వాస్తవ తనిఖీ: తలనొప్పి కోసం ఆస్పిరిన్ కంటే బాదాములు బాగా పనిచేస్తాయి అని క్లెయిమ్ చేసే పోస్ట్ తప్పుదోవపట్టించేది
తలనొప్పికి ఆస్పిరిన్ కంటే బాదాములు బాగా పనిచేస్తాయి అని క్లెయిమ్ చేసే వైరల్ పోస్ట్ తప్పుదోవపట్టించేది. ఆస్పిరిన్ కు బదులుగా బాదాములను ఉపయోగించవచ్చు అని ధృవీకరించటానికి ఎలాంటి శాస్త్రీయ రుజువు లేదు.
- By: Urvashi Kapoor
- Published: Apr 10, 2022 at 01:59 PM
- Updated: Apr 17, 2022 at 09:03 PM
కొత్త ఢిల్లీ (విశ్వాస్ న్యూస్): ఆస్పిరిన్ కంటే బాదాములు బాగా పనిచేస్తాయి అని సోషల్ మీడియాపై వైరల్ అయిన ఒక పోస్ట్ క్లెయిమ్ చేస్తోంది. మీకు తలనొప్పిగా ఉంటే 10–12 బాదాములు తినాలని ఈ పోస్ట్ సూచిస్తోంది. అంతేకాకుండా 10-12 బాదాములు రెండు ఆస్పిరిన్ మాత్రలు తీసుకోవడానికి సమానమని ఈ పోస్ట్ క్లెయిమ్ చేస్తోంది. విశ్వాస్ న్యూస్ దర్యాప్తు చేసి ఈ క్లెయిమ్ తప్పుదోవపట్టించేది అని కనుగొనింది.
క్లెయిమ్
ఒక సోషల్ మీడియా పోస్ట్ లో ఇలా ఉంద్: తలనొప్పికి ఉపశమనం. ఈసారి మీకు తలనొప్పి వస్తే, 10-12 బాదాములు తినండి, ఇవి రెండు ఆస్పిరిన్ మాత్రలకు సమానం.”
ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వర్షన్ ను ఇక్కడ చూడవచ్చు.
దర్యాప్తు
విశ్వాస్ న్యూస్ దర్యాప్తు చేసి ఆస్పిరిన్ అనే మాత్ర సాలిసైలేట్స్ అని పిలువబడే ఒక ఔషధాల వర్గానికి చెందినది అని కనుగొనింది. ఇది జ్వరము, నొప్పి, వాపు మరియు రక్తం గడ్డకట్టడం వంటివాటిని కలిగించే కొన్ని సహజ పదార్థాల ఉత్పత్తిని ఆపడము ద్వారా పనిచేస్తుంది.
మేము మరింతగా విచారించిన మీదట నేషనల్ లైబ్రరీ ఆఫ్ మీడియా వారి వెబ్సైట్ పై 2001 ఒక నివేదిక కనుగొన్నాము, ఇందులో ఆస్పిరిన్ అనేది తేలికపాటి తలనొప్పికి ఉపశమనం కలిగించుటకు సైక్లోఆక్సిజెనేస్ (COX)-1 లేదా -2 యాక్టివిటిని టార్గెట్ చేయడము ద్వారా ప్రోస్టాగ్లాండిన్ యొక్క ఉత్పత్తిని నిరోధించే సాలిసైలేట్స్ వర్గానికి చెందిన ఒక అసిటైలేటెడ్ సాలిసైలేట్ అని పేర్కొనబడింది.
అన్ని రూపాలలో సాలిసైలేట్స్ ను అధికంగా ఉపయోగించదము వలన తలనొప్పి కలుగవచ్చు అని మరొక నివేదిక తెలుపుతోంది.
సిడ్నీ లోకల్ హెల్త్ జిల్లా, ఎన్ఎస్డబ్ల్యూ ప్రభుత్వము వారి ఒక నివేదిక ప్రకారము, బాదాములలో కూడా సాలిసైలేట్స్ ఉంటాయి. సాలిసైలేట్ లో సాలిసిన్ సహజంగా-ఉత్పన్నం అవుతోంది కాబట్టి, బాదాములు తలనొప్పిని లేదా మైగ్రేన్ ను కూడా పూర్తిగా తగ్గించగలవు అని విశ్వసించబడుతోంది.
మరికొన్ని అధ్యయనాలు కూడా తలనొప్పులకు బాదాములు ప్రభావవంతంగా పనిచేస్తాయి అని సూచిస్తున్నాయి.
ఒక బయోమెడ్సెంట్రల్ అధ్యయనము భోజనము మరియు తలనొప్పి మధ్య ఉన్న సంబంధాన్ని విశ్లేషించింది. దానిని ఇక్కడ చదవచ్చు.
అయినప్పటికీ, పైన పేర్కొనబడిన ఏ అధ్యయనము కూడా భోజనము తలనొప్పిని తగ్గిస్తుంది అనే యంత్రాంగము గురించి వివరించలేదు. అందుచేత, బాదాములు తలనొప్పిని తగ్గిస్తాయి లేదా తలనొప్పి చికిత్సలో ఆస్పిరిన్ బదులుగా బాదాములు తీసుకోవచ్చు అని తెలుపుటకు మరింత పరిశోధన చేయవలసి ఉంది.
విశ్వాస్ న్యూస్ డా. అభిషేక్ జునేజా, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్, మహారాజా అగ్రసేన్ ఆసుపత్రి, డా. జునేజాస్ న్యూరో సెంటర్ ను సంప్రదించారు. ఆయన “ఆస్పిరిన్ కు బదులుగా బాదాములు వాడవచ్చు అని ధృవీకరించేందుకు ఎలాంటి శాస్త్రీయ రుజువు లేదు. బాదాములు ఆరోగ్యకరమైన ఆహారముగా పరిగణించబడినప్పటికీ, అవి తలనొప్పి నుండి ఉపశమనానికి ఉపయోగించవచ్చు అనటానికి ఎలాంటి శాస్త్రీయ రుజువు లేదు.”
ఈ పోస్ట్ ను ఫేస్బుక్ పై ‘న్యూట్రీషనిస్ట్ ఆలిజయ్ ఖట్టక్’ అనే పేజ్ ద్వారా షేర్ చేయబడింది. మేము ఆ పేజ్ ను స్కాన్ చేసి భోజనము మరియు పోషణ గురించి అనేక పోస్ట్ లు ఉన్నాయని కనుగొన్నాము. ఈ పేజ్ కు 65 మంది ఫాలోయర్స్ ఉన్నారు.
निष्कर्ष: తలనొప్పికి ఆస్పిరిన్ కంటే బాదాములు బాగా పనిచేస్తాయి అని క్లెయిమ్ చేసే వైరల్ పోస్ట్ తప్పుదోవపట్టించేది. ఆస్పిరిన్ కు బదులుగా బాదాములను ఉపయోగించవచ్చు అని ధృవీకరించటానికి ఎలాంటి శాస్త్రీయ రుజువు లేదు.
- Claim Review : ఒక సోషల్ మీడియా పోస్ట్ లో ఈ విధంగా వ్రాయబడింది: తలనొప్పికి ఉపశమనం. ఈసారి మీకు తలనొప్పి వస్తే, 10-12 బాదాములు తినండి, ఇవి రెండు ఆస్పిరిన్ మాత్రలకు సమానం.”
- Claimed By : న్యూట్రీషనిస్ట్ అలీజాయ్ ఖాట్టక్
- Fact Check : Misleading
Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.