X
X

వాస్తవ తనిఖీ: రావి ఆకులకు ఔషధ గుణాలు ఉండవచ్చు కానీ కోవిడ్-19 రోగుల కొరకు వైద్య ఆక్సిజన్‌కు ప్రత్యామ్నాయంగా ఉపయోగించలేము; ఒక నకిలీ పోస్ట్ వైరల్ అవుతోంది

ముగింపు: విశ్వాస్ న్యూస్ దర్యాప్తు చేసింది మరియు వైరల్ అయిన క్లెయిమ్ నకిలీది అని కనుగొనింది మరియు దీనికి ఎలాంటి శాస్త్రీయ నిరూపణలు లేవు. రావి ఆకులలో ఔషధ గుణాలు ఉండవచ్చు కానీ దాని వాసన కోవిడ్-19 రోగులకు వైద్య ఆక్సిజన్ లాగా పనిచేయదు.

గాజు కూజాలో కొన్ని రావి ఆకులు (పవిత్ర ఫిగ్) వేసి దాని వాసన పీల్చుకోవడము వలన ఆక్సిజన్ 4-5 పాయింట్ల వరకు పెరుగుతుందని తెలిపే ఒక పోస్ట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అంతేకాకుండా ఆ కూజాలో ఒక కర్పూరం బిల్లా ఉంచడం వలన మరింత మెరుగైన ఫలితాలు ఉంటాయని కూడా ఆ పోస్ట్ క్లెయిమ్ చేస్తోంది. విశ్వాస్ న్యూస్ వారు దర్యాప్తు చేసి ఈ వైరల్ క్లెయిమ్ నకిలీది అని, దీనికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవని కనుగొన్నారు.

క్లెయిమ్

విశ్వాస్ న్యూస్ తన వాట్సాప్ చాట్‌బాత్ పై దీని గురించిన వాస్తవ తనిఖీ కొరకు ఒక అందుకుంది. ఆ సందేశం ఇలా ఉంది: “ఒకవేళ ఆక్సిజన్ స్థాయి తగ్గిపోతూ ఉంటే మరియు ఎక్కడి నుండి ఆక్సిజన్ సరఫరా లేకపోతే, ఒక గాజు కూజాలో 4-5 తాజా రావి ఆకులు వేసి, అయిదు నుండి ఏడు నిమిషాల వరకు మూత మూసివేయాలి. తరువాత మూత తీసి ముక్కు మరియు నోటి వెంబడి దాని వాసన పీల్చుకోవాలి. ఇలా చేస్తే ఆక్సిజన్ స్థాయి తక్షణమే 4-5 పాయింట్లు పెరుగుతుంది. ఈ పద్ధతిని మీరు మళ్ళీ మళ్ళీ చేయవచ్చు. ఆ కూజాలో ఒక కర్పూరం బిళ్ళను ఉంచడము వలన మరింత మెరుగైన ఫలితాలను అందుకోవచ్చు. దయచేసి మీరు ఇలా చేయండి మరియు ఇతరులకు కూడా చెప్పండి. ఇది ఉచితంగానే లభిస్తుంది మరియు గుణకరమైనది.”

దర్యాప్తు

రావి చెట్టు మరియు దాని ఆకుల గుణాలను శోధించడము ద్వారా విశ్వాస్ న్యూస్ తన దర్యాప్తును ప్రారంభించింది . Ficus religiosa (L.), సాధారణంగా రావి అని పిలువబడే ఈ చెట్టు మొరాషియే కుటుంబానికి చెందినది. ఇది సంప్రదాయికంగా  గానోరియా మరియు చర్మ వ్యాధుల చికిత్సలో యాంటీఅల్సర్, యాంటీబ్యాక్టీరియాల్, యాంటీడయాబెటిక్ గా ఉపయోగించబడుతుంది.

కానీ, రావి ఆకుల నుండి ఆక్సిజన్ ను వైద్య ఆక్సిజన్ కు ప్రత్యామ్నాయంగా ఉపయోగించవచ్చు అనటానికి ఎలాంటి శాస్త్రీయ నిరూపణ లేదు.

డా. విమల్ ఎన్, ఫార్మాకోవిజిలెన్స్ అధికారి మరియు ఆయుర్వేద నిపుణుడు, ప్రకారము, ఈ వైరల్ పోస్ట్ యొక్క క్లెయిమ్ నకిలీది. ఆయన “సాధారణ ఆవిరి పీల్చుకోవడం గాలి మార్గాలలోని అవరోధాలను తొలగించవచ్చు లేదా గొంతుకు ఉపశమనం కలిగించవచ్చు. కానీ రావి ఆకులు లేదా కర్పూరము వాసనను పీల్చుకోవడం వైద్య ఆక్సిజన్ కు ప్రత్యామ్నాయం కాదు.” అన్నారు.

విశ్వాస్ న్యూస్ రిజిస్ట్రార్ కార్యాలయము, అటవీ పరిశోధనా సంస్థ, డెహ్రాడూన్ లోని ఒక అధికారితో మాట్లాడారు. ఆయన ఇలా అన్నారు, చెట్లు పర్యావరణాన్ని పరిశుభ్రంగా ఉంచడములో కీలక పాత్ర పోషించినప్పటికీ, వాటిని కోవిడ్-19 రోగులకు అవసరమైన వైద్య ఆక్సిజన్ స్థానములో ఉపయోగించలేము. అదే రావి చెట్టు విషయములో కూడా వర్తిస్తుంది. రావి ఆకులు లేదా కర్పూరాన్ని పీల్చడము వైద్య ఆక్సిజన్ స్థాయిని పెంచుతుంది అని తెలిపే ఈ క్లెయిమ్ వాస్తవం కాదు.

కర్పూరం గురించి పరిశోధించినప్పుడు, మాకు సెంటర్స్ ఫర్ డీసీస్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) యొక్క వెబ్సైట్ పై ఒక నివేదిక లభించింది. CDC ప్రకారం 2-కాంఫోనన్, గం కాంఫర్, లారెల్ కాంఫర్, సింథటిక్ కాంఫర్ కు బహిర్గతం కావడం వలన కళ్ళు, చర్మము, మ్యూకస్ పొరలపై మంట రేపవచ్చు; వికారము, వాంతులు, విరేచనాలు కలగవచ్చు; తలనొప్పి, తలతిరగడం, ఉద్రేకము, ఎపిలెప్టిఫార్మ్ మూర్చలు కలగవచ్చు.

निष्कर्ष: ముగింపు: విశ్వాస్ న్యూస్ దర్యాప్తు చేసింది మరియు వైరల్ అయిన క్లెయిమ్ నకిలీది అని కనుగొనింది మరియు దీనికి ఎలాంటి శాస్త్రీయ నిరూపణలు లేవు. రావి ఆకులలో ఔషధ గుణాలు ఉండవచ్చు కానీ దాని వాసన కోవిడ్-19 రోగులకు వైద్య ఆక్సిజన్ లాగా పనిచేయదు.

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!

Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.

ట్యాగ్స్

Post your suggestion

No more pages to load

సంబంధిత వ్యాసాలు

Next pageNext pageNext page

Post saved! You can read it later