక్సిస్ …… ఒంటరిగా రష్యా సేనలను ఎదుర్కొంటున్న యుక్రెయిన్ అధ్యక్షుడు – వొలొడిమిర్ జెలెన్స్కీ! శుభాకాంక్షలు!!!!
విశ్వాస్ న్యూస్ ఈ వీడియో యొక్క కొన్ని స్క్రీన్ షాట్స్ ను గూగుల్ రివర్స్ ఇమేజ్ సహాయముతో శోధించింది. ఈ వీడియో మాకు тудія “Квартал 95” అనే ఒక ఫేస్బుక్ పేజ్ పై అక్టోబరు 2017 నాడు అప్లోడ్ చేయబడినదిగా లభించింది. ఈ వీడియో వెంట పోస్ట్ చేయబడిన వచనము ఈ విధంగా ఉంది “అనువదించబడినది: కళ్ళు మనసుకు అద్దం వంటివి. కాని ఇవి ఒక నిజమైన యుక్రేనియన్ కళ్ళు అయితే, ఈ మనసు మరింత లోతైనది కావచ్చు… యుక్రేనియన్ జానపద గీతం, “నల్లని కనుబొమలు, గోధుమరంగుకళ్ళు” “విన్నిషియ” బృందముచే నిర్వహించబడింది.”
అలాగే prolviv.com పై ఒక వార్తా వ్యాసములో ఉపయోగించబడిన ఈ వైరల్ వీడియో యొక్క కొన్ని స్క్రీన్ షాట్స్ మాకు లభించాయి. ఈ కథనము అక్టోబరు 2017లో ప్రచురించబడింది. ఈ వార్తల ప్రకారం, “ఉక్రెయిన్ లో నిర్వహించబడిన లీగ్ ఆఫ్ లాఫ్టర్ అనే ఒక ప్రదర్శనలో, విన్నిషియా అనే ఒక బృందము ‘ఐస్ ఆఫ్ ఎ మెయిడెన్” అనే పాట పాడారు.
ఇక్కడి నుండి ఒక క్లూ తీసుకుంటూ మేము విన్నిషియా బృందము కొరకు ఇంటర్నెట్ పై శోధించాము. ఇది ఒక ఉక్రేనియన్ మ్యూజిక్ బ్యాండ్ అని మేము కనుగొన్నాము. మరియు ఈ వీడియోలో పాటపాడుతున్న వ్యక్తి పేరు వసిలీ గుమెన్యుక్.
ఆ తరువాత మేము ‘వసుకీ గుమెన్యుక్’ అనే కీవర్డ్స్ ఉపయోగించి గూగుల్ రివర్స్ ఇమేజ్ పై వైరల్ వీడియో యొక్క స్క్రీన్ షాట్స్ ను శోధించాము. ఈ ఫోటో మాకు ria.ru పై ఒక వార్తా వ్యాసములో లభించింది. వార్త ప్రకారం, “అనువదించబడింది: “లీగ్ ఆఫ్ లాఫ్టర్” అనే ఒక కామెడీ ప్రదర్శనలో కమెడీయన్ అయిన వసిలీ గుమెన్యుక్ ను ఉక్రెయిన్ అధ్యక్షుడు ఖ్మెల్నిట్స్కీ ప్రాంతము యొక్క యార్మొలీనెట్స్కీ జిల్లా రాష్ట్ర పరిపాలనా చెయిర్మెన్ గా నియమించారు.
పోస్ట్ గురించి తనిఖీ కొరకు విశ్వాస్ న్యూస్ ఉక్రెయిన్ యొక్క వాస్తవ-తనిఖీ బృందాన్ని సంప్రదించింది. అక్కడి నుండి స్పందన వచ్చిన వెంటనే వాస్తవ తనిఖీ అప్డేట్ చేయబడుతుంది.
విశ్వాస్ న్యూస్ ఈ వైరల్ స్క్రీన్ షాట్ ను షేర్ చేసిన యూజర్ యొక్క సామాజిక నేపథ్యము గురించి తనిఖీ చేసింది. యోగేష్ దంగాయచ్ నమో జైపూర్ నివాసి.
निष्कर्ष: ఈ క్లెయిమ్ అవాస్తవం అని తన దర్యాప్తులో విశ్వాస్ న్యూస్ కనుగొనింది. వీడియోలో కనిపించే వ్యక్తి యుక్రెయిన్ అధ్యక్షుడు వొలొడిమిర్ జెలెన్స్కీ కాదు, ఆయన యుక్రెయిన్ బ్యాండ్ విన్నిషియా పెప్పర్స్ లోని ఒక కమెడియన్ మరియు ఉక్రేనియన్ రాజకీయవేత్త అయిన వసిలీ ల్యుబానియుకి.
Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923