X
X

Fact Check: X పై కరీనా కపూర్ ఖాన్ లేదు, క్రికెట్ పై వైరల్ పోస్ట్ ఫ్యాన్ పేజ్ ద్వారా షేర్ చేయబడింది

కొత్త ఢిల్లీ (విశ్వాస్ న్యూస్): మైక్రోబ్లాగింగ్ సైట్ X పై ఒక ఖాతా నుండి కొన్ని పోస్టులు బాలీవుడ్ నటి కరీనా కపూర్ ఖాన్ పేరున షేర్ చేయబడుతున్నాయి. ఈ పోస్టులలో, కరీనా కపూర్ ఉన్న ఒక ప్రొఫైల్ చిత్రము ఉంది, దీని యూజర్‎నేమ్ ‘కరీనా కపూర్ ఖాన్’ అని ఉంది. ఈ పోస్టులలోని విషయములో “ముందు సిరాజ్ మరియు ఇప్పుడు షమి. భారత క్రికెట్ జట్టులో ఏం జరుగుతోంది?” వంటి వ్యాఖ్యలు ఉన్నాయి. ఈ వ్యాఖల వెంబడి “వికెట్ జిహాద్” అనే హ్యాష్‎ట్యాగ్ ఉంది. కొంతమంది సోషల్ మీడియా యూజర్లు, ఇవి కరీనా కపూర్ పెట్టిన పోస్టులు అని, యూజర్స్ నుండి అభిప్రాయాలను కోరుతున్నారని భావించి వీటిని షేర్ చేస్తున్నారు. ఇదే సమయములో, మరికొంతమంది యూజర్లు ఈ X ఖాతా నుండి ఇతర పోస్టులను కూడా షేర్ చేస్తున్నారు.

కరీనా కపూర్ ఖాన్ X (ఇదివరకు ట్విట్టర్) పై లేదని తన దర్యాప్తులో విశ్వాస్ న్యూస్ కనుగొనింది. ఈ వైరల్ పోస్ట్ ఆమె పేరుతో సృష్టించబడిన ఒక ఫ్యాప్ పేజ్ ఖాతా నుండి తీసుకోబడింది, దీనిని సోషల్ మీడియా యూజర్లు షేర్ చేస్తున్నారు.

క్లెయిమ్:

X యూజర్ కరీనా కపూర్ ఖాన్ @kareena_kpn (ఆర్కైవ్ లింక్) సెప్టెంబరు 22న మొహమ్మద్ షమీ చిత్రాన్ని పోస్ట్ చేశారు మరియు ‘ముందు సిరాజ్, ఇప్పుడు షమీ. భారత క్రికెట్ జట్టులో ఏం జరుగుతోంది? వికెట్_జిహాద్” అని వ్రాసింది.

ఫేస్‎బుక్ యూజర్ ‘ఫర్దీన్ ఖాన్‘ (ఆర్కైవ్ లింక్) ఈ పోస్ట్ ను షేర్ చేసి ఇలా వ్రాశారు, “ఆస్ట్రేలియన్స్ ‘సుర్మ’ షమి చేతిలో ఓడిపోయారు, మొహమ్మద్ షమి తన పంజాను విప్పాడు….కరీనా కపూర్ యొక్క ఈ ట్వీట్ పై మీ అభిప్రాయము….”.

ఫేస్‎బుక్ యూజర్ ‘బిందాస్ హర్యాణా న్యూస్ (ఆర్కైవ్ లింక్) X ఖాతా ద్వారా చేయబడిన మరొక రెండు పోస్టుల స్క్రీన్ షాట్స్ ను కరీనా కూపర్ ఖాన్ పేరున షేర్ చేయబడ్డాయి.

మరొక యూజర్  (ఆర్కైవ్ లింక్) కూడా ఈ ఖాతాలో చేయబడిన పోస్ట్ ను షేర్ చేశారు.

దర్యాప్తు:

వైరల్ క్లెయిమ్ గురించి దర్యాప్తు చేయుటకు, మేము ముందుగా వైరల్ పోస్ట్ ఉన్న X ఖాతా ను స్కాన్ చేశాము. ‘కరీనా కపూర్ ఖాన్’ పేరున చేయబడిన ఈ ఖాతాపై నీలం టిక్స్ ఉన్నాయి. ఇది ఫ్యాన్ పేజ్ అని ఖాతా యొక్క బయో పేర్కొనింది. మార్చ్ 2022లో సృష్టించబడిన ఈ ఖాతాకు 1,17,000 పైగా యూజర్లు ఉన్నారు.

ఈ ఖాతాకు సెప్టెంబరు 2023లో నీలం టిక్ వచ్చింది.

దీని తరువాత మేము కరీనా కపూర్ ఖాన్ యొక్క నిజమైన X-ఖాతా గురించి సెర్చ్ చేశాము, కాని అలాంటిది ఏది మాకు కనిపించలేదు. కీవర్డ్స్ తో గూగుల్ పై సెర్చ్ చేసినప్పుడు, మాకు అమర్ ఉజాలా లో ఆగస్ట్ 10, 2022 ప్రచురించబడిన వార్తలు మాకు కనిపించాయి. అందులో, “ఆమిర్ ఖాన్ మరియు కరీనా కపూర్ ఖాన్ నటించిన సినిమా ‘లాల్ సింగ్ ఛద్దా’ విడుదలకు ముందు, దానిని సోషల్ మీడియాపై బహిష్కరించాలి అని డిమాండ్ చేయబడింది. దీనికి సంబంధించి కరీనా కపూర్ ప్రజలపై కోపంగా ఉన్నారు. ప్రజలు తన సినిమాను చూస్తారా లేదా అని తాను పట్టించుకోదు అని ఈ చిత్రాన్ని బహిష్కరించిన వారికి కరీనా చెప్పింది. ఇటువంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయని, వీటివల్ల నటులను ఏదో ఒకటి అంటూ ఉంటారని, అందుకే ఆమె ట్విట్టర్ పై లేదని ఇటీవల ఆమె చెప్పారు.

టైమ్స్ ఆఫ్ ఇండియా లో ఆగస్ట్ 10, 2022పై ప్రచురించబడిన నివేదికలో, కరీనా కపూర్ ఖాన్ ఇన్స్టాగ్రాం పై యాక్టివ్ గా ఉన్నారని, కాని ట్విట్టర్ పై లేదని వ్రాయబడింది.

దీనికి సంబంధించి, పరాగ్ ఛపేకర్, ముంబైలో సీనియర్ ఎంటర్టెయిన్మెంట్ విలేఖరి, ఇలా అన్నారు, “కరీనా కపూర్ ఇన్స్టాగ్రాం పై ఉన్నారు కాని X పై కాదు. ఇది ఆమె పేరున సృష్టించబడిన ఒక నకిలీ ఖాతా.”

అలాగే, సోను నిగం చిత్రము కూడా X పై ఒక పారడీ ఖాతాపై పోస్ట్ చేయబడింది, యూజర్లు ఈ పోస్ట్ ను సోను నిగం యొక్క నిజమైన ఖాతా నుండి చేయబడింది అని అనుకున్నార్. విశ్వాస్ న్యూస్ యొక్క వాస్తవ తనిఖీ నివేదికను ఇక్కడ చదవవచ్చు.

చివరిగా, మేము ఫ్యన్ పేజ్ ద్వారా చేయబడిన పోస్ట్ యొక్క స్క్రీన్ షాట్ ను షేర్ చేసిన ఫేస్‎బుక్ user ప్రొఫైల్ ను స్కాన్ చేశాము. ఈ యూజర్ ముంబై నివాసి, మరియు 38,000 ఫాలోయర్స్ ఉన్నారు.

ముగింపు:  కరీనా కపూర్ ఖాన్ X పై యాక్టివ్ గా లేరు. వైరల్ పోస్ట్ ఆమె పేరున సృష్టించబడిన ఫ్యాన్ పేజ్ నుండి పోస్ట్ చేయబడింది.

  • Claim Review : X పై షమి, సిరాజ్ మరియు వికెట్ జిహాద్ గురించి కరీనా కపూర్ ఖాన్ యొక్క పోస్టులు.
  • Claimed By : ఎఫ్‎బి యూజర్: ఫర్దీన్ ఖాన్
  • Fact Check : False
False
Symbols that define nature of fake news
  • True
  • Misleading
  • False

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!

Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.

ట్యాగ్స్

Post your suggestion

No more pages to load

సంబంధిత వ్యాసాలు

Next pageNext pageNext page

Post saved! You can read it later