X
X

వాస్తవ తనిఖి: ఏబి డి విలియర్స్ తన చేతులలో వినాయకుడి విగ్రహాన్ని పట్టుకోలేదు, వైరల్ అయిన చిత్రము మార్ఫింగ్ చేయబడినది

విశ్వాస్ న్యూస్ చేసిన దర్యాప్తులో ఈ క్లెయిం అసత్యము అని కనుగొనబడింది. నిజానికి, ఈ చిత్రము మార్ఫింగ్ చేయబడింది. అసలైన చిత్రములో, ఏబి డి విలియర్స్ తన చేతులలో ఒక ట్రోఫీని పట్టుకొని ఉన్నారు. వినాయక విగ్రహము కాదు

విశ్వాస్ న్యూస్ (కొత్త ఢిల్లి). ప్రపంచవ్యాప్తంగా వినాయకుడి పండుగ జరుపుకుంటున్న నేపథ్యములో, మాజీ దక్షిణాఫ్రికా బ్యాట్స్ మ్యాన్ అయిన ఏబి డి విలియర్స్ చిత్రము వైరల్ అవుతోంది. ఈ చిత్రములో ఆయన వినాయకుడి విగ్రహాన్ని తన చేతులలో పట్టుకొని ఉండడం చూడవచ్చు. విశ్వాస్ న్యూస్ తన దర్యాప్తులో ఈ చిత్రము ఎడిట్ చేయబడిన చిత్రము అని కనుగొనింది. అసలైన చిత్రములో ఏబి డి విలియర్స్ ఒక ట్రోఫీని పట్టుకొని ఉన్నారు, వినాయకుడి విగ్రహము కాదు.

ఏది వైరల్ అవుతోంది?

ట్విట్టర్ యూజర్ అయిన కెవిన్ డి విలియర్స్ సెప్టెంబర్ 10, 2021 నాడు ఒక చిత్రాన్ని షేర్ చేశారు, దాని వెంట ఈ వివరణ కూడా ఉంది, “నా స్నేహితులందరికి శుభోదయం మరియు వినాయక చతుర్థి శుభాకాంక్షలు”

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వర్షన్ ఇక్కడ క్లిక్ చేయడము ద్వారా చూడవచ్చు.

దర్యాప్తు

ఈ పోస్ట్ ను పరిశోధించే ముందు, విశ్వాస్ న్యూస్ గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ సాధనాన్ని ఉపయోగించింది. ఈ చిత్రము అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ఐసిసి పై అప్లోడ్ చేయబడింది అని మేము కనుగొన్నాము. ఈ చిత్రములో ఏబి డి విలియర్స్ ఒక ట్రోఫీని పట్టుకొని ఉన్నారు మరియు ఇది జూన్ 3, 2017లో అప్లోడ్ చేయబడింది.

అలాగే ఈ చిత్రాన్ని మేము www.icc-cricket.com. పై ఒక వార్తా వ్యాసములో కూడా చూశాము. ఇక్కడ కూడా ఏబి డి విలియర్స్ తన చేతులలో ట్రోఫీని పట్టుకొని ఉన్నారు.

ఈ రెండు చిత్రాల మధ్య సారూప్యతను ఈ దిగువన ఉన్న కొల్లాజ్ లో చూడవచ్చు.

దీనికి సంబంధించి మేము దైనిక్ జాగరణ్ డిజిటల్ యొక్క స్పోర్ట్స్ హెడ్ అయిన విప్లవ్ కుమార్ ను కలిశాము. ఈ చిత్రాన్ని గురించి అడిగినప్పుడు, ఆయన ఇలా అన్నారు, “ఈ చిత్రము 2017లో ఆడిన ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్ సమయములో తీయబడింది. ఇందులో దక్షిణాఫ్రికా జట్టు కెప్టెన్ అయిన ఏబి డి విలియర్స్, ఇతర కెప్టెన్స్ మాదిరిగానే ట్రోఫీతో ఈ విధంగా భంగిమ ఇచ్చారు. వైరల్ అయిన చిత్రము ఎడిట్ చేయబడింది”.

కీవర్డ్ సెర్చ్ ఉపయోగించి మేము ఇంటర్నెట్ పై శోధించాము, కాని ఎక్కడా ఏబి డి విలియర్స్ వినాయక చవితి పండుగ జరుపుకున్నట్లు వార్త మాకు కనిపించలేదు.

ఇప్పుడు ట్విట్టర్ పై ఈ పోస్ట్ షేర్ చేసిన యూజర్ ‘కెవిన్ డి విలియర్స్’ యొక్క ప్రొఫైల్ ను స్కాన్ చేయవలసిన సమయం వచ్చింది. ప్రొఫైల్ స్కాన్ చేసినప్పుడు అది ఒక ఫ్యాన్ ఖాతా అని మేము కనుగొన్నాము. ఈ యూజర్ కు 719 ఫాలోయర్స్ ఉన్నారు.

निष्कर्ष: విశ్వాస్ న్యూస్ చేసిన దర్యాప్తులో ఈ క్లెయిం అసత్యము అని కనుగొనబడింది. నిజానికి, ఈ చిత్రము మార్ఫింగ్ చేయబడింది. అసలైన చిత్రములో, ఏబి డి విలియర్స్ తన చేతులలో ఒక ట్రోఫీని పట్టుకొని ఉన్నారు. వినాయక విగ్రహము కాదు

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!

Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.

ట్యాగ్స్

Post your suggestion

No more pages to load

సంబంధిత వ్యాసాలు

Next pageNext pageNext page

Post saved! You can read it later