వాస్తవ తనిఖీ: మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ పేరున నకిలీ ప్రకటన వైరల్ అయ్యింది

మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ గారు ప్రధాని నరేంద్ర మోదీ గురించి ఎటువంటి ప్రకటన ఇవ్వలేదని విశ్వాస్ న్యూస్ తన దర్యాప్తులో కనుగొనింది. సోషల్ మీడియాపై నకిలీ క్లెయిమ్స్ షేర్ చేయబడ్డాయి.

కొత్త ఢిల్లీ (విశ్వాస్ న్యూస్): భారత మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ ను పేర్కొంటూ ఒక ప్రకటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మాజీ రాష్ట్రపతి ప్రధాని నరేంద్ర మోదీ గారిని పొగిడారని మరియు ఇలా అన్నారని క్లెయిమ్ చేయబడుతోంది, “నరేంద్ర మోదీగారు మాత్రమే ఇండియాను ఒక మంచి దేశముగా తీర్చిదిద్దారు. ఎందుకంటే భారతదేశ ప్రజలకు ఒక కొత్త దిశా నిర్దేశాన్ని అందించగలిగే నిర్ణయాలు తీసుకోగలిగే సామర్థ్యము కలిగి ఉన్నారు.”

ఈ వైరల్ క్లెయిమ్ వాస్తవం కాదు అని తన విచారణలో విశ్వాస్ న్యూస్ కనుగొనింది. ప్రధాని మోదీగారికి సంబంధించి మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ ఇటువంటి ప్రకటన ఏదీ చేయలేదు. సోషల్ మీడియాపై నకిలీ క్లెయిమ్ వైరల్ అవుతోంది.

క్లెయిమ్:

ఫేస్‎బుక్ యూజర్ ‘రాకేష్ పాటిదార్‘ (ఆర్కైవ్ వర్షన్) తన ప్రొఫైల్ నుండి ఈ పోస్ట్ ను జూన్ 22న షేర్ చేశారు. ఈ పోస్ట్ పై, “బ్రేకింగ్ న్యూస్, భారత మాజీ రాష్ట్రపతి, శ్రీమతి. ప్రతిభా పాటిల్ గారు ప్రధాని మోదీగారి గురించి ఒక పెద్ద ప్రకటన చేశారు. ప్రతిభా పాటిల్ ఇలా అన్నారు, “నేను కాంగ్రెస్ పార్టీకి చెందినప్పటికీ ఈరోజు భారతదేశపు ఒక సామాజిక కార్యకర్తగా, ఇండియాను ఒక మంచి దేశముగా చేయటానికి సామార్థ్యం ఉన్న వ్యక్తి నరేంద్ర మోదీ గారు మాత్రమే, ఎందుకంటే భారతదేశ ప్రజలకు ఒక కొత్త దిశా నిర్దేశాన్ని అందించగలిగే నిర్ణయాలు తీసుకోగలిగే సామర్థ్యము ఆయన మాత్రమే కలిగి ఉన్నారు. మోదీ గారు భారత దేశానికి ఒక కొత్త దిశను చూపించారు, నేను కూడా దేశము యొక్క రాష్ట్రపతిగా సేవలు అందించాను, కాని ప్రధాని మోదీ వంటి నాయకుడిని ఎప్పుడూ చూడలేదు.”

దర్యాప్తు:

వైరల్ క్లెయిమ్ గురించిన వాస్తవాలను తెలుసుకొనుటకు, మేము కొన్ని కీవర్డ్స్ ఉపయోగించి గూగుల్ లో సెర్చ్ చేశాము, కాని వైరల్ క్లెయిమ్ కు సంబంధించి ఎలాంటి విశ్వసనీయ మీడియా నివేదిక లభించలేదు. ఒకవేళ ప్రతిభా పాటిల్ గారు ఇటువంటి ప్రకటన చేసి ఉంటే, దానికి సంబంధించిన నివేదిక ఉండేది.

దర్యాప్తును ముందుకు కొనసాగిస్తూ, మేము మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ గారి అధికారిక సోషల్ మీడియా ఖాతాలను సెర్చ్ చేశాము. కాని ప్రతిభా పాటిల్ గారి అధికారిక సోషల్ మీడియా ఖాతాలను మేము కనుగొనలేకపోయాము.

మరింత సమాచారము కొరకు, మేము మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ గారి ప్రైవేట్ సెక్రెటరీ శ్రీ జికే దాస్ గారిని సంప్రదించాము. ఈ పోస్ట్ నకిలీది అని ఆయన మాతో చెప్పారు. ఈ పోస్ట్ గతములో కూడా చాలాసార్లు వైరల్ అయ్యింది, దానిని ప్రతిభా పాటిల్ గారు స్వయంగా ఖండించారు. ఆమె ఇటువంటి ప్రకటన ఏదీ చేయలేదు అని ఆయన చెప్పారు. ఆమెకు ఎలాంటి సోషల్ మీడియా లేదని కూడా ఆయన చెప్పారు.

దర్యాప్తు చివరిలో, మేము నకిలీ పోస్ట్ ను షేర్ చేసిన యూజర్ యొక్క సోషల్ స్కానింగ్ చేశాము. ఈ యూజర్ మధ్య ప్రదేశ్ నివాసి అని స్కానింగ్ లో వెల్లడి అయ్యింది. ఈ యూజర్ కు ఫేస్‎బుక్ పై 984 స్నేహితులు ఉన్నారు.

निष्कर्ष: మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ గారు ప్రధాని నరేంద్ర మోదీ గురించి ఎటువంటి ప్రకటన ఇవ్వలేదని విశ్వాస్ న్యూస్ తన దర్యాప్తులో కనుగొనింది. సోషల్ మీడియాపై నకిలీ క్లెయిమ్స్ షేర్ చేయబడ్డాయి.

False
Symbols that define nature of fake news
Know The Truth...

Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923

Related Posts
ఇటీవలి పోస్ట్ లు