కొత్త ఢిల్లీ (విశ్వాస్ న్యూస్): బిబిసి సీరీస్ ‘ఇండియా: ది మోడి క్వశ్చన్’ పై వివాదము తీవ్రరూపం దాలుస్తున్న తరుణములో, డాక్యుమెంటరీ తయారీదారులతో రాహుల్ గాంధి కలిశారు అనే క్లెయిమ్ తో ఆయన చిత్రము ఒకటి సోషల్ మీడియాలో షేర్ చేయబడుతోంది.
రాహుల్ గాంధి వెనుక ఉన్న వారు డాక్యుమెంటరీ తయారీదారులు కాదని విశ్వాస్ న్యూస్ తన దర్యాప్తులో కనుగొనింది. ఫోటోలో రాహుల్ వెంబడి నిలబడి ఉన్న వ్యక్తి మాజీ యూకే లేబర్ పార్టీ నేత జెరెమి కర్బిన్ మరియు రెండవ వ్యక్తి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారి సలహాదారు శాం పిట్రోడ.
జనవరి 27, 2023 నాడు వైరల్ చిత్రాన్ని షేర్ చేస్తూ, ఫేస్బుక్ యూజర్ భూషణ్ గోసావి ఆంగ్లములో క్యాప్షన్ లో ఇలా వ్రాశారు, “ఇదివరక్ & ఇప్పటి బిబిసి ఎడిటర్ తో రాహుల్ గాంధి, బిబిసి వివాదాస్పద యాంటి ఇండియన్ డాక్యుమెంటరీ చిత్రాన్ని తెరకెక్కించారు….”
పోస్ట్ యొక్క అంశాలు ఇక్కడ ఉన్నవి ఉన్నట్లుగా వ్రాయబడ్డాయి. ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వర్షన్ ను ఇక్కడ చూడండి. ఈ క్లెయిమ్ ను ఇతర యూజర్స్ కూడా సోషల్ మీడియాపై షేర్ చేస్తున్నారు. వైరల్ చిత్రాన్ని షేర్ చేస్తూ, ఇతర యూజర్స్ ఇలా వ్రాశారు: బిబిసి డాక్యుమెంటరీ నిర్మాతతో రాహుల్ గాంధి.
వైరల్ చిత్రము గురించిన వాస్తవం తెలుసుకొనుటకు, మేము గూగుల్ రివర్స్ ఇమేజ్ టూల్ ఉపయోగించి ఫోటోను సెర్చ్ చేశాము. ఈ చిత్రము మాకు అమర్ ఉజాల యొక్క నివేదికలో కనిపించింది. ఈ నివేదిక మే 24, 2022 నాడు ప్రచురించబడింది. నివేదిక ప్రకారము, “తన లండన్ సందర్శనలో రాహుల్ గాంధి బ్రిటీష్ ఎంపి జెరెమి కర్బిన్ ను కలిశారు.” ఈ సమావేశము యొక్క ఒక చిత్రము ట్విట్టర్ పై కాంగ్రెస్ షేర్ చేసింది. ఈ చిత్రము ఆ సమావేశము సమయములో తీయబడినది.
‘ది ట్రిబ్యూన్ ఇండియా’ ద్వారా మే 24, 2022 నాడు ప్రచురించబడిన నివేదిక ప్రకారము, చిత్రములో రాహుల్ గాంధితో కలిసి నిలబడిన మొదటి వ్యక్తి మాజీ యూకే లేబర్ పార్టీ నేత జెరెమి కర్బిన్ మరియు రెండవ వ్యక్తి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారి సలహాదారు శాం పిట్రోడ.
హిందుస్తాన్ లైవ్, ఇండియా టుడే మరియు ఆజ్ తక్ కూడా ఈ నివేదికను ప్రచురించాయి.
దర్యాప్తు సమయములో, ఈ వైరల్ చిత్రము కాంగ్రెస్ యొక్క అధికారిక ట్విట్టర్ పై పోస్ట్ చేయబడింది అని మేము కనుగొన్నాము. ఈ చిత్రము మే 23, 2022 నాడు షేర్ చేయబడింది మరియు ఇది రాహుల్ గాంధి యొక్క లండన్ సందర్శనకు సంబంధించినది.
మేము శాం పిట్రోడ మరియు జెరెమి కర్బిన్ యొక్క సోషల్ మీడియా ఖాతాలను శోధించడం ప్రారంభించాము, మరియు ఈ వైరల్ చిత్రాన్ని పిట్రోడా యొక్క అధికారిక ట్విట్టర్ ఖాతాపై కనుగొన్నాము. జనవరి 25, 2023 నాడు వైరల్ చిత్రాన్ని షేర్ చేస్తూ శాం పిట్రోడ క్యాప్షన్ లో ఇలా వ్రాశారు, ఈ చిత్రములో రాహుల్ గాంధితో కలిసి నిలుచున్న వ్యక్తి నా స్నేహితుడు మరియు యూకే నేత జెరెమి కర్బిన్. ఈయన బిబిసి ఎడిటర్ కాదు. దీనితోపాటు ఈయన వికిపీడియా లింక్ కూడా షెర్ చేయబడింది, ఇందులో ఆయన సమాచారము అంతా ఇవ్వబడింది.
జెరెమి కర్బిన్ యొక్క సోషల్ మీడియా ఖాతాలను స్కాన్ చేసిన తరువాత, ఆయన యూకే నేత అని విశ్వాస్ న్యూస్ కనుగొనింది. యూకే పార్లమెంట్ యొక్క సభ్యుల సమాచారము ఇచ్చే వెబ్సైట్ పై కూడా జెరెమి కర్బిన్ గురించి ఇదే సమాచారము ఇవ్వబడింది.
దర్యాప్తును కొనసాగిస్తూ, ఏము బిబిసి డాక్యుమెంటరీ ‘ఇండియా: ది మోడి క్వశ్చన్’ కొరకు సెర్చ్ చేయడం ప్రారంభించాము. బిబిసి యూకే వెబ్సైట్ పై సమాచారము ప్రకారము, డాక్యుమెంటరీ నిర్మాత రిచర్డ్ కుక్సన్ మరియు ఎక్సిక్యూటివ్ నిర్మాత మైక్ రాడ్ఫోర్డ్.
మరిన్ని వివరాల కొరకు మేము కాంగ్రెస్ విలేఖరి అభిమన్యు త్యాగిని సంప్రదించాము. ఈ వైరల్ క్లెయిమ్ అసత్యము అని ఆయన చెప్పారు. చిత్రములో కనిపించే వ్యక్తి యూకే మంత్రి జెరెమి కర్బిన్ మరియు శాం ప్రిట్రోడ. ఈ ఫోటో అనేక నెలల క్రితం తీసినది. ఇటువంటి సోషల్ మీడియా పోస్ట్ లు రాహుల్ గాంధి యొక్క పేరుప్రతిష్ఠలకు కళంకాన్ని ఆపాదించుటకు షేర్ చేయబడ్డాయి.
పోస్ట్ షేర్ చేసిన ఫేస్బుక్ యూజర్ భూషణ్ గోసావి యొక్క ప్రొఫైల్ ను మేము స్కాన్ చేశాము. వీరు ఒక భావజాలముచే ప్రభావితం అయ్యారు అని మేము కనుగొన్నాము. యూజర్ యొక్క ప్రొఫైల్ పై అందించబడిన సమాచారము ప్రకారము, ఆయన ఫ్రాన్స్ నివాసి. ఈ యూజర్ కు ఫేస్బుక్ పై 100 మందికి పైగా ఫ్రెండ్స్ ఉన్నారు.
ముగింపు: రాహుల్ గాంధితో నిలబడిన వ్యక్తులు పిఎం మోడి మరియు 2002 గుజరాత్ అల్లర్లపై బిబిసి డాక్యుకెంటరీ నిర్మాతలు కాదని తన దర్యాప్తులో విశ్వాస్ న్యూస్ కనుగొనింది. చిత్రములో గాంధితో కలిసి నిలబడిన మొదటి వ్యక్తి మాజీ యూకే లేబర్ పార్టీ నేత జెరెమి కర్బిన్ మరియు రెండవ వ్యక్తి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారి సలహాదారు శాం పిట్రోడ.
Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923