కొత్త ఢిల్లీ, విశ్వాస్ న్యూస్– బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ నటించిన, ఒక ఎత్తైన భవనముపై నుండి ఒక యువకుడు కిందికి దూకుతున్న, ఒక యాక్షన్ దృశ్యము యొక్క క్లిప్పింగ్ సోషల్ మీడియా ప్లాట్ఫార్మ్స్ పై వైరల్ అవుతోందిఈ వీడియోను షేర్ చేసిన యూజర్లు ఇది షారుఖ్ ఖాన్ నటించిన, సెప్టెంబరు 7న థియేటర్లలో విడుదల కాబోయే చిత్రం జవాన్ లోని ఒక యాక్షన్ దృశ్యము అని క్లెయిమ్ చేశారు. విశ్వాస్ న్యూస్ దర్యాప్తు చేసింది మరియు ఈ వైరల్ వీడియో 2018 నాటి బెంగాలీ చిత్రములోని ఒక దృశ్యము అని కనుగొనింది. దీనికి షారుఖ్ ఖాన్ చిత్రం ‘జవాన్’ కు ఎలాంటి సంబంధం లేదు.
ఫేస్బుక్ యూజర్ ఆర్ అహ్మద్ (ఆర్కైవ్) వైరల్ పోస్ట్ ను షేర్ చేశారు మరియు ఇలా వ్రాశారు, ‘#లీక్ అయిన జవాన్ యాక్షన్ దృశ్యము – మేము #జవాన్ యొక్క మాస్ + క్లాస్ యాక్షన్ సీక్వెన్స్ లకు మేము సిద్ధంగా లేము. అంగార్ హై బాస్.”
మా దర్యాప్తును ప్రారంభిస్తూ, మేము వీడియో నుండి కీఫ్రేమ్స్ ను సంగ్రహించాము మరియు వాటిని సెర్చ్ చేయడం కోసం గూగుల్ లెన్స్ ఉపయోగించాము. ఈ వీడియో వివిధ సోషల్ మీడియా ప్లాట్ఫార్మ్స్ పై ఇదే వైరల్ క్లెయిమ్ తో షేర్ చేయబడి ఉంది. వెరిఫై చేయబడిన ట్విట్టర్ యూజర్ Sahir కూడా వీడియో షేర్ చేసే సమయములో ఇటువంటి అసత్యపు క్లెయిమ్స్ చేశారు. వీడియోకు 73,000 వీక్షణలు మరియు 1,000పైగా లైక్స్ వచ్చాయి.
అయితే, వ్యాఖ్యల విభాగములో, ‘రాహుల్ పాల్’ అనే ఒక యూజర్ ఈ వీడియోలో ఉన్న వ్యక్తి మన్సూర్ ఖాన్, ఒక బాడీ డబల్, అని మరియు ఈ దృశ్యము బెంగాలీ చిత్రములోనిది అని స్పష్టం చేశారు. వైరల్ వీడియోలో ఉన్న దృశ్యము మాదిరిగానే ఉన్న యూజర్ మన్సూర్ ఏ ఖాన్ యొక్క వెరిఫై చేయబడిన ఇన్స్టాగ్రాం హ్యాండిల్ యొక్క స్క్రీన్‌షాట్ ను చేర్చారు.
ఈ పునాది ఆధారంగా, “మన్సూర్ ఖాన్ + బాడీ డబల్” అనే కీవర్డ్స్ ఉపయోగించి గూగుల్ పై సెర్చ్ చేస్తూ మేము మా దర్యాప్తును కొనసాగించాము. సెర్చ్ ఫలితాలలో, మాకు మన్సూర్ ఖాన్ యొక్క ఇన్స్టాగ్రాం హ్యాండిల్ మరియు ఆయనకు సంబంధించిన అనేక మీడియా రిపోర్ట్స్ కనిపించాయి.
మన్సూర్ఏఖాన్13, తన వెరిఫైడ్ ఇన్స్టాగ్రాం హ్యాండిల్ పై, ఆగస్ట్ 18, 2023 నాడు ఈ వీడియోను షేర్ చేస్తూ ఇలా పేర్కొన్నారు, “నేను ఈ స్టంట్ ను బాఘ్ బంధి ఖేలా కొరకు 2018లో బ్యాంకాక్ లోని క్యాట్ టవర్ వద్ద చేశాను.”
ఆరోపించబడిన చోరీ మరియు ‘జవాన్’ చిత్రము నుండి కొన్ని క్లిప్స్ యొక్క ఆన్లైన్ లీక్స్ కు సంబంధించి ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ చేయబడింది అని రిపోర్ట్స్ సూచిస్తున్నాయి. వైరల్ పోస్ట్ యొక్క ప్రామాణికతను వెరిఫై చేయుటకు, మేము మా సహోద్యోగి స్మిత శ్రీవాత్సవ, దైనిక్ జాగరణ్ వద్ద ఎంటర్టెయిన్మెమ్ట్ రిపోర్టర్ ను కలిశాము. ఆమె ఈ వైరల్ వీడియో ‘జవాన్’ చిత్రానికి సంబంధించినది కాదని ధృవీకరించారు.
తప్పుదోవపట్టించే పోస్ట్ ను షేర్ చేసిన ఫేస్బుక్ పేజ్ యొక్క సోషల్ స్కాన్ చేసిన సమయములో, చాలావరకు వినోద-సంబంధ కంటెంట్ ఈ పేజ్ నుండి వస్తుంది అని మేము గమనించాము.
ముగింపు: తన దర్యాప్తు తరువాత, ఈ వైరల్ వీడియో దృశ్యము 2018 బెంగాలి చిత్రములోనిది అని విశ్వాస్ న్యూస్ నిర్ణయించింది. దీనికి షారుఖ్ ఖాన్ చిత్రము ‘జవాన్’ కు ఎలాంటి సంబంధం లేదు.
Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923